టాలీవుడ్ నటుడు, నందు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ (Psych Siddhartha Movie). పేరుకు తగ్గట్లే సినిమాలో బూతులకు కొదవే లేదు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యామిని భాస్కర్ హీరోయిన్. ఇటీవల రిలీజైన టీజర్ మొత్తం బూతులతోనే నిండిపోయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. బ్లూ ఎల్లో కలిపితే రెడ్ అవుతాది అంటూ సాగే ఈ పాట వెరైటీగా ఆకట్టుకుంటోంది.
వదిలేసి వెళ్లిపోయింది
సిగరెట్స్ లంగ్స్‌కు అస్సలు మంచిది కాదు.. అయినా అందరూ ఇంటర్వెల్‌లో కాలుస్తారు. ఆల్కహాల్.. లివర్‌కు అస్సలు మంచిది కాదు. అయినా అందరూ బేబీ సినిమా చూసొచ్చి తాగుతారు. అట్లనే లవ్.. హార్ట్‌కు అస్సలు మంచిది కాదు. అయితే మీరందరు లవ్ చేసిర్రని తెలుసు.. నేను కూడా అట్లనే చేశిన.. కానీ, ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయిందిరా అంటూ ఏడుపందుకున్నాడు నందు. ఆ తర్వాత అసలు పాట మొదలైంది.
కలర్స్ సాంగ్
'బ్లూ, ఎల్లో కలిసినాయంటే గ్రీన్ ఒస్తాది.. రెడ్, ఎల్లో కలిసినాయంటే ఆరెంజ్ ఒస్తాది.. బ్లాక్.. నలుపాయే జిందగీ నువ్వెళ్లిపోతే చెలి' అంటూ పాట సాగింది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ పాటను జెస్సీ గిఫ్ట్ ఆలపించాడు. పాట వెరైటీగా భలే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: దండం పెడ్తా.. పంపించు బిగ్‌బాస్: అడుక్కున్న సోహైల్


