ట్రోలింగ్‌ను ఎదుర్కోని హీరో లేడు. కెరీర్ తొలినాళ్లలో దారుణమైన ట్రోల్స్ చూశాడు అల్లు అర్జున్. 'గంగోత్రి' సినిమాలో అతడు ఆడవేషం కడితే అందరూ పడీపడీ నవ్వారు. అదే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీలో చీరకట్టి తాండవం చేస్తే అదుర్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
నాలుగు సార్లు రిపీట్
హీరోగా తన తొలి సినిమా గంగోత్రితో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్నీ తర్వాతి మూవీ 'ఆర్య'తో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'ఆర్య 2'తో వీరి కాంబినేషన్ మరోసారి హిట్టు అని నిరూపితమైంది. ఆ ధైర్యంతోనే ముచ్చటగా మూడోసారి జత కట్టి 'పుష్ప' సినిమా తీశారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందడంతో పాటు భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది.

ఎనలేని గౌరవం
పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన 'పుష్ప 2' చిత్రం అయితే రికార్డులు తిరగరాసింది. అల్లు అర్జున్‌ను తిరుగులేని పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. తనకు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన సుకుమార్ అంటే బన్నీకి ఎనలేని గౌరవం. తన కెరీర్ తారాజువ్వలా వెలగడానికి ఆయనే కారణమని బలంగా నమ్ముతాడు. ఈరోజు (జనవరి 11న) సుకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
నా జీవితాన్ని మార్చేసిన రోజు
హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. ఈరోజు నీకంటే కూడా నాకే ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇదే! నువ్వు నా జీవితంలో ప్రసాదించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. పుట్టినందుకు థాంక్స్ సుకుమార్ అంటూ రెండు ఫోటోలు షేర్ చేశాడు. ఈ పోస్ట్ కింద అభిమానులు 'పుష్ప 3' కోసం వెయిటింగ్ అని కామెంట్లు చేస్తున్నారు.
Happy Birthday, darling.
It’s a special day for me… more than for you… because this day changed my life. No amount of wishes can convey the joy of having you in my life. #HBDSukumar
Puttinandhuku thanks!!! 🖤
(Copyrights @pnavdeep26 ) pic.twitter.com/mJ7jNBmFQa— Allu Arjun (@alluarjun) January 11, 2026


