‘‘ప్రతి సంక్రాంతికీ నా సినిమా ఉండాలని నేను కోరుకోవడం లేదు. ఈ బ్రాండ్ నాకు వద్దు. కుదిరినప్పుడల్లా సంక్రాంతికి వచ్చి కుర్రాడు ఏదో నవ్విస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటే చాలు’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూ΄÷ందిన తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం రేపు(సోమవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ రావిపూడి
పంచుకున్న విశేషాలు...
→ ఈ సినిమా అంతా చిరంజీవిగారు చేసిన శంకరవరప్రసాద్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగుతుంది. ఈ తరహా సినిమా చేయడం నాకు కూడా కొత్తే. ఈ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ రైడ్ కూడా ఉంది. భార్యా భర్తల మధ్య ఓ ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాను. చిరంజీవిగారు సెల్ఫ్ సెటైర్స్ వేసుకున్నారు. అది ఆయన గొప్పదనం. ఇది ఆడియన్స్‌ను అలరించడానికి మాత్రమే.
→ కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్‌మేన్ వెంకీ గౌడ అనే పాత్రలో వెంకటేశ్‌గారు నటించారు. చిరంజీవి, వెంకటేశ్‌గార్ల కాంబినేషన్ సీన్స్ 20 నిమిషాలు ఉంటాయి. వారితో షూటింగ్ చేసిన సమయం నా లైఫ్‌లో మెమొరబుల్ మూమెంట్. మా సినిమా టికెట్ ధరలు ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉండాలని, చిరంజీవిగారు స్ట్రిక్ట్‌గా చెప్పారు. దీంతో మేం నార్మల్ హైక్స్ కోసమే రిక్వెస్ట్ పెట్టుకున్నాం.
→ ఈ సినిమాలోని హుక్‌స్టెప్ సాంగ్ బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ పాటకు బదులు మేం ముందుగా మరో మెలోడీ ట్యూన్ అనుకున్నాం. కానీ, ఆ తర్వాత వద్దనుకుని లాస్ట్ షెడ్యూల్‌లో ఈ ‘హుక్ స్టెప్’ సాంగ్‌ను షూట్ చేశాం. ఫైనల్‌గా ఇలా మెగా మ్యాజిక్ జరిగింది. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.
→ నా సినిమాల ప్రొడక్షన్స్ , బడ్జెట్ విషయాల్లో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అయితే నా లైఫ్‌లో నేను ప్రొడక్షన్స్ , డిస్ట్రిబ్యూషన్ చేయను. ఇక సోషల్ మీడియాలో నాపై కొన్ని విమర్శలు వస్తుంటాయి. పొగడ్తలను స్వీకరిస్తున్నప్పుడు, విమర్శలను కూడా తీసుకోవాలి. అందుకే నేను దేనికీ A. నన్ను విమర్శించినా నవ్వుతా.. పొగిడినా నవ్వుతా. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణగార్లతో సినిమాలు చేశాను. నాగార్జునగారితో కూడా సినిమా చేయాలని ఉంది. అవకాశం కోసం చూస్తున్నాను. నా కొత్త సినిమా ఇంకా ఖరారు కాలేదు.


