తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో చిట్టచివరి కెప్టెన్సీ టాస్క్ జరగబోతోంది. ఈ కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్లను వినూత్నంగా సెలక్ట్ చేస్తున్నాడు బిగ్‌బాస్. గత సీజన్లలోని ఫైనలిస్టులతో పోటీపడి గెలిచి కంటెండర్‌షిప్ సాధించమని సవాలు విసిరాడు. అలా ఇప్పటికే ప్రియాంక జైన్‌ను ఓడించి కల్యాణ్, మానస్‌ను ఓడించి పవన్ కంటెండర్స్ అయ్యాడు.

సోహైల్ ఎంట్రీ
ఈరోజు సోహైల్ (Syed Sohel Ryan) బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో వదిలారు. బిగ్‌బాస్ 4 ఫైనలిస్ట్ సోహైల్ వచ్చాడంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా లేనట్లే! అదే విషయం ప్రోమోలోనూ చూపించారు. నాన్‌వెజ్ అంటే చాలు పడిచచ్చే సోహైల్.. ఈ సీజన్‌లోని కంటెస్టెంట్స్ మొదటి ఆరువారాలు ముక్క తినలేదని తెలిసి షాకయ్యాడు.
దండం పెడ్తా..
నా ఇజ్జత్‌కే సవాల్.. నీకు దండం పెడ్తా.. వీళ్లకు రెండు పాలప్యాకెట్లు, ఒక కాఫీ పౌడర్, కిలో చికెన్ పంపించండి అని కెమెరాల ముందు అడిగాడు. అందరిముందు బిగ్‌బాస్‌కు ఆర్డరేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన సోహైల్.. నీకు దండం పెడ్త, నీ కాళ్లు మొక్కుతా... పంపించు అని అడుక్కున్నాడు. అతడు అడిగిన వెంటనే చికెన్, పాల ప్యాకెట్ల ఫోటోలు పంపించి ఆడుకున్నాడు. కాసేపటికి మాత్రం నిజంగానే చికెన్ పంపించాడు. దీంతో మటన్, చికెన్ అంటూ అందరూ కలిసి స్టెప్పులేశారు.


