సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది నటి రోహిణి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ధారావాహికలో రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించింది. నటిగా, కమెడియన్‌గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది.
నావాడిని కలిశా..
మత్తు వదలరా, బలగం, హను-మాన్ వంటి సినిమాలతో పాటు సేవ్ ది టైగర్స్, ఎల్‌జీఎమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్) వెబ్‌సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది. మధ్యలో తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆటతో, మాటతో, కామెడీతో ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా రోహిణి ఓ అబ్బాయితో క్లోజ్‌గా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. నావాడిని కలిశాను అంటూనే ఓ ట్విస్ట్ ఇచ్చింది.
షాకయ్యారా?
ఇంతమంచి హ్యాండ్సమ్ అబ్బాయిని ఇచ్చిన చాట్‌జీపీటీకి థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఫస్ట్ ఈ ఫోటో చూడగానే అభిమానులే కాదు బుల్లితెర సెలబబ్రిటీలు కూడా రోహిణి ప్రియుడు అని పొరబడ్డారు. తర్వాత క్యాప్షన్ చూసి ఏఐ (కృత్రిమ మేధ) మాయాజాలమా.. అని నోరెళ్లబెడుతున్నారు.
నిజమైతే బాగుండు
యాంకర్ అరియానా అయితే సీరియస్‌గా అక్కా.. ఒక్క క్షణం నిజమే అనుకున్నా.. చాలా సంతోషంగా ఫీలయ్యా అంది. అందుకు రోహిణి స్పందిస్తూ.. నిజమైతే బాగుండు అని రిప్లై ఇచ్చింది. సింగర్ గీతామాధురి.. ఈ అబ్బాయి ఎక్కడున్నాడో వెతికేద్దాం అని ఫన్నీగా కామెంట్ పెట్టింది.


