సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్ సినిమా పరాశక్తి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే, జనవరి 10న కేవలం తమిళ్‌లోనే విడుదల చేశారు. కానీ, సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. తెలుగు మూలాలు ఉన్న సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై పలు విమర్శలు వస్తున్నాయి. 1960లలో తమిళనాడులోని హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంతో ఇద్దరు స్నేహితుల చుట్టూ ఈ మూవీ కొనసాగుతుంది. మూవీలో పలు అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉండటంతో సెన్సార్‌లో భారీ కొతలు పడ్డాయి. అయినప్పటికీ వివాదాలకు ఈ మూవీ తావిచ్చింది.
అమరన్ చిత్రంతో తెలుగువారి ప్రేమను పొందిన శివకార్తికేయన్.. ఇప్పుడు పరాశక్తితో కొల్పోయేలా ఉన్నాడు. ఈ మూవీలో తెలుగు ప్రజలను అవమానించే విధంగా "గోల్టీ"(Golti) అనే అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. (గోల్టీ అంటే దొంగ, మురికివాడు) ఈ పదాన్ని కట్ చేస్తామని ముంబై సెన్సార్ రివిజన్ కమిటీ ముందు చిద్ర యూనిట్ మొదట అంగీకరించి కూడా, తమిళ వెర్షన్‌లో అలాగే ఉంచడంతో #BoycottParasakthi అని వైరల్ అవుతుంది. తెలుగు ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ మూవీకి దర్శకత్వం వహించింది కూడా తెలుగు మూలాలు ఉన్న సుధ కొంగర కావడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. పైగా ఆ పదం తీసేస్తే సినిమాకు ఉన్న ఆత్మ పోతుందని ఆమె సమర్థించుకున్నారని తెలుస్తోంది.
1960 సమయంలో మద్రాసులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల గురించి ఈ మూవీ ఉంది. ఈ కాన్సెప్ట్ చాలా సున్నితమైనది కావడంతో సెన్సార్ బోర్డు (CBFC) చాలా అభ్యంతరాలు తెలిపింది. ఏకంగా 20కి పైగా కట్స్ సూచించింది. సినిమాలో వాడిన కొన్ని పదాలను తొలగించారు. అందులో కొన్ని రాయలనేని బాషలో ఉన్నాయి. వాటిని తొలగించమని కూడా సెన్సార్ ఆదేశించింది. అయితే, ఈ పదాలన్నీ తొలగిస్తే సినిమాకు ఉన్న బలం పోతుందని దర్శకురాలు వాదించారట. అయితే, సినిమాపై సానుకూల రివ్యూలు రాలేదు. కథను సాగదీసి చెప్పారని నెటిజన్లు పేర్కొంటున్నారు. కేవలం శివకార్తికేయన్ ఇమేజ్ మాత్రమే ఈ మూవీకి బలాన్ని ఇచ్చిందన్నారు. రాజకీయ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి పర్వాలేదు. ఫ్యామిలీ ప్రేక్షకులకు నిరాశ కలిగించేలా ఉంది.


