breaking news
Parasakthi Movie
-
హిందీ వాళ్లపై కోపం లేదు.. 'పరాశక్తి' తెలుగు ట్రైలర్
సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ తమిళ్లో మాత్రమే విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా కనీసం ట్రైలర్ కూడా ఆ సమయంలో రిలీజ్ చేయలేదు. అయితే, కోలీవుడ్‌లో థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత డైరెక్ట్‌గా తెలుగు వర్షన్‌ను కూడా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ను జీ5 వేదికగా పంచుకున్నారు. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇదే మూవీతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.పరాశక్తి(Parasakthi) సినిమా ఫిబ్రవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్ కూడా విడుదల కానుంది. ఇదే విషయాన్ని తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో పేర్కొన్నారు. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు జరిగాయనేది ఇందులో చూపించారు. -
ఓటీటీలో 'పరాశక్తి.. తెలుగు వర్షన్ డైరెక్ట్ స్ట్రీమింగ్
సంక్రాంతి సందర్భంగా శివకార్తికేయన్ మూవీ ‘పరాశక్తి’ కోలీవుడ్‌లో విడుదలైంది. తెలుగులో థియేటర్స్ కొరత కారణంగా ఇక్కడ రిలీజ్ కాలేదు. అయితే, డైరెక్ట్‌గా తెలుగు వర్షన్‌ను ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈమేరకు ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. సినిమా విషయంలో పలు విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా రూ. 100 కోట్లకు పైగానే రాబట్టింది.పరాశక్తి(Parasakthi) సినిమా జనవరి 7న జీ5(ZEE5) ఓటీటీలోకి రానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ వర్షన్ కూడా విడుదల కానుంది. టాలీవుడ్లో శివకార్తికేయన్‌కు భారీ క్రేజ్ ఉండటంతో పరాశక్తి చిత్రాన్ని చూసేందుకు తెలుగు ఫ్యాన్స్ ఆసక్తి కనపరుస్తున్నారు. ఇదే సినిమాతో నటి శ్రీలీల హీరోయిన్గా కోలీవుడ్‌కు పరిచయం అయిన విషయం తెలిసిందే.1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి సినిమా తెరకెక్కింది. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ గొడవల సమయంలో ఇద్దరు సోదరులు, చెజియాన్, చిన్నదురై జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయనేది కథ యొక్క ముఖ్యాంశం. ఇందులో బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ప్రీ-క్లైమాక్స్ లో రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్, డాలీ ధనంజయ కీలకమైన అతిధి పాత్రలో కనిపిస్తారు. -
ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్
సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. దీంతో ఈ వారం గుణశేఖర్ 'యుఫోరియా', 'బిగ్‌బాస్' అమర్దీప్ సుమతీ శతకం చిత్రాలతో పాటు 'శ్రీ చిదంబరం గారు', 'చాయ్ వాలా', 'బరాబర్ ప్రేమిస్తా', 'ఆపరేషన్ పద్మ', 'బ్లడ్ రోజెస్', 'హనీ' తదితర తెలుగు సినిమాలు.. అలానే 'విత్ లవ్' అనే డబ్బింగ్ బొమ్మ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ బోలెడన్ని హిట్ మూవీస్ రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ రాజాసాబ్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, శివకార్తికేయన్ పరాశక్తితో పాటు సైక్ సిద్ధార్థ, నీలకంఠ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 02 నుంచి 08 వరకు)అమెజాన్ ప్రైమ్నారీ నారీ నడుమ మురారి (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 04రిలేషన్షిప్ గోల్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 04ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06నెట్ఫ్లిక్స్క్యాష్ క్వీన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 05ద లింకన్ లాయర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 05క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06హాట్స్టార్రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06జీ5షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07సన్ నెక్స్ట్నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06ఆహాసైక్ సిద్ధార్థ (తెలుగు మూవీ) - ఫిబ్రవరి 04సోనీ లివ్జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06(ఇదీ చదవండి: 'ఛాంపియన్' బ్యూటీ ఓటీటీ ఎంట్రీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
విజయ్ ఫ్యాన్స్‌పై 'సుధా కొంగర' సంచలన కామెంట్స్
తమిళనాడులో శివకార్తికేయన్, విజయ్ దళపతి ఫ్యాన్స్ వార్ పెద్ద ఎత్తున జరుగుతుంది. తాజాగా విడుదలైన ‘పరాశక్తి’పై విజయ్ అభిమానులు దుష్ప్రచారం చేస్తున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవ్ రామ్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బుక్ మై షోలో నెగెటివ్ రివ్యూలు ఇవ్వడమే కాకుండా మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొన్ని ఆధారాలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ విజయ్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యారు.రౌడీయిజంతో పోరాడుతున్నాంది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సుధా కొంగర ఇలా అన్నారు. 'ప్రస్తుత కాలంలో సినిమాను ప్రేక్షకులకు చేర్చడంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ మార్కెటింగ్ యుగంలో ఎన్నో సవాళ్లను దాటుకోవాలి. సినిమా బాగున్నా సరే తప్పుడు ప్రచారంలో ఇబ్బందులు తప్పవు. పొంగల్ వారాంతంలో మా సినిమా (పరాశక్తి) మరింత మందికి చేరువవుతుందని నేను ఆశిస్తున్నాను. ఒక నటుడి అభిమానుల వల్ల మేము చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫేక్ ఐడీలతో మాపై చాలా దారుణమైన పోస్టులు చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. విజయ్ ఫ్యాన్స్ పేరుతో కొన్ని ఖాతాల నుంచి షేర్ చేసిన పోస్టులు మరింత నీచంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం ఏంటి.. తమ హీరో సినిమా విడుదల కాలేదని ఆయన ఫ్యాన్స్ చేసే హెచ్చరికలు ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. మేము రౌడీయిజం, గూనిజంతో పోరాడుతున్నాం.' అంటూ ఆమె అన్నారు.జన నాయగన్, పరాశక్తి రెండు సినిమాలకు సెన్సార్ చిక్కులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పరాశక్తి మూవీకి 25 కట్స్ సూచించి విడుదలకు 4గంటల ముందు సెన్సార్ ఇచ్చారు. కానీ, జన నాయగన్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. పరాశక్తి సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా ఉదయ్‌నిధి స్టాలిన్ పంపిణీ చేశారు. దీంతో జన నాయగన్‌పై రాజకీయ కుట్ర జరిగిందని విజయ్ ఫ్యాన్స్ భావించారు. అందుకే పరాశక్తి సినిమా పట్ల వారు నెగటివ్ రివ్యూలు ప్రారంభించారని తెలుస్తోంది. -
వివాదంలో శివ కార్తికేయన్ పొంగల్ మూవీ..!
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన పొంగల్ చిత్రం పరాశక్తి. పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వ వహించారు. జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఆది నుంచే వివాదాలు ఎదురయ్యాయి. రిలీజ్‌కు ముందు సెన్సార్ సమస్య ఈ సినిమా చివరికి అనుకున్న తేదీకే విడుదలైంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ తర్వాత మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ తమిళనాడు యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని.. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల పరువుకు నష్టం కలిగించేలా చిత్రీకరించారని ఆరోపించింది.చరిత్రను తప్పుదోవ పట్టించే సన్నివేశాలు ఉన్నాయని.. శివకార్తికేయన్ పాత్ర ఇందిరాగాంధీని కలిసినప్పటి సన్నివేశాలు.. చరిత్రలో జరగని సంఘటనలతో రూపొందించారని అన్నారు. ఈ మూవీలో వాస్తవ సంఘటనలు చాలా తక్కువ ఉన్నాయని తమిళనాడు యూత్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ భాస్కర్ పేర్కొన్నారు. కాగా.. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. -
'పరాశక్తి'లో తెలుగువారిని అవమానపరిచే డైలాగ్
సంక్రాంతి కానుకగా శివకార్తికేయన్ సినిమా పరాశక్తి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే, జనవరి 10న కేవలం తమిళ్లోనే విడుదల చేశారు. కానీ, సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. తెలుగు మూలాలు ఉన్న సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై పలు విమర్శలు వస్తున్నాయి. 1960లలో తమిళనాడులోని హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంతో ఇద్దరు స్నేహితుల చుట్టూ ఈ మూవీ కొనసాగుతుంది. మూవీలో పలు అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉండటంతో సెన్సార్‌లో భారీ కొతలు పడ్డాయి. అయినప్పటికీ వివాదాలకు ఈ మూవీ తావిచ్చింది.అమరన్ చిత్రంతో తెలుగువారి ప్రేమను పొందిన శివకార్తికేయన్.. ఇప్పుడు పరాశక్తితో కొల్పోయేలా ఉన్నాడు. ఈ మూవీలో తెలుగు ప్రజలను అవమానించే విధంగా "గోల్టీ"(Golti) అనే అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. (గోల్టీ అంటే దొంగ, మురికివాడు) ఈ పదాన్ని కట్ చేస్తామని ముంబై సెన్సార్ రివిజన్ కమిటీ ముందు చిద్ర యూనిట్ మొదట అంగీకరించి కూడా, తమిళ వెర్షన్లో అలాగే ఉంచడంతో #BoycottParasakthi అని వైరల్ అవుతుంది. తెలుగు ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ మూవీకి దర్శకత్వం వహించింది కూడా తెలుగు మూలాలు ఉన్న సుధ కొంగర కావడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. పైగా ఆ పదం తీసేస్తే సినిమాకు ఉన్న ఆత్మ పోతుందని ఆమె సమర్థించుకున్నారని తెలుస్తోంది.1960 సమయంలో మద్రాసులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల గురించి ఈ మూవీ ఉంది. ఈ కాన్సెప్ట్ చాలా సున్నితమైనది కావడంతో సెన్సార్ బోర్డు (CBFC) చాలా అభ్యంతరాలు తెలిపింది. ఏకంగా 20కి పైగా కట్స్ సూచించింది. సినిమాలో వాడిన కొన్ని పదాలను తొలగించారు. అందులో కొన్ని రాయలనేని బాషలో ఉన్నాయి. వాటిని తొలగించమని కూడా సెన్సార్ ఆదేశించింది. అయితే, ఈ పదాలన్నీ తొలగిస్తే సినిమాకు ఉన్న బలం పోతుందని దర్శకురాలు వాదించారట. అయితే, సినిమాపై సానుకూల రివ్యూలు రాలేదు. కథను సాగదీసి చెప్పారని నెటిజన్లు పేర్కొంటున్నారు. కేవలం శివకార్తికేయన్ ఇమేజ్ మాత్రమే ఈ మూవీకి బలాన్ని ఇచ్చిందన్నారు. రాజకీయ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి పర్వాలేదు. ఫ్యామిలీ ప్రేక్షకులకు నిరాశ కలిగించేలా ఉంది. -
పలు సవాళ్లు.. అన్నీ దాటుకుని సినిమా తీశా: సుధా కొంగర
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం పరాశక్తి. శ్రీలీల హీరోయిన్. రవిమోహన్ ప్రతినాయకుడిగా, అధర్వ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో నిర్మాత ఆకాశ్ భాస్కర్ తన డాన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శనివారం తెరపైకి రానుంది. స్క్రీన్‌ప్లే రాయడమే ఛాలెంజింగ్ఈ సందర్భంగా దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ.. పరాశక్తి సినిమా కథ రాసినప్పుడు పలువురి నుంచి అభినందనలు, అదే సమయంలో కథ గురించి పలు సందేహాలు తలెత్తాయన్నారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాయడమే ఛాలెంజింగ్‌గా మారిందన్నారు. అదే విధంగా సినిమా రిలీజ్ తర్వాత పలు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురూ హెచ్చరించారన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయాలని అయితే దర్శకుడు మణిరత్నంలాగా ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలని భావించి.. పలు సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ సినిమాను నమ్మిన నిర్మాత ఆకాశ్ భాస్కర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నటీనటులతో పాటు, సాంకేతిక వర్గం ఈ సినిమాకోసం ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. పరాశక్తి తమిళ చిత్రపరిశ్రమలో ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
జన నాయగణ్ Vs పరాశక్తి.. విజయ్ రియాక్షన్ ఇదే..
శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ నిర్మించిన ఈ మూవీలో రవిమోహన్, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 10న రిలీజవుతోంది. అయితే దీనికంటే ఒకరోజు ముందు జనవరి 9న విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ మూవీ విడుదలవుతోంది.పొంగల్‌కు సినిమా లేకపోవడంతో..దీని గురించి శివకార్తికేయన్ స్పందించాడు. శనివారం సాయంత్రం చెన్నైలో పరాశక్తి మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పరాశక్తి సినిమాను 2025 అక్టోబర్‌లో లేదా దీపావళికి విడుదల చేద్దామని నిర్మాత ఆకాశ్, నేను మాట్లాడుకున్నాం. అయితే విజయ్ మూవీ అక్టోబర్‌లో తెరపైకి రానుందని.. దీంతో పొంగల్‌కు వేరే సినిమా లేదని ప్రచారం జరగడంతో మనం పొంగల్‌కు వద్దామని ఆకాశ్ చెప్పారు.తీరా అదే సమయంలోఅయితే కొన్ని రోజుల తర్వాత విజయ్ నటిస్తున్న జన నాయగణ్ మూవీ పొంగల్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే నిర్మాత ఆకాశ్‌కు ఫోన్ చేసి మనం రిలీజ్ పోస్ట్‌పోన్ చేద్దామా అని అడిగాను. కానీ, అప్పటికే సినిమా రైట్స్ అన్నీ అమ్ముడుపోవడంతో అది కష్టమన్నాడు. తర్వాత నేను విజయ్ మేనేజర్ జగదీష్‌కు ఫోన్ చేసి.. జననాయగణ్ రిలీజ్‌ను సంక్రాంతికి మార్చారా? అని అడిగాను. అందుకాయన.. అవును, మార్చాం. అయినా ఏం పర్లేదు, రెండు సినిమాలు విజయం సాధిస్తాయి. మీ సినిమా రిలీజ్ చేయండి అన్నారు. విజయ్‌తో మాట్లాడా..అప్పటికీ నాకు మనసు కుదుటపడక విజయ్‌తో అన్ని విషయాలు మాట్లాడాను. పొంగల్‌కు పదిరోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి రెండు సినిమాలు విడుదల చేయొచ్చని చెప్పారు. దీనివల్ల ఎవరి సినిమా ప్రభావితం కాదన్నారు. నాకు, విజయ్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. ఎవరేమనుకున్నా ఈ పొంగల్ అన్నాతమ్ముళ్లది. జనవరి 9న జన నాయగణ్ మూవీ చూడండి. 33 ఏళ్లుగా మనల్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి చివరి సినిమాను ఆదరించండి. ఆ తర్వాతి రోజు విడుదలవుతున్న పరాశక్తిని సైతం ఆదరించండి అని పేర్కొన్నాడు. -
శివకార్తికేయన్ 'పరాశక్తి' ట్రైలర్ రిలీజ్
పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నశివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ 'పరాశక్తి'. శ్రీలీల హీరోయిన్ కాగా రవి మోహన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. అధర్వ కీలక పాత్ర చేశాడు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ఈ శనివారం(జనవరి 10న) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు.1964లో తమిళనాడులో ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారంగా 'పరాశక్తి' తీశారని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు.. ఓ పోలీస్తో ఎలాంటి గొడవ జరిగింది? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో మూవీని తెరకెక్కించారు.ప్రధాన పాత్రధారులు వేషధారణ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే తెలుగులో దీనికి ఎంతవరకు ఆదరణ దక్కుతుందో చూడాలి?ఎందుకంటే 'పరాశక్తి' చిత్రాన్ని జనవరి 10న తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తమిళ వరకు అయితే విజయ్ 'జన నాయగణ్' మాత్రమే పోటీలో ఉంది. తెలుగుకు వచ్చేసరికి 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారీ'.. ఇలా ఐదు తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'పరాశక్తి'కి ఏ మేరకు థియేటర్లు లభిస్తాయనేది, సబ్జెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి? -
సంక్రాంతి బరిలో 'డబ్బింగ్' రిస్క్ అవసరమా?
సినిమా ఇండస్ట్రీలకు సంక్రాంతి సీజన్ బంగారు బాతులాంటిది. దీన్ని అందుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే ప్రతి పండక్కి ఒకటి రెండు లేదంటే మూడు మూవీస్ మాత్రమే వచ్చేవి. కానీ ఈసారి లిస్టు చాలా పెద్దగా ఉంది. తెలుగులోనే బోలెడు చిత్రాలు అనుకుంటే తమిళ డబ్బింగ్‌లు పోటీకి రెడీ అయిపోతున్నాయి. ఇలా జరగడం వల్ల ఎవరికీ రిస్క్?(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)ఈసారి సంక్రాంతికి మొదటగా థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ నటించిన ఈ మూవీ.. లెక్క ప్రకారం డిసెంబరులో రానుందని ప్రకటించారు. కొన్నిరోజులకే ప్లాన్ మార్చేసి పండగ బరిలో దింపారు. జనవరి 9న థియేటర్లలో రిలీజ్. ముందురోజే ప్రీమియర్స్ కూడా వేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి పోటీగా తమిళ హీరో విజయ్ చివరి మూవీ 'జన నాయగణ్' ఉంది. ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అనే టాక్ బలంగా ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తెలుగులో జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే విజయ్ లాస్ట్ సినిమా అంటే తమిళనాడులో భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయి. మరి తెలుగులో ఏ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తుందనేది చూడాలి?ఈ రెండొచ్చిన మరుసటి రోజు అంటే 10వ తేదీన 'పరాశక్తి' రాబోతుంది. శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. జయం రవి, అధర్వ కీలక పాత్రలు చేశారు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ తెలుగులో ఇప్పటివరకు అయితే ఎలాంటి బజ్ లేదు. తెలిసిన ముఖాలు ఉన్నాయి తప్పితే ఒకవేళ ఇది తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన ఎంతమేరకు ఆకట్టుకుంటుందో? ఈ రెండు మాత్రమ సంక్రాంతి బరిలో ఉన్న డబ్బింగ్ బొమ్మలు.(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)వీటి తర్వాత 12వ తేదీన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', 13వ తేదీన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15వ తేదీన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతికి వస్తున్న వాటిలో ప్రభాస్ది తప్పితే మిగిలినవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్‌గా చేసుకుని తీసిన చిత్రాలే. కాబట్టి వీటిలో ఒకటి రెండయినా హిట్ అయ్యే అవకాశముంది. అన్ని సక్సెస్ అందుకున్న మంచిదే. ఒకవేళ అదే జరిగితే మాత్రం తమిళ డబ్బింగ్లని ఎవరూ ఆదరించారు.అయితే జన నాయగణ్, పరాశక్తి చిత్రాల్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. కాస్త ఆలస్యం రిలీజ్ చేయడం లాంటివి జరగకపోవచ్చు. కాబట్టి ఈసారి లిస్టు అయితే దాదాపు ఏడు సినిమాలతో చాలా పెద్దగా ఉంది. మరి వీటిలో ఎవరు ఎవరిని రిస్క్‌లో పెడతారు? ఎవరు పైచేయి సాధించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారనేది చూడాలి?(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?)


