వివాదంలో శివ కార్తికేయన్ పొంగల్ మూవీ..! | Tamil Nadu Youth Congress demands to ban on Parasakthi movie | Sakshi
Sakshi News home page

Parasakthi Movie: పరాశక్తిని బ్యాన్ చేయండి.. వివాదంలో శివ కార్తికేయన్ మూవీ..!

Jan 13 2026 4:16 PM | Updated on Jan 13 2026 4:27 PM

Tamil Nadu Youth Congress demands to ban on Parasakthi movie

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన పొంగల్ చిత్రం పరాశక్తి. పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వ వహించారు. జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఆది నుంచే వివాదాలు ఎదురయ్యాయి. రిలీజ్‌కు ముందు సెన్సార్‌ సమస్య ఈ సినిమా చివరికి అనుకున్న తేదీకే విడుదలైంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌ తర్వాత మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని.. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల పరువుకు నష్టం కలిగించేలా చిత్రీకరించారని ఆరోపించింది.

చరిత్రను తప్పుదోవ పట్టించే సన్నివేశాలు ఉన్నాయని.. శివకార్తికేయన్‌ పాత్ర ఇందిరాగాంధీని కలిసినప్పటి సన్నివేశాలు.. చరిత్రలో జరగని సంఘటనలతో రూపొందించారని అ‍న్నారు. ఈ మూవీలో వాస్తవ సంఘటనలు చాలా తక్కువ ఉన్నాయని తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ భాస్కర్‌  పేర్కొన్నారు. కాగా.. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement