సినిమా ఇండస్ట్రీలకు సంక్రాంతి సీజన్ బంగారు బాతులాంటిది. దీన్ని అందుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే ప్రతి పండక్కి ఒకటి రెండు లేదంటే మూడు మూవీస్ మాత్రమే వచ్చేవి. కానీ ఈసారి లిస్టు చాలా పెద్దగా ఉంది. తెలుగులోనే బోలెడు చిత్రాలు అనుకుంటే తమిళ డబ్బింగ్‌లు పోటీకి రెడీ అయిపోతున్నాయి. ఇలా జరగడం వల్ల ఎవరికీ రిస్క్?
(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)
ఈసారి సంక్రాంతికి మొదటగా థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ నటించిన ఈ మూవీ.. లెక్క ప్రకారం డిసెంబరులో రానుందని ప్రకటించారు. కొన్నిరోజులకే ప్లాన్ మార్చేసి పండగ బరిలో దింపారు. జనవరి 9న థియేటర్లలో రిలీజ్. ముందురోజే ప్రీమియర్స్ కూడా వేసే ఆలోచనలో ఉన్నారు. దీనికి పోటీగా తమిళ హీరో విజయ్ చివరి మూవీ 'జన నాయగణ్' ఉంది. ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అనే టాక్ బలంగా ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తెలుగులో జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే విజయ్ లాస్ట్ సినిమా అంటే తమిళనాడులో భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయి. మరి తెలుగులో ఏ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇస్తుందనేది చూడాలి?
ఈ రెండొచ్చిన మరుసటి రోజు అంటే 10వ తేదీన 'పరాశక్తి' రాబోతుంది. శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. జయం రవి, అధర్వ కీలక పాత్రలు చేశారు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ తెలుగులో ఇప్పటివరకు అయితే ఎలాంటి బజ్ లేదు. తెలిసిన ముఖాలు ఉన్నాయి తప్పితే ఒకవేళ ఇది తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన ఎంతమేరకు ఆకట్టుకుంటుందో? ఈ రెండు మాత్రమ సంక్రాంతి బరిలో ఉన్న డబ్బింగ్ బొమ్మలు.
(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)
వీటి తర్వాత 12వ తేదీన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', 13వ తేదీన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14వ తేదీన నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', 15వ తేదీన శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతికి వస్తున్న వాటిలో ప్రభాస్‍ది తప్పితే మిగిలినవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్‌గా చేసుకుని తీసిన చిత్రాలే. కాబట్టి వీటిలో ఒకటి రెండయినా హిట్ అయ్యే అవకాశముంది. అన్ని సక్సెస్ అందుకున్న మంచిదే. ఒకవేళ అదే జరిగితే మాత్రం తమిళ డబ్బింగ్‌లని ఎవరూ ఆదరించారు.
అయితే జన నాయగణ్, పరాశక్తి చిత్రాల్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించి.. కాస్త ఆలస్యం రిలీజ్ చేయడం లాంటివి జరగకపోవచ్చు. కాబట్టి ఈసారి లిస్టు అయితే దాదాపు ఏడు సినిమాలతో చాలా పెద్దగా ఉంది. మరి వీటిలో ఎవరు ఎవరిని రిస్క్‌లో పెడతారు? ఎవరు పైచేయి సాధించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారనేది చూడాలి?
(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?)


