గోశాలకు సోనూసూద్‌ రూ.11 లక్షలు విరాళం | Sonu Sood Donates Rs 11 Lakhs to Varahi Gaushala in Gujarat | Sakshi
Sakshi News home page

సోనూసూద్‌ మంచి మనసు.. రూ.11 లక్షలు విరాళం

Jan 11 2026 4:45 PM | Updated on Jan 11 2026 5:02 PM

Sonu Sood Donates Rs 11 Lakhs to Varahi Gaushala in Gujarat

మంచితనానికి మారుపేరుగా ఉండే ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరో గొప్ప పని చేశాడు. గుజరాత్‌లోని వారాహి గోశాలకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు. వారాహి గోశాలను సందర్శించిన ఆయన గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి సంతోషం వ్యక్తం చేశాడు. సోనూసూద్‌ మాట్లాడుతూ.. కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య ఏడు వేలకు చేరింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.

గోశాలకు విరాళం
ఈ గ్రామంలోని ప్రజలందరూ వాటి సంరక్షణ కోసం పాటుపడుతుండటం అభినందనీయం. వారు చేసినంత సేవ నేను చేయకపోవచ్చు. కానీ నా తరపున రూ.11 లక్షలు విరాళం ఇచ్చాను. దానివల్ల వారి సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల ప్రేమ నన్నెంతగానో కట్టిపడేసింది. వీలు కుదిరినప్పుడు తప్పకుండా మరోసారి ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.

సినిమా
సోనూసూద్‌ సినిమాల విషయానికి వస్తే.. సూపర్‌, అరుంధతి, చంద్రముఖి, దూకుడు, జులాయి, అల్లుడు అదుర్స్‌.. ఇలా అనేక సినిమాల్లో విలన్‌గా చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నాడు. చివరగా 'ఫతే' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ మారాడు.

చదవండి: చచ్చిపోవాలన్నంత బాధ.. ఎంతోమందిని కలిశా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement