బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు, కథానాయిక నుపుర్ సనన్ పెళ్లి పీటలెక్కింది. వారం రోజుల క్రితమే ప్రియుడు, ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌తో ఎంగేజ్‌మెంట్ జరుపుకుంది. పెళ్లికి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శనివారం (జనవరి 10న)నాడు ప్రియుడిని వివాహం చేసుకుంది. రాజస్తాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
పెళ్లి చేసుకున్న హీరోయిన్
ఇరు కుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన క్షణాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లిలో ఇద్దరూ తెలుపు దుస్తుల్లోనే మెరిశారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఒకే ఒక్క మూవీ
నుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్‌లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం.
Finally its here ✨
5 years of love and a start to forever 🫶🏻#StebiNupurOnLoop #StebinBen#NupurSanon#KritiSanon pic.twitter.com/WhlvX3UuzJ— G (@kixtr1KSanon) January 10, 2026


