సంక్రాంతి వేడుకల్లో చై-శోభిత.. భోజనం వడ్డిస్తూ.. | Naga Chaitanya, Sobhita Dhulipala Celebrate Sankranti at Annapurna Studios 2026 | Sakshi
Sakshi News home page

చై-శోభిత సంక్రాంతి సెలబ్రేషన్స్‌.. ఎక్కడంటే?

Jan 11 2026 2:32 PM | Updated on Jan 11 2026 3:28 PM

Naga Chaitanya, Sobhita Dhulipala Celebrate Sankranti at Annapurna Studios 2026

టాలీవుడ్‌ స్టార్‌ జంట నాగచైతన్య- శోభిత ధూళిపాళ ఈసారి సంక్రాంతిని కాస్త ముందుగానే జరుపుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకకు హాజరైన వీరిద్దరూ అక్కడ ఉన్నవారికి ఆప్యాయంగా భోజనం వడ్డించారు. అనంతరం అక్కడి వారితో ఫోటోలు కూడా దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమా
కాగా చై- శోభితలది ప్రేమ పెళ్లి. కొంతకాలంపాటు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కొంతకాలంగా హిట్లు లేక సతమతమైన చైకి 'తండేల్‌'తో పెద్ద హిట్‌ లభించింది. రూ.100 కోట్లు రాబట్టిన తొలి సినిమాగా అతడి కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం చై 'వృషకర్మ' సినిమా చేస్తున్నాడు. 

శోభిత సంగతేంటి?
'విరూపాక్ష' వంటి సూపర్‌ హిట్‌ మూవీ తెరకెక్కించిన కార్తీక్‌ వర్మ దండు ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తోంది. శోభిత విషయానికి వస్తే.. ఇటీవలే తన కొత్త సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. 'చీకటిలో' అనే థ్రిల్లర్‌ సినిమాతో జనవరి 23న ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది.

 

 

చదవండి: నీ బర్త్‌డే నాకెంతో స్పెషల్‌.. పుట్టినందుకు థాంక్స్‌: అల్లు అర్జున్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement