ఫోక్ సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో పాడుతూ, అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే 'బాయిలోన బల్లిపలికే' అని ఓ ఆల్బమ్ పాట రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలానే ట్రెండింగ్ కూడా అవుతోంది. సోషల్ మీడియాలో రీల్స్ బాగానే కనిపిస్తున్నాయి. అయితే మేడిపల్లి స్టార్ అలియాస్ మల్లిఖార్జున్ అనే వ్యక్తి మాత్రం ఈ పాటని, మంగ్లీని ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్స్ చేశాడు. దీంతో మంగ్లీ.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది.
(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)
ఈ క్రమంలో గురువారం ఉదయం నిందితుడు మల్లిఖార్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ ఇతడు ఇలానే అసభ్య కంటెంట్‌తో వీడియోలు చేశాడని గుర్తించారు. మరి స్టేషన్‌లో ఏం జరిగిందో ఏమో గానీ సదరు మేడిపల్లి స్టార్.. ఏడుస్తూ ఇప్పుడు మంగ్లీకి క్షమాపణ చెబుతూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
'పాట ట్రెండింగ్ ఉంది కదక్క.. కామెంట్ పెట్టిన వాడిని తిట్టాను, మిమ్మల్ని కాదు అక్క. నేను ఎవరినీ తిట్టను అక్క. క్షమించక్క. ఏ మహిళని తిట్టను అక్క, ఎవరిపై కామెంట్ చేయను అక్క. ప్లీజ్ అక్క, క్షమించు అక్క' అని మల్లిఖార్జున్ చెబుతున్న వీడియో ఇప్పుడు కనిపిస్తుంది. మంగ్లీ పెట్టిన ఈ కేసుని.. సోషల్ మీడియాలో వీడియోలు ప్రతిఒక్కరూ గమనించాలి. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు కచ్చితంగా ఆలోచించి మాట్లాడితే బెటర్. లేదంటే పోలీస్ స్టేషన్‌లో చిక్కులు గ్యారంటీ.
(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?)


