వరస ఫ్లాప్స్ దెబ్బకు కాస్త గ్యాప్ తీసుకున్న రామ్.. తాజాగా 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. నిన్న రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. మరీ సూపర్ అని చెప్పట్లేదు గానీ బాగానే ఉందనే టాక్ అయితే వచ్చింది. ఓ రకంగా చూస్తే అటు రామ్, ఇటు భాగ్యశ్రీ కాస్త హ్యాపీ అనే చెప్పొచ్చు. మరి ఈ మూవీకి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? ఓవర్సీస్ కలెక్షన్ సంగతేంటి?
(ఇదీ చదవండి: ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మూవీ రివ్యూ)
రామ్ కొత్త సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.4 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే రూ.4.5 నుంచి రూ.5 కోట్ల మధ్య నెట్ వసూళ్లు ఉండొచ్చని సమాచారం. ఓవర్సీస్‌లోనూ రెండు లక్షల 75 వేల డాలర్ల వసూలు చేసినట్లు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఈ విషయం 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రానికి కలిసి రావొచ్చు. వచ్చే వారం 'అఖండ 2' ఉంది కాబట్టి ఈ ఏడు రోజుల్లో ఈ సినిమా ఎంత రాబడుతుందనేది చూడాలి?
'ఆంధ్ర కింగ్ తాలూకా' విషయానికొస్తే.. 100వ సినిమా చేస్తున్న తెలుగు స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర)కు అనుకోని ఓ కష్టం వస్తుంది. షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. మొదలవ్వాలంటే రూ.3 కోట్లు అవసరమవుతాయి. ఎవరిని అడిగినా సూర్యకు సాయం చేయరు. ఆస్తిని అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో సూర్య అకౌంట్‌లో రూ.3 కోట్లు జమ అవుతాయి. ఆ డబ్బు తన వీరాభిమాని సాగర్ (రామ్ పోతినేని) అకౌంట్ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ సాగర్ ఎవరు? తన హీరో కోసం సాగర్ ఎలాంటి త్యాగం చేశాడు? సాగర్-మహాలక్ష‍్మీ ప్రేమకథకు రూ.3 కోట్లకు సంబంధమేంటనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)


