breaking news
Bhagyashri Borse
-
ఓటీటీలోకి వచ్చేసిన 'కింగ్డమ్'.. కానీ అది మిస్
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల చివరలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత సీన్ మారిపోయింది. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సేని తీసుకున్నారు కానీ ఒకటి రెండు సీన్లు తప్పితే చిత్రంలో అస్సలు ఈమెని సరిగా ఉపయోగించుకోలేదు. సరే డిజిటల్ స్ట్రీమింగ్లోనైనా సరే హ్యాపీ అవుతుందనుకుంటే ఇక్కడా డిసప్పాయింట్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ)ఈ సినిమాలో 'హృదయం లోపల' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ఉంది. మూవీ రిలీజ్‌కి ముందే ఈ పాట వీడియో రిలీజ్ చేశారు. తీరా చూస్తే థియేటర్లలో ఈ గీతం కనిపించలేదు. దీనికి కారణాన్ని చెబుతూ స్టోరీలో సెట్ కాలేదు కాబట్టి తీసేశాం అని నిర్మాత నాగవంశీ చెప్పారు. సరే ఓటీటీలోకి వచ్చాక అయినా సరే ఉంటుందిలే అనుకుంటే ఇక్కడ కూడా తీసేశారు. దీంతో భాగ్యశ్రీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు.'కింగ్డమ్' మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ. దీనిపై విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ దీవిలో శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'సుందరకాండ' సినిమా రివ్యూ) -
అచ్చొచ్చిన ప్లేస్‌లో భాగ్యశ్రీ.. జపాన్ బీచ్‌లో మీనాక్షి
జపాన్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న మీనాక్షిఆగస్టు జ్ఞాపకాలు షేర్ చేసిన దీపికా పిల్లిఅచ్చొచ్చిన ప్లేస్ గురించి చెప్పిన భాగ్యశ్రీ బోర్సేజమ్ము కశ్మీర్ టూర్లో యామీ గౌతమ్రెడ్ శారీలో అందాలతో కవ్విస్తున్న కృతి కర్బందామట్టి పాత్రలు చేస్తూ బిజీబిజీగా అనికా సురేంద్రన్బిగ్బాస్ అగ్నిపరీక్ష కోసం శ్రీముఖి రెడీ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Parvathy Thiruvothu (@par_vathy) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
Bhagyashri Borse: ‘కాంతా’తో వెలిగిపోతుందా?
ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహిస్తుంది సినిమా. ముఖ్యంగా నటీమణులకు అవకాశాలు తలుపుతడతాయి. అందుకు కొంచెం అందం, కాస్త అదృష్టం ఉంటే చాలు, ఇండియన్ సినిమానే ఏలేయవచ్చు. అలా యువ కథానాయకి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్‌పై కన్నేశారనే చెప్పవచ్చు. 26 ఏళ్ల ఈ మహారాష్ట్రీ పరువాల బ్యూటీ 2023లోనే నటిగా తెరంగ్రేటం చేశారు. అలా ముందుగా హిందీలో నటించిన భాగ్యశ్రీ బోర్సేకు వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ రవితేజకు జంటగా మిస్టర్ బచ్చన్ నటించారు. ఈ చిత్రం విజయాన్ని సాధించకపోకపోయినా ఈ అమ్మడు మాత్రం డాన్స్, అందాలారబోతలతో పాపులర్ అయ్యారు. తరువాత కింగ్డమ్లో విజయ్ దేవరకొండ సరసన నటించారు. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కాంతా అనే బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దుల్కర్సల్మాన్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్పిరిట్ మీడియా సంస్థ, వేఫారర్ ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంతా చిత్రం కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రతిభావంతులైన చిత్ర టీమ్‌తో కలిసి నటిస్తున్న కాంతా వంటి చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ చిత్రంలోని భాగ్యశ్రీబోర్సే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఈమె గెటప్ పలువురిని ఆకట్టుకుంది. ఈ భామ కోలీవుడ్‌లో ఏమాత్రం రాణిస్తారో వేచి చూద్దాం. -
ఫిలింఫేర్ అవార్డ్స్..మెరిసిన అందాల భామలు (ఫొటోలు)
-
ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
దుల్కర్ 'కాంత' తొలి సాంగ్ రిలీజ్
విభిన్న చిత్రాలు చేస్తూ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం 'కాంత' అనే మూవీ చేస్తున్నాడు. రానా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్.. కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వచ్చే నెల 12న మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అలా తొలి పాటని విడుదల చేశారు.(ఇదీ చదవండి: నా బలం, నా సర్వస్వం.. మహేశ్‌కి నమ్రత స్పెషల్ విషెస్)'పసి మనసే' అంటూ సాగే పాటని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో దుల్కర్-భాగ్యశ్రీ డ్యాన్స్.. పాత సినిమాల్లో పాటల్ని గుర్తుచేస్తోంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ కథతో తీసిన ఈ సినిమాలో దుల్కర్ హీరో పాత్ర పోషిస్తుండగా, సముద్రఖని దర్శకుడిగా కనిపించబోతున్నారు. ఓ మూవీ తేసే విషయమై వీళ్లిద్దరి మధ్య ఎలాంటి ఈగోలు చోటుచేసుకున్నాయి. చివరకు ఏమైందనే కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: నిర్మాతలు ఎటూ తేల్చకపోతే చిరంజీవి ఆ పని చేస్తానన్నారు) -
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్ 'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘కింగ్డమ్’ మూవీ రివ్యూ
టైటిల్: కింగ్డమ్నటీనటులు: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే , వెంకటేశ్ పీసీ, కసిరెడ్డి తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు:సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: గౌతమ్ తిన్ననూరిసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ:జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISCఎడిటర్ : నవీన్ నూలివిడుదల తేది: జులై 31, 2025విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. నిజం చెప్పాలంటే ‘గీత గోవిందం’ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమానే లేదు. భారీ ఆశల మధ్య గతేడాది వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో విజయ్ ఆశలన్నీ ‘కింగ్డమ్’పైనే పెట్టుకున్నాడు.డైరెక్టర్ గౌతమ్‌కి కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను కింగ్డమ్ అందుకుందా? విజయ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేటంటే..సూరి(విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. అన్న శివ(సత్యదేవ్) అంటే ప్రాణం. ఓ కారణంతో శివ చిన్నప్పుడే తండ్రిని చంపి ఇంటి నుంచి పారిపోతాడు. అతని ఆచూకి కోసం సూరి వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో సూరి శ్రీలంకలో ఉన్నాడని తెలుస్తుంది. కట్ చేస్తే.. శ్రీలంకలో ఓ తెగ ఉంటుంది. 70 ఏళ్ల క్రితం ఇండియా నుంచి శ్రీలంకకు పారిపోయిన తెగ అది. గోల్డ్ మాఫియా సిండికేట్ చేతిలో వారు బానిసలు. మురుగన్(వెంకటేశ్) చెప్పింది చేయడమే వాళ్ల పని. శివ ఆ గ్యాంగ్ లీడర్. అతన్ని తిరిగి ఇండియాకు తీసుకురావడమే సూరి లక్ష్యం. మరి ఆ లక్ష్యం నెరవేరిందా? తమ్ముడు సూరి ఇండియన్ పోలీసుల గూఢచారి అని తెలిసిన తర్వాత శివ ఏం చేశాడు? అసలు ఈ తెగ ఇండియా నుంచి శ్రీలంకకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది. గుఢచారిగా వెళ్లిన సూరి.. చివరకు ఆ తెగకు దేవుడిగా ఎలా మరాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. తెరపై భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సిద్ధహస్తుడు. ‘మళ్లీ రావా’లో ప్రేమ, విరహం, గతం-వర్తమానం మధ్య తడమాటాన్ని అద్భుతంగా చూపించాడు. జెర్సీలోని ట్రైన్ సీన్ ఒక్కటి చాలు గౌతమ్ తన కథల్లో ఎమోషన్ని ఎంత బలంగా చూపిస్తాడో చెప్పడానికి. కింగ్డమ్లో కూడా తన బలమైన ఎమోషన్‌పైనే గౌతమ్ ఎక్కువ దృష్టిపెట్టాడు. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. గ్యాగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌తో అన్నదమ్ముల కథని చెప్పాడు. అయితే ఇక్కడ ఎమోషన్ వర్కౌట్ అయినా.. కథ-కథనంలో మాత్రం కొత్తదనం కొరవడింది. సినిమా చూస్తున్నంత సేపు ఇటీవల వచ్చిన రెట్రో సినిమాతో పాటు పాత చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు మన కళ్లముందు తిరుగుతాయి. కథను బలంగా చెప్పే క్రమంలో కొన్ని చోట్ల ట్రాక్ మిస్ అయ్యాడు. అయితే అనిరుధ్ నేపథ్య సంగీతం, విజయ్ నటన ఆ తప్పిదాలను కొంతవరకు కప్పిపుచ్చాయి. 1920లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన బంగారు గని కార్మికుల నేపథ్యంతో కథ చాలా ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత కథ 70 ఏళ్లు ముందుకు జరిగి.. 1991లోకి వస్తుంది. చిన్నప్పుడే పారిపోయిన అన్నకోసం సూరి వెతకడం.. ఓ పోలీసు ఆఫీసర్ దృష్టిలో పడడం.. అన్న ఆచూకి చెప్పి అండర్ కవర్ ఆపరేషన్ కోసం శ్రీలంకకు పంపిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. భారీ యాక్షన్ సీన్లు, ఎలివేషన్లతో కథను నడిపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు మాత్రం భావోద్వేగాలనే బలంగా చూపించాడు. అన్నదమ్ములు కలిసే సీన్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. సముంద్రంలో వచ్చే ఛేజింగ్ సీన్, నేవి అధికారుల నుంచి బంగారం కొట్టేసే సీన్ ఫస్టాఫ్‌కే హైలెట్. ఇంటర్వెల్ సన్నివేశం సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథ అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. పైగా కొన్ని చోట్ల కథనం ట్రాక్ తప్పుతుంది. ఆపదలో ఉన్నవారిని చివరి నిమిషంలో అయినా సరే హీరో వచ్చి ఆదుకోవడం మన తెలుగు సినిమాల సాంప్రదాయం. కానీ కింగ్డమ్లో అది ఫాలో కాకపోవడంతో.. కొంతమందికి ప్రీక్లైమాక్స్ కొత్తగా అనిపిస్తే.. చాలా మందికి ఇలా చేశారేంటి? అనిపిస్తుంది. పార్ట్ 2 కోసమే క్లైమాక్స్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. సూరి పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. సాధారణ పోలీసు కానిస్టేబుల్‌గా, ఆ తర్వాత పోలీసుల గూఢచారిగా, కింగ్డమ్ రాజుగా ఇలా పలు వేరియేషన్లు ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. తన కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సత్యదేవ్ పాత్ర. హీరో అన్న శివగా అద్భుతంగా నటించాడు. ఆయన పాత్రకు స్క్రీన్ స్పేస్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు రెండో హీరో సత్యదేవ్ అనే చెప్పొచ్చు. ఇక మాఫీయా లీడర్ మురుగన్‌గా వెంకటేశ్ విలనిజం బాగా పండించాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీకి పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. డాక్టర్‌గా రెండు మూడు సీన్లలో కనిపిస్తుంది అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం చాలా వరకు రియల్ లొకేషన్లలోనే షూట్ చేశారు. జాన్, గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితనంతో వాటిని అంతే అందంగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ HD స్టిల్స్
-
ఆ విషయంలో మేము పాస్ అయ్యాం : నాగవంశీ
‘ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము(కింగ్డమ్) పాస్ అయ్యాం. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలి ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం మీకు తెర మీద కనిపిస్తుంది." అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘జెర్సీ' సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' ఇది. ఈ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో, ప్రేమ కోసమో ఉంటుంది. ఈ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు 'కింగ్డమ్' ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి అనుభూతిని ఇస్తుంది." అన్నారు. ‘విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని భాగ్యశ్రీ బోర్సే అన్నారు. -
'కింగ్డమ్' రిలీజ్ ప్రెస్‌మీట్.. విజయ్ ఇలా భాగ్యశ్రీ అలా (ఫొటోలు)
-
'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?
'అర్జున్ రెడ్డి', 'గీతగీవిందం' సినిమాల తర్వాత విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'కింగ్డమ్' చేశాడు. దీనిపై బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నాడు. అందుకు తగ్గట్లే మూవీపై హైప్ రోజురోజుకీ బాగానే పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం టికెట్ బుకింగ్స్‌లోనూ అది క్లియర్‌గా కనిపిస్తోంది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ నడుస్తోంది.శ్రీలంక బ్యాక్ డ్రాప్లో తీసిన 'కింగ్డమ్' సినిమాలో అన్నదమ్ముల ఎమోషన్‌తోపాటు యాక్షన్ కూడా కాస్త ఎక్కువగానే ఉండబోతుందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. అనిరుధ్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవి కూడా మూవీపై కాస్త అంచనాలు పెంచాయని చెప్పొచ్చు. ఇందులో విజయ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ కాగా, అన్న పాత్రలో సత్యదేవ్ నటించాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు)విజయ్ దేవరకొండ సూరి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కానిస్టేబుల్, అండర్ కవర్ ఏజెంట్, ఖైదీ.. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకుగానూ విజయ్ రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతడి తర్వాత అనిరుధ్‌కి రూ.10 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు గౌతమ్ రూ.7 కోట్లు వరకు అందుకున్నట్లు టాక్. అన్న పాత్ర చేసిన సత్యదేవ్ కి రూ.3 కోట్లు, హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీకి రూ.కోటి పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత నాగవంశీ.. 'కింగ్డమ్' చిత్రానికి మొత్తంగా రూ.130 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు చెప్పుకొచ్చారు. వీటిలో ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ మంచి రేటుకు కొనుగోలు చేసింది. థియేటర్లో హిట్ టాక్ వస్తే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశముంది. ఎందుకంటే ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో ఇదే పెద్ద చిత్రం. మరో రెండు వారాల తర్వాత గానీ కూలీ, వార్ 2 రావు. హిట్ టాక్ వస్తే అప్పటివరకు 'కింగ్డమ్'దే హవా.(ఇదీ చదవండి: 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమ?) -
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్వీన్‌లా మెరిసిపోతున్న కింగ్డమ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
-
దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్
దుల్కర్ సల్మాన్ పేరుకే మలయాళ హీరో కానీ తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. 'మహానటి', 'సీతారామం' చిత్రాల దెబ్బకు స్ట్రెయిట్ తెలుగు హీరోల కంటే బోలెడంత క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే చేసిన సినిమా 'కాంత'. ప్రముఖ హీరో రానా నిర్మిస్తున్న ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. తాజాగా దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కబడ్డీ బ్యాక్ డ్రాప్ మూవీ.. 'అర్జున్ చక్రవర్తి' టీజర్ రిలీజ్)గతంలో 'మహానటి' సినిమాలో శివాజీ గణేషన్‌గా దుల్కర్ సల్మాన్ అదిరిపోయే యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు 'కాంత' మూవీలోనూ 1960ల్లో ఉంటే ఓ స్టార్ హీరోగా నటించాడు. టీజర్ బట్టి చూస్తే..దుల్కర్ ఓ స్టార్ హీరో. సముద్రఖని ఓ దర్శకుడు. వీళ్లిద్దరూ కెరీర్ ప్రారంభంలో కలిసి మెలిసి ఉంటారు. కానీ తర్వాత గొడవలు వచ్చి విడిపోతారు. అలాంటిది సముద్రఖని తీసే 'శాంత' అనే హారర్ మూవీలో దుల్కర్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లు. ఇక ఈ సినిమాని తెరకెక్కించే విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? దుల్కర్-సముద్రఖని మధ్య ఏం జరిగింది? అనేదే సినిమాలా అనిపిస్తుంది.టీజర్ చూస్తుంటేనే సమ్‌థింగ్ డిఫరెంట్ మూవీలా ఉండబోతుందనే ఫీల్ వచ్చింది. ఇందులో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. సెప్టెంబరు 12న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చూస్తుంటే దుల్కర్ మరో హిట్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్-భాగ్యశ్రీ (ఫొటోలు)
-
ఆ హీరోయిన్ నాకు బాగా నచ్చింది..అందుకే సినిమాలో పెట్టుకున్నా : నిర్మాత
టాలీవుడ్ యంగ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ గురించి అందరికి తెలిసిందే. ఏ విషయం అయినా సరే చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. కొన్ని సార్లు ఆయన చేసిన కామెంట్స్ వివాదస్పదంగానూ మారిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన మాట తీరు మాత్రం మార్చుకోలేదు. విమర్శలను సైతం తేలిగ్గా తీసుకుంటూ ఫోకస్ అంతా సినిమాలపైనే పెడుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలను నిర్మిస్తూ.. టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ‘జర్సీ’ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ని తిరుపతిలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో భాగ్యశ్రీపై నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చడం వల్లే ఆమెను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నానని చెప్పారు. ‘ఒకవేళ ఈ సినిమాలో మీరే హీరో అయితే ఎవరిని హీరోయిన్గా తీసుకుంటారు?’ అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు వంశీ పై విధంగా సమాధానం ఇచ్చాడు.‘భాగ్యశ్రీని నేను కావాలని హీరోయిన్గా పెట్టుకున్నాను. విజయ్ కానీ, గౌతమ్ కానీ నన్ను అడగలేదు. నాకు భాగ్యశ్రీని నచ్చి హీరోయిన్గా తీసుకున్నాను. నేను హీరో అయితే జనాలు సినిమా చూడరు కాబట్టి విజయ్‌ని పెట్టాను’ అని వంశీ అన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్, భాగ్యశ్రీ (వీడియో)
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా భారీ అంచనాలతో జూలై 31న విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం తిరుపతిలో ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నాగవంశీ నిర్మించారు. అయితే, సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.ట్రైలర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో ప్రసంగించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలాకాలంగా ఆయన భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. కింగ్డమ్ విజయం తన కెరీర్‌కు ఎంత ముఖ్యమో చెబుతూ తన మనసులో మాట ఇలా చెప్పాడు. ' మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమా కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేశాను. ఈసారి నా సినిమాని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. కానీ, వెంకన్నస్వామి దయ, ప్రేక్షకుల ఆశీసులు. ఈ రెండూ నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే' అంటూ ఆయన అన్నారు. సినిమా వేడుక అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన ఆశీసులు తీసుకున్నాడు. దీంతో విజయ్, భాగ్యశ్రీ, నాగవంశీ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.#KINGDOM team Divine Visit to Tirupathi ✨️❤️@TheDeverakonda and team completed Lord Venkateswara Swamy Darshanam in the early hours today 🙏Gearing up to surprise in theatres on July 31st💥💥#VijayDeverakonda #BhagyashriBorse pic.twitter.com/iLQM5374jB— Eluru Sreenu (@IamEluruSreenu) July 27, 2025 -
అందులో రొమాంటిక్ యాంగిల్ మాత్రమే చూశారు: భాగ్యశ్రీ బోర్సే
ఒకే ఒక్క తెలుగు సినిమాతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). ఆ పాపులారిటీతోనే ఇప్పుడు చేతినిండా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోంది. ఆ విషయాలే మీ కోసం.. నైజీరియాలోని లాగోస్‌లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్‌గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు వ్యాపార బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌తో ఆమె ప్రసిద్ధిచెందింది.విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమాలో నుంచి విడుదలైన ‘హృదయం లోపల’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ఆమె చాలా ఇంటిమేట్‌గా కనిపించింది. ఈ విషయమై ఆమెను అడగ్గా, ‘క్యారెక్టర్‌కి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికే అలా నటించా– స్టార్డమ్ అందుకోవడానికి కాదు. ఇందులోని హీరోయిన్ పాత్రలో కేవలం రొమాంటిక్ యాంగిలే కాదు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అందుకే, ఈ సినిమా కోసం నేను కూడా ఒక కామన్ ఆడియన్స్‌లాగా ఎదురు చూస్తున్నాను.’ అని భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రీసెంట్గా 26వ పుట్టినరోజు జరుపుకున్న భాగ్యశ్రీ.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో జన్మించింది. భాగ్యశ్రీకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లల్లో భాగ్యశ్రీ రెండవది. మిగిలిన ఇద్దరి పేర్లు మధువంతి, పూర్ణిమ. మొదటి సినిమాకి (మిస్టర్ బచ్చన్) రూ. 30 లక్షల పారితోషికం తీసుకున్న భాగ్యశ్రీ, ప్రస్తుతం రూ. రెండు కోట్లు డిమాండ్ చేస్తోందని సమాచారం.ఏ ఫుడ్ ఇష్టం: హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బేగం బజార్లో దొరికే పానీ పూరీ, చాట్ అంటే ప్రాణం. అవకాశం దొరికినప్పుడు తనే స్వయంగా వెళ్లి తినడానికి ప్రయత్నిస్తుంది.ఏ సినిమాలు చేస్తుంది: రామ్ పోతినేనితో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా చేస్తోంది భాగ్యశ్రీ. ‘కింగ్డమ్’ సినిమా రిలీజ్ తర్వాతే కొత్త ప్రాజెక్టులు సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేయకుండా, ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులకు మాత్రమే సైన్ చేస్తానంటోంది భాగ్యశ్రీ.బాలీవుడ్ ఆలోచనపై: కెరీర్ ఆరంభంలో హిందీలో ‘ఆరియాన్’, ‘చందు ఛాంపియన్’ అనే రెండు సినిమాలు చేసింది. కానీ, ఆ రెండూ నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతానికి బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదంది.వెజిటేరియనే కానీ,..: బేసిక్‌గా వెజిటేరియన్ అయినా, ప్రొటీన్ కోసం చికెన్ తినడం అలవాటు చేసుకున్నట్లు చెప్పింది. రొమాంటిక్ సినిమాలు చూడటం చాలా ఇష్టమట. ఏ పని అయినా వందశాతం చేయగలను అనే నమ్మకం ఉంటేనే, ఆ పనిని టేకప్ చేస్తాను. లేకపోతే నో చెప్పేస్తా’ అని చెప్పింది భాగ్యశ్రీ. -
RAPO 22: ఆంధ్రాకింగ్ తాలుకా.. టికెట్ ఇవ్వాల్సిందే..
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం ‘RAPO 22’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానుల్లో సందడి రేపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. నేడు (మే 15) రామ్ బర్త్‌డేను పురస్కరించుకుని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Taluka) అనే టైటిల్‌ను ఆకర్షణీయమైన గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.ఈ గ్లింప్స్ ఒక కిక్కిరిసిన థియేటర్ వెలుపల అభిమానుల కోలాహలంతో ప్రారంభమవుతుంది. అక్కడ ‘ఆంధ్ర కింగ్’ సూర్య కుమార్ (ఉపేంద్ర) కొత్త సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎమ్మోర్వో నుంచి ఎమ్మెల్యే వరకు వీఐపీ రిఫరెన్స్‌లతో టికెట్లు తీసుకోవడంతో విసిగిపోయిన థియేటర్ యజమాని వద్దకు రామ్ సైకిల్‌పై స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అభిమానిగా చెప్పగానే యజమాని టికెట్లను అందజేస్తాడు. వాటిని తీసుకున్న రామ్ తోటి అభిమానులతో సంబరాలు చేసుకుంటాడు. అనంతరం సూర్య కుమార్ భారీ కటౌట్‌పై పూల వర్షం కురిపిస్తూ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అని అరవడంతో టైటిల్ కార్డ్ పడుతుంది.పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సాగర్ పాత్రలో, భాగ్యశ్రీ బోర్సే మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.మరోవైపు, సోషల్ మీడియాలో రామ్ పోతినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు #HappyBirthdayRAPO హ్యాష్‌ట్యాగ్‌తో ఈ టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2, 2025న విడుదల కానుందని సమాచారం. -
సాహసం చేసిన టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్
ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్ పాపులర్ అవుతూ ఉంటుంది. అలా గత కొన్నాళ్లలో చూసుకుంటే భాగ్యశ్రీ బోర్సే పేరు గట్టిగా వినిపిస్తుంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్ అయింది గానీ వరస అవకాశాలు ఈమెని వరించాయి.ప్రస్తుతం తెలుగులో రామ్ కొత్త సినిమాలో, అలానే దుల్కర్ సల్మాన్ 'కాంత'లో భాగ్యశ్రీనే హీరోయిన్. మరోవైపు ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబోలో రాబోయే మూవీలోనూ ఈమెనే హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె ఇప్పుడు ఓ సాహసం చేసింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) 'వన్ లైఫ్, వన్ బ్రీత్, వన్ జంప్' అని భాగ్యశ్రీ.. దుబాయిలో స్కై డైవింగ్ చేసింది. ఇందులో భాగంగా విమానంలో ఆకాశంలో చాలా ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి దూకేస్తారు. చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తున్నప్పటికీ.. ధైర్యం కావాలి. ఇప్పుడు ఈ అడ్వెంచర్ చేసి తన చిన్న చిన్న కోరికలని భాగ్యశ్రీ నెరవేర్చుకుంటోంది.మరోవైపు భాగ్య శ్రీ.. తెలుగు హీరో రామ్ తో డేటింగ్ లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత కలిసి ఓ సినిమా చేస్తున్న వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అంటున్నారు. అయితే ఇది నిజమా? మూవీ పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంటా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సినిమాలతోనే కాదు సాహసాలు చేస్తూ కూడా ట్రెండింగ్ లో ఉంటోందిగా.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
అషూ అందాల జాతర.. క్యూట్ గా మాయ చేస్తున్న రితిక
స్కై డైవింగ్ చేసి అదరగొట్టేసిన భాగ్యశ్రీ బోర్సేబర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న నందితా శ్వేతమిడ్ నైట్ పార్టీ చేసుకుంటున్న సుప్రీతఅందాల ముద్దుగుమ్మలా రితికా నాయక్ థాయ్ లాండ్ లో చిల్ అవుతున్న స్రవంతిహాట్ బ్యూటీలా మెరిసిపోతున్న జ్యోతిరాయ్ఇద్దరు పిల్లలకు తల్లయిన ప్రణీత తగ్గట్లేదుగా View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
భాగ్యశ్రీ బోర్సే తో ప్రేమ పై రామ్ క్లారిటీ!
-
ఒక తార పుట్టింది!
‘‘ఒక స్టార్ (తార) పుట్టింది.... కుమారి’’ అంటూ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్‌ని విడుదల చేసింది. 1950 మద్రాస్ నేపథ్యంలో రూపొందిన ‘కాంత’ చిత్రంలో భాగ్యశ్రీ పోషించినపాత్ర పేరు కుమారి. మంగళవారం (మే 6) ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని కొత్త ఫొటోను విడుదల చేసింది యూనిట్. ప్రశాంత్ పోట్లూరి, జోమ్ వర్గీస్‌తో కలిసి రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా – దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా రూపొందిన చిత్రం ‘కాంత’.సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ బహు భాషా చిత్రం రూపొందింది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘‘అద్భుతమైన కథ, గొప్ప నటీనటులు, ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతినిచ్చేలా ఉంటుంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
-
సురేఖా వాణి బర్త్ డే సెలబ్రేషన్స్.. చీరలో ట్రెండింగ్ బ్యూటీ
తల్లి సురేఖావాణి పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన సుప్రీతచీరలో ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేటోపీతో టూర్ లో చిల్ అవుతున్న కాయదు లోహర్ఎర్రటి డ్రస్సులో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్అందాల్ని ఎర వేస్తూ రెచ్చగొట్టేస్తున్న కేతిక శర్మఫ్యామిలీతో కలిసి శ్రియ శరణ్ హ్యాపీ మూమెంట్స్చీరలో చాలా నిండుగా బాలయ్య బ్యూటీ హనీరోజ్ View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Pepper Trail, Wayanad (@peppertrail) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. మే 30న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు వరకు సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ తాజాగా పాటతో ప్రమోషన్స్ తో మొదలుపెట్టడంతో పుకార్లకు చెక్ పడింది. ఇప్పుడు ఆ పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ') 'హృదయం లోపల..' అంటూ సాగే ఈ గీతంలో కింగ్డమ్ సినిమా కథేంటి అనేది కొంతలో కొంత రివీల్ చేశారని చెప్పొచ్చు. సూరి అనే రౌడీ, అతడితో ప్రేమలో ఉన్న ఓ డాక్టర్.. వీళ్లిద్దరూ కలిసి శ్రీలంక ఆర్మీపై ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనిపించారు. అదేంటి అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలి.కింగ్డమ్ సినిమాలో సూరి అనే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించాడు. అతడి ప్రేయసిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ పాటలో ఓవైపు చంపడం చూపిస్తూనే, చివర్లో రొమాన్స్ కూడా చూపించారు. సినిమా కూడా అటు యాక్షన్, ఇటు రొమాన్స్ అనేలా ఉంటుందని హింట్ ఇచ్చారేమో?(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా!) -
భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్..
-
RAPO 22: మోహన్‌లాల్ కాదు...ఉపేంద్ర?
రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో ఉపేంద్ర ఓ లీడ్ రోల్ చేయనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రామ్ హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాగర్ పాత్రలో రామ్, మహాలక్ష్మి పాత్రలో భాగ్య శ్రీ బోర్సే కనిపిస్తారు. కాగా.. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో, కన్నడ స్టార్ ఉపేంద్రను సంప్రదించారట. ఈ పాత్ర చేసేందుకు ఉపేంద్ర సుముఖంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఉపేంద్ర చేయనున్నది సినిమా హీరో క్యారెక్టర్ అని సమాచారం. మరి... రామ్ సినిమాలో సినిమా హీరోగా ఉపేంద్ర నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 15న రామ్ బర్త్ డేకి ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమా గురించిన అప్డేట్ రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
భాగ్యశ్రీకి మరో బంపర్ ఆఫర్?
-
ప్రభాస్ 'బ్రహ్మరాక్షస్'లో ట్రెండింగ్ హీరోయిన్?
సాధారణంగా ఫ్లాప్ వస్తే ఆ సినిమా హీరోయిన్లని పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ బ్యూటీకి మాత్రం వరస అవకాశాలొస్తున్నాయి. చేతిలో ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులుండగా.. ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ?గతేడాది రిలీజైన 'మిస్టర్ బచ్చన్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. దీనికి ముందు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో నటించిందంతే. బచ్చన్ మూవీ ఫ్లాప్ అయినా సరే దుల్కర్ సల్మాన్ 'కాంత', విజయ్ దేవరకొండ 'కింగడమ్', రామ్ కొత్త మూవీలో ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)పై మూడు కాకుండా సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తీసే మూవీలోనూ భాగ్యశ్రీనే తీసుకోవాలని ఫిక్సయ్యారట. ఇలా చేతినిండా సినిమాలతో ఉన్న ఈమెని ఇప్పుడు ప్రభాస్ కోసం లుక్ టెస్ట్ చేశారట.రీసెంట్ గా ప్రశాంత్ వర్మ-ప్రభాస్ మూవీ ఓకే అయింది. ఇందులోనే హీరోయిన్ గా భాగ్యశ్రీని పరిశీలించారట. అందులో భాగంగానే శుక్రవారం లుక్ టెస్ట్ షూట్ కూడా జరిగిందట. దాదాపు ఓకే అని అంటున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం భాగ్యశ్రీ.. లక్ తోక తొక్కేసినట్లే.(ఇదీ చదవండి: మార్చిలో థియేటర్ మూవీస్.. హిట్ కొడితే చాలు!) -
రైటర్ గా మారిన రామ్ పోతినేని..!
-
సూర్యతో జోడీ?
హీరో సూర్య(Suriya) సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్గా నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారని తెలిసింది.ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేశారని తెలిసింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, మే నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓ మల్టీస్టారర్ అని, సూర్యతో పాటు మరో హీరో కూడా నటిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. -
హీరో రామ్ ప్రేమలో పడ్డాడా?
-
క్యూట్ కాంత
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గులాబీ రంగు చీరలో సింప్లీ సూపర్బ్‌గా కనిపించారు భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే ‘కాంత’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలోని పింక్ శారీలో క్యూట్‌గా ఉన్న భాగ్యశ్రీ లుక్‌ని విడుదల చేశారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.‘‘1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కాంత’. అప్పటి మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలను ఆవిష్కరించే చిత్రం ఇది. ఈ బహు భాషా చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జాను. -
బ్లాక్ డ్రెస్‌లో బాబోయ్ అనిపిస్తున్న మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే
-
మీనాక్షికి పోటీగా వస్తోన్న భాగ్యశ్రీ బోర్స్..
-
RAPO22: 'మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి'.. భాగ్యశ్రీ లుక్ అదిరింది!
ఉస్తాద్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా. ఈ చిత్రంలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదల చేశారు.'మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి' అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ చూస్తే... చుడీదార్ ధరించి ట్రెడిషనల్ లుక్కులో బావున్నారు. ఆవిడ కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ అయితే ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.'హైదరాబాద్‌లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీశాం. సాగర్ పాత్రలో రామ్ ఒదిగిన తీరు, ఆయన నటన ఆడియన్స్ అందరికీ ఒక ట్రీట్ అని చెప్పాలి. ప్రేక్షకులు నోస్టాల్జియాలోకి వెళతారు. ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోంది. రామ్, భాగ్య శ్రీ జోడీ క్యూట్ గా ఉందని అందరూ చెబుతున్నారు. సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయి'' అని దర్శక నిర్మాతలు తెలిపారు. మన సాగర్ గాడి లవ్వు ❤️Meet @bhagyasriiborse as Mahalakshmi.Let this new year bring a lot of love and joy to all your lives ✨Team #RAPO22 wishes you all a very Happy New Year ❤🔥@filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @sreekar_prasad… pic.twitter.com/vAHpfWRvXT— RAm POthineni (@ramsayz) January 1, 2025 -
ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన భాగ్యశ్రీ కి వరుస ఆఫర్లు..
-
ఫీల్ గుడ్ షురూ
రామ్ పోతినేని హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేనిలు దర్శకుడు మహేశ్‌కు స్క్రిప్ట్ అందజేశారు. ‘‘యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కనున్న సినిమా ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
టాలీవుడ్‌ను రూల్ చేయనున్న హీరోయిన్స్ విలే..
-
తెలుగులో తొలి మూవీ ప్లాఫ్.. ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్
సాధారణంగా హీరోయిన్లు నటించిన సినిమాలు ప్లాఫ్ అయితే కొత్తగా అవకాశాలు రావడం తక్కువ. అలాంటిది 'మిస్టర్ బచ్చన్' బ్యూటీకి మాత్రం క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు వస్తున్నాయి. భాగ్యశ్రీ.. తొలుత 'యారియన్ 2' అనే హిందీ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది. రవితేజ మూవీతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోయింది. మూవీ డిజాస్టర్ అయినప్పటికీ.. భాగ్యశ్రీ డ్యాన్సులు, గ్లామర్‌కి మార్కులు పడ్డాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)ఇప్పుడదే గ్లామర్ మరికొన్ని అవకాశాలు తీసుకొస్తోంది. ఇప్పటికే దుల్కర్ 'కాంత' సినిమాలో భాగ్యశ్రీ నటిస్తుండగా.. తాజాగా రామ్ పోతినేని కొత్త మూవీలోనూ ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు.'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో ఆకట్టుకున్న డైరెక్టర్ మహేశ్ బాబు.. రామ్-భాగ్యశ్రీ సినిమాని తీస్తున్నాడు. నవంబర్ 21న ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ట్రెడీషనల్ లుక్స్‌లో కుర్రకారు మనసు దోచేస్తున్న భాగ్యశ్రీ... (ఫొటోలు)
-
మిస్టర్ బచ్చన్ హీరోయిన్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..
-
మరికొద్ది గంటల్లో ఓటీటీకి మిస్టర్ బచ్చన్.. ఎక్కడ చూడాలంటే?
మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సో జంటగా నటించిన చిత్రం'మిస్టర్ బచ్చన్'. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఊహించని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మిస్టర్ బచ్చన్.. ఓటీటీ ప్రియులను అలరిస్తుందేమో చూడాలి.అసలు కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
మద్రాస్ నేపథ్యంలో...
దుల్కర్ సల్మాన్ హీరోగా ‘కాంత’ సినిమా షురూ అయింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ– ‘‘ సురేశ్ ప్రోడక్షన్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మా స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు సరైన చిత్రం ‘కాంత’. సోమవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం’’ అన్నారు.‘‘మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన కథ ‘కాంత’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు. ‘‘1950 మద్రాస్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని సెల్వమణి సెల్వరాజ్ పేర్కొన్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సాయికృష్ణ గద్వాల్, లైన్ ప్రోడ్యూసర్: శ్రవణ్ పాలపర్తి, కెమెరా: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం: జాను.దుల్కర్ చేతికి ‘క’ మలయాళ రిలీజ్ హక్కులుకిరణ్ అబ్బవరం హీరోగా నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో విడుదలకానుంది. కాగా ‘క’ సినిమా మలయాళ థియేట్రికల్(వరల్డ్ వైడ్) రైట్స్‌ను హీరో దుల్కర్ సల్మాన్ ప్రోడక్షన్ కంపెనీ వేఫేరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది. -
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ భామ.. ఆ హీరోతో మూవీ!
రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ చిత్రంలో మెప్పించిన ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఈ మూవీతో తన గ్లామర్‌తో తెలుగు అభిమానులను కట్టిపడేసింది. సితార్ సాంగ్‌లో తన అందచందాలతో ముగ్ధుల్ని చేసింది. మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో వస్తోన్న కాంత మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ. ఇటీవలే దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో జరిగిన ఈ మూవీకి టాలీవుడ్ హీరో వెంకటేశ్ క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. 1950లో మద్రాసు నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వేఫేరర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. A collaboration of two creative powerhouses for an epic tale💥 @DQsWayfarerFilm and @SpiritMediaIN join forces for an exciting multilingual film #Kaantha ❤️🔥Starring @dulQuer #BhagyashriBorse Directed by #SelvamaniSelvaraj Produced by @DQsWayfarerFilm@RanaDaggubati pic.twitter.com/d0r91YIkM3— Wayfarer Films (@DQsWayfarerFilm) September 9, 2024 -
మిస్టర్ బచ్చన్ ప్లాప్ తో బోరుమంటున్నబోర్సే
-
హరీశ్ శంకర్ గురించి నేను అలాంటి కామెంట్ చేయలేదు: నిర్మాత
రవితేజ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈక్రమంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన క్రిటిసిజం, ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకుని ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నుంచి 13 నిమిషాల నిడివి తగ్గించారు. అయినా కూడా టికెట్లు మాత్రం తెగలేదు. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి డైరెక్టర్ హరీశ్ శంకర్ అని నిర్మాత టీజీవీ విశ్వప్రసాద్ కామెంట్లు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ అంశం గురించి వారిద్దరూ ఒక క్లారిటీ ఇచ్చారు.స్క్రిప్ట్ బలంగా లేదు: టీజీవీ విశ్వప్రసాద్ మిస్టర్ బచ్చన్ సినిమాపై డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా రిజల్ట్ గురించి ఆయన ఇలా చెప్పారు.' సినిమా స్క్రిప్ట్ మరింత బలంగా ఉండాల్సింది. ఈ విషయంలో మేము మిస్‌ఫైర్ అయ్యాం. కొంత ఎడిట్ చేసింటే బాగుండేది. మిస్టర్ బచ్చన్ సెకండాఫ్ కాస్త నిరాశపరిచింది. అయితే, కొంతమంది సోషల్ మీడియాలో పనికట్టుకుని సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు.'అని ఆయన చెప్పారు.టీజీ విశ్వప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు తమకు నచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. సినిమాను హరీశ్ శంకర్ నాశనం చేశాడని విశ్వప్రసాద్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా విశ్వప్రసాద్ తన ఎక్స్ పేజీలో రియాక్ట్ అయ్యారు. హరీష్ శంకర్ తనకు మంచి స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. హరీశ్ శంకర్ గురించి తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, తాను అనని మాటలను మీడియా పెద్దవిగా చూపుతూ ప్రచారం చేసిందని చెప్పారు. హరీశ్ శంకర్ సినిమా మేకింగ్ మీద తనకు చాలా నమ్మకం ఉందని మరో సినిమా ఆయనతో కలిసి చేసేందుకు ఎదురుచూస్తున్నట్టుగా రాసుకొచ్చారు.డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా టీజీ విశ్వప్రసాద్ గురించి రియాక్ట్ అయ్యారు.. మీ సపోర్ట్ గురించి నాకు తెలుసు సార్.. అయితే, మీడియాలో మీరు అన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఉందని నేను ఒక్క క్షణం కూడా నమ్మలేదు. మీతో కలిసి చేయబోయే తర్వాతి సినిమా కోసం ఎదురుచూస్తున్నా.. మంచి విజయాన్ని తప్పకుండా అందుకుంటాం. అయితే, మిస్టర్ బచ్చన్ విడుదల సమయంలో మీడియాపై హరీశ్ శంకర్ చేసిన కామెంట్ల వల్లే సినిమాపై వేగంగా నెగిటివ్ టాక్ వ్యాప్తికి కారణమైందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. -
రవితేజస్ మిస్టర్ బచ్చన్ సక్సెస్ సెలబ్రేషన్స్
-
రవితేజ-భాగ్యశ్రీ కాంట్రవర్సీ స్టెప్.. స్పందించిన హరీశ్ శంకర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలై మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. కథ-కథనం బాలేకపోయినా.. సంగీతం మాత్రం అదిరిపోయిందని అంతా అంటున్నారు. పాటల విషయంలో హరీశ్ మరోసారి తన మార్క్ చూపించారని కొనియాడుతున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్కే సినిమాకు ప్లస్ పాయింట్ అని పలు వెబ్సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. అయితే ‘సితార్’ పాటలో రవితేజ-భాగ్యశ్రీ బోర్సే వేసిన ఓ స్టెప్పు మాత్రం కాంట్రవర్సీకీ దారి తీసింది. (చదవండి: మిస్టర్ బచ్చన్ రివ్యూ)కొంతమంది నెటిజన్స్ ఆ స్టెప్పు తాలుకు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హరీశ్ శంకర్‌ని ట్రోల్ చేస్తున్నారు. చర్చనీయాంశమైన ఆ స్టెప్పు గురించి తాజాగా హరీశ్ శంకర్ స్పందించాడు. పాటలకు హీరోహీరోయిన్లు చేసే డ్యాన్స్‌ని ఫ్లోలో చూస్తే బాగుంటుందని.. స్క్రీన్ షాట్ తీస్తే ఇబ్బందిగానే కనిపిస్తుందని అని అన్నాడు.‘వాస్తవానికి ఆ పాటకు ఆ స్టెప్ అవసరం లేదని నాక్కుడా అనిపించింది. అయితే షూటింగ్ మొదటి రోజే ఆ పాటను షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆయన చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన కంపోజ్ చేసిన మూమెంట్‌ని మొదటి రోజే నేను వద్దు అంటే బాగోదేమో అని ఆగిపోయాను. షూటింగ్ బిజీలో పడి అది పట్టించుకోలేదు. సెన్సార్‌లో కూడాఫ్లోలో చూశారు కాబట్టి ఓకే అయింది. ఎప్పుడైనా పాటల్లో డ్యాన్స్‌ని ఫ్లోలో చూడాలి. అలా కాకుండా స్క్రీన్ షాట్ తీసి చూస్తే చాలా వరకు ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంది’ అని హరీశ్ చెప్పుకొచ్చాడు. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రష్మిక ని డేంజర్ లో పెట్టిన Mr. బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ
-
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఎప్పుడు రావొచ్చు?
రవితేజ లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' థియేటర్లలోకి వచ్చేసింది. చాలా నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్లు వేశారు కానీ టాక్ అయితే పాజిటివ్‌గా రాలేదు. రవితేజ ఎనర్జీ, కొత్తమ్మాయి భాగ్యశ్రీ గ్లామర్ పరంగా ఏ లోటు లేనప్పటికీ మిగతా విషయాలు పరమ రొటీన్‌గా ఉన్నాయని చూసిన వాళ్లు అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఎవరనేది కూడా తేలిపోయింది.(ఇదీ చదవండి: ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ)2018లో హిందీలో వచ్చిన సినిమా 'రైడ్'. ఓ సాధారణ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. పలుకుబడి ఉన్న పెద్ద మనిషి ఇంటిపై రైడ్ చేసి ఎలా చెమటలు పట్టించాడనేదే స్టోరీ. దీనికి కాస్త ఎంటర్టైన్మెంట్ , రవితేజ మార్క్ వినోదం జోడించి తీసిన తెలుగు సినిమా 'మిస్టర్ బచ్చన్'. హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీ గ్లామర్, డ్యాన్సుల వల్ల కాస్త హైప్ పెరిగింది. కానీ ఈ అంచనాల్ని మూవీ అందుకోలేకపోయిందని అంటున్నారు.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన మూవీస్ అన్నీ థియేటర్లలో రిలీజైన 28 రోజుల తర్వాత వచ్చేస్తున్నాయి. బచ్చన్ కూడా నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబరు రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అంతకంటే ముందే వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
తమ్ముళ్లూ... ఇరగదీయబోతున్నాం: రవితేజ
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాని మా డీవోపీ అయాంక చాలా కలర్ఫుల్గా, లడ్డూలా చూపించారు. ‘మిస్టర్ బచ్చన్’లో నేను, భాగ్యశ్రీ చాలా అందంగా కనిపించడానికి కారణం ఆయనే. మా డ్యాన్స్ మాస్టర్ భాను రెండు పాటలను ఇరగదీశాడు. భాస్కరభట్ల నాకు ఎన్నో పాటలు రాశాడు. ఈ మధ్య నాకు కాసర్ల, సాహితీ కూడా రాస్తున్నారు. కొత్త యాక్షన్ కో–ఆర్డినేటర్ పృథ్వీ చాలా కామ్‌గా ఉంటాడు. నాలుగు ఫైట్స్‌లో ఒక్క ఫైట్ తప్ప మిగతా మూడూ తనే చేశాడు. ఫైట్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. ఇంకా ఇతర టీమ్ సభ్యులు కూడా బాగా హార్డ్‌వర్క్ చేశారు. మిక్కీ జే మేయర్ నుంచి అసలు ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. ఫస్ట్ టైమ్ ట్యూన్స్ వినిపించినప్పుడు ‘ఇది మిక్కీనా’ అనిపించింది. అంత మంచి పాటలు ఇచ్చాడు. వివేక్‌గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. విశ్వప్రసాద్గారూ... మీ ఫ్యాక్టరీ ఇలానే రన్ అవ్వాలి. పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి. హరీష్ చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయి, మా కాంబినేషన్లో నెక్ట్స్ సినిమా హ్యాట్రిక్‌కి నాంది కావాలి. తమ్ముళ్లూ (అభిమానులను ఉద్దేశించి) ఇరగదీయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చూసే సినిమా ఇది’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేశ్ అతిథులుగాపాల్గొన్నారు. -
రష్మికా, త్రిప్తి డిమ్రికి షాక్.. నయా నేషన్ క్రష్ గా భాగ్యశ్రీ బొర్సే..
-
ఆ ఈలలు అమితానందాన్నిచ్చాయి: భాగ్యశ్రీ బోర్సే
‘‘నటి అవ్వాలనుకున్నప్పుడు భవిష్యత్ ఎలా ఉంటుందా అనిపించింది. దీనికి తోడు కొందరు కెరీర్లో వేగంగా ముందుకు వెళ్తుంటారు. వారిలా అవకాశాలు నాకు ఎప్పుడు వస్తాయా? అనే ఆలోచన కూడా ఉండేది. అయితే ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో నేను వేదికపైకి రాగానే ప్రేక్షకులు చేసిన హంగామా, ఈలలు చూసి నాకు అమితానందం కలిగింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లొచ్చాయి (ఆనందంతో..)’’ అన్నారు భాగ్యశ్రీ బోర్సే. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో భాగ్యశ్రీ బోర్సే చెప్పిన సంగతులు.⇒ నా స్వస్థలం మహారాష్ట్రలోని ఔరంగాబాద్. మా నాన్నగారి ఉద్యోగ రీత్యా నైజీరియాలోని లాగోస్‌కు షిఫ్ట్ అయ్యాం. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ కోసం ముంబై వచ్చాను. గ్రాడ్యుయేషన్‌లో ఉండగానే మోడలింగ్ చేయమని నన్ను చాలామంది ప్రోత్సహించడంతో ట్రై చేద్దామనుకున్నాను. ఈ ఫీల్డ్ నాకు బాగా నచ్చింది. మెల్లిగా కెమెరా భయం కూడా ΄ోయింది. ఆ తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను ⇒ ‘మిస్టర్ బచ్చన్’లో తెలుగు మార్వాడీ అమ్మాయి జిక్కీపాత్రలో కనిపిస్తాను. కథలో జిక్కీపాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. మిస్టర్ బచ్చన్ (రవితేజపాత్ర)ను మోటివేట్ చేసేలా నా రోల్ ఉంటుంది. అయినా మహిళలు లేకుండా ఏ కథ పూర్తి కాదని నా అభి్ర΄ాయం. తెలుగు భాష మీద పట్టు సాధించి, జిక్కీపాత్రకు నేనే డబ్బింగ్ చెబుతానని హరీష్ శంకర్‌గారిని అడిగితే ఆయనప్రోత్సహించారు ⇒ హీరోగా రవితేజగారికి చాలా అనుభవం ఉంది. కానీ ఆయన ఓ కొత్త నటుడిగా సెట్స్‌లో కష్టపడతారు. పీపుల్ మీడియా వంటి ప్రముఖ సంస్థ ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది. నాకు డ్యాన్స్ బ్యాగ్రౌండ్ లేదు. కానీ ఈ సినిమాలోని ‘రెప్పల్ డప్పుల్’, ‘సితార’పాటలకు మంచి స్పందన లభిస్తుండటం సంతోషాన్నిచ్చింది. ఇక నా నెక్ట్స్ మూవీస్ గురించి త్వరలో చెబుతాను. -
బ్లాక్ డ్రెస్‌లో కుర్రకారును మత్తెక్కిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ (ఫొటోలు)
-
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ అదిరిపోయే HD స్టిల్స్
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ ఫ్రెండ్‌షిప్‌డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
తెలుగు నేర్చుకుని మరీ...
ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అవలీలగా తెలుగు మాట్లాడారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ద్వారా ఆమె తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలోని తనపాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆమె మాతృభాష తెలుగు కాదు. అయినప్పటికీ కష్టపడి తెలుగు నేర్చుకొని తనపాత్రకు డబ్బింగ్ చెప్పి అందర్నీ సర్ప్రైజ్ చేశారామె.ఆమె అంకితభావం ప్రశంసనీయం అని చిత్రబృందం పేర్కొంది. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. -
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్.. అందానికే ఆధార్‌లా ఉందిరోయ్! (ఫొటోలు)
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
మాస్ మహారాజా వచ్చేస్తున్నాడు.. మిస్టర్ బచ్చన్ రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ మహారాజా హీరో రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. గతంలో వీరిద్దరి కాంబోలో షాక్, మిరపకాయ్ లాంటి సినిమాలొచ్చాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఇటీవలే సితార్ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు ఆడియన్స్ విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని రవితేజ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మాస్ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్‌గా రవితేజ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించనున్నారు. Get Ready!!#MrBachchan is Arriving..MASSive entertainment begins from this August 15th 🤙Premieres on AUG 14th.. pic.twitter.com/xkSEy5EUkW— Ravi Teja (@RaviTeja_offl) July 21, 2024 -
లేలేత సొగసులతో మిల మిల మెరిసిపోతున్న భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
-
పట్టుచీర కట్టుకోమ్మా...
‘చిట్టి గువ్వలాంటి చక్కనమ్మా... బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా...’ అంటూ మొదలవుతుంది ‘మిస్టర్ బచ్చన్’లోని ‘సితార్’ సాంగ్. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. బుధవారం ‘సితార్...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. కశ్మీర్ వ్యాలీలో ఈ మెలోడీ డ్యూయెట్‌ను రవితేజ, భాగ్యశ్రీ కాంబినేషన్లో చిత్రీకరించారు. చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ పాటకు సాహితి సాహిత్యం అందించగా సాకేత్, సమీరా భరద్వాజ్ పాడారు. -
ట్రెడిషనల్ వేర్లో కిల్లింగ్ లుక్స్... ఎవరీ బ్యూటీ (ఫోటోలు)
-
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
మాస్ మహారాజాకి జోడీగా క్లాస్ మహారాణి.. ఎవరీ భాగ్యశ్రీ బోర్సే?
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్, కాస్టింగ్ ఎంపిక పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా హీరోయిన్ని సెలెక్ట్ చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించబోతుందని తెలియజేస్తూ..ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. అందులో భాగ్యశ్రీ చాలా గ్లామరస్ గా ఉంది. చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపించింది. హరీశ్ శంకర్ తన సినిమాల్లో హీరోయిన్స్‌ని అందంగా చూపిస్తాడు. రవితేజ, భాగ్యశ్రీల క్లాస్, మాస్ కాంబినేషన్ ప్రేక్షకులని అలరించబోతుంది. ఎవరీ భాగ్యశ్రీ? పుణెకు చెందిన భాగ్యశ్రీ బోర్సే..ఓ పాపులర్ మోడల్. వయసు 33 ఏళ్లు. యారియాన్ 2 మూవీలో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. తెరపై అందంగా కనిపించడమే కాకుండా.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. అందుకే హరీశ్ శంకర్ ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారికి సంబంధించిన వివరాలను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse)