
రీసెంట్ టైంలో కంటెంట్ లేదా భారీతనం ఉంటేనే ఆయా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగానే ఉన్నారు. మరోవైపు పలు నిర్మాణ సంస్థలు కంటెంట్ ఉండే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తీసేందుకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. ఇప్పుడు అలా అనుకున్న ప్రాజెక్ట్ కోసం రేసులో ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయట.
(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)
'మహానటి', 'సీతారామం', 'కల్కి' చిత్రాలతో మళ్లీ పుంజుకున్న వైజయంతీ మూవీస్.. తాజాగా 'చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇదో ఫిమేల్ సబ్జెక్ట్ అని, అయితే లీడ్ రోల్ కోసం శ్రీలీల లేదా భాగ్యశ్రీ బోర్సే పేర్లు పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. తండ్రి కూతురు బ్యాక్ డ్రాప్ ఎమోషన్లతో ఈ మూవీ తీయబోతున్నారనే తెలుస్తోంది.
ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల, భాగ్యశ్రీ ఉన్నారు. కమర్షియల్ సినిమాల్లో వీళ్ల యాక్టింగ్‌పై చిన్నపాటి కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. వీళ్లని మెయిన్ లీడ్‌గా పెట్టి ఓ మూవీ అంటే ఏదో డిఫరెంట్‌గానే ట్రై చేస్తున్నారా అనిపిస్తుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటనతో పాటు హీరోయిన్ ఎవరనేది కన్ఫర్మ్ అవుతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఎంటర్‌టైనింగ్‌గా 'మిత్రమండలి' ట్రైలర్)