
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనిపిస్తోంది. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. రెండు నెలల క్రితం అంటే ఆగస్టులో హరిణ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే ఈ విషయంలో సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. దీంతో అందరూ షాకయ్యారు. ఇప్పుడు పెళ్లి పనులు కూడా మొదలైపోయాయా అనే సందేహం కలుగుతోంది. తాజాగా రాహుల్, హరిణ్య కలిసి బ్యాచిలర్ పార్టీ లాంటిది సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్.. బిగ్‌బాస్‌లోకి టీమిండియా స్టార్ బౌలర్?)
హరిణ్య కూడా కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. బిగ్‌బాస్ షోలో రాహుల్ పార్టిసిపేట్ చేసిన టైంలో వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడిందట. అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. రీసెంట్‌గా ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పడు హరిణ్య ఫ్రెండ్ ఇంటిలో చిన్నపాటి పార్టీ జరిగింది. అయితే ఇది బ్యాచిలర్ పార్టీనా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోని హరిణ్య.. తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. వీడియో చూస్తుంటే ఈనెలలోనే రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి జరగనుందేమో అనిపిస్తుంది.
రాహుల్ సిప్లిగంజ్ విషయానికొస్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఇతడు మాస్ సాంగ్స్ పాడటంలో స్పెషలిస్ట్. ఇప్పటికే 'కాలేజ్ బుల్లోడా', 'వాస్తు బాగుందే', 'రంగా రంగా రంగస్థలానా', 'బొమ్మోలే ఉన్నదిరా పోరి' లాంటి సినిమా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. బోనాలు, వినాయక చవితి ఆల్బమ్ సాంగ్స్‌లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ అందించిన నాటు నాటు పాటలోనూ ఓ గొంతు ఇతడిదే. రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.కోటి నజరానా కూడా అందుకున్నాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు)

