
మరోవారం వచ్చేసింది. గత వీకెండ్ 'కాంతార 1', 'ఇడ్లీ కొట్టు' లాంటి డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. ఈసారి మాత్రం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కొన్ని థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో ఎర్రచీర, కానిస్టేబుల్, శశివదనే, అందెల రవమిది, అరి, మటన్ సూప్, ప్రేమతో దెయ్యం లాంటి సినిమాలతో పాటు 'బల్టీ' అనే డబ్బింగ్ బొమ్మ ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 20కి పైగా కొత్త మూవీస్, వెబ్ సిరీసులు రాబోతున్నాయి.
(ఇదీ చదవండి: 'బాహుబలి'ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ)
ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. మిరాయ్, త్రిభాణదారి బార్బరిక్, లీగల్లీ వీర్ అనే తెలుగు చిత్రాలతో పాటు కురుక్షేత్ర అనే యానిమేటెడ్ డబ్బింగ్ సిరీస్ ఈ వారంలోనే రానుంది. అలానే ఎన్టీఆర్ నటించిన హిందీ మూవీ 'వార్ 2' కూడా ఈ వారాంతంలోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మరి ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 06 నుంచి 12వ తేదీ వరకు)
హాట్‌స్టార్
మిరాయ్ (తెలుగు సినిమా) - అక్టోబరు 10
సెర్చ్: ద నైనా మర్డర్ కేస్ (హిందీ సిరీస్) - అక్టోబరు 10
నెట్‌ఫ్లిక్స్
హోర్టన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06
మ్యాట్ మక్కస్కర్: ఏ హంబుల్ ఆఫరింగ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 07
ట్రూ హాంటింగ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 07
కారమెలో (పోర్చుగీస్ సినిమా) - అక్టోబరు 08
ఈజ్ ఇట్ కేక్? హాలోవీన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 08
నెరో (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబరు 08
బూట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 08
వార్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 09 (రూమర్ డేట్)
ద రీసరెక్టెడ్ (మాండరిన్ సిరీస్) - అక్టోబరు 09
ద ఉమెన్ ఇన్ కాబిన్ 10 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 09
విక్టోరియా బెక్‌హమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 09
కురుక్షేత్ర (తెలుగు డబ్బింగ్ యానిమేటెడ్ సిరీస్) - అక్టోబరు 10
స్విమ్ టూ మీ (స్పానిష్ మూవీ) - అక్టోబరు 10
అమెజాన్ ప్రైమ్
మెయింటైనెన్స్ రిక్వైర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 08
జాన్ క్యాండీ: ఐ లైక్ మీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 10
సన్ నెక్స్ట్
త్రిభాణదారి బార్బరిక్ (తెలుగు మూవీ) - అక్టోబరు 10
రాంబో (తమిళ సినిమా) - అక్టోబరు 10
జీ5
ఏ మ్యాచ్ (మరాఠీ సినిమా) - అక్టోబరు 10
వెదువన్ (తమిళ సిరీస్) - అక్టోబరు 10
లయన్స్ గేట్ ప్లే
లీగల్లీ వీర్ (తెలుగు మూవీ) - అక్టోబరు 10
ఆపిల్ ప్లస్ టీవీ
ద లాస్ట్ ఫ్రంటియర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 10
(ఇదీ చదవండి: రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి)