
ప్రముఖ సినీరచయిత కోన వెంకట్ (Kona Venkat) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. రచయిత రెండో కూతురు శ్రావ్య వివాహం ఘనంగా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, రామ్ పోతినేని, అంజలి, రామ్‌గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, బాబీ, కోర్ట్ జంట శ్రీదేవి- హర్ష్ రోషన్ తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు. పూరీ జగన్నాథ్- చార్మి ఒకే కారులో వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కోన వెంకట్ జర్నీ
కోన వెంకట్ సినిమా ఇండస్ట్రీలో కథా, సంభాషణల రచయితగా కెరీర్ ప్రారంభించాడు. ఢీ, రెడీ, దూకుడు, అదుర్స్, గీతాంజలి, అల్లుడు శీను, నిన్ను కోరి వంటి పలు హిట్ చిత్రాలకు రచయితగా వ్యవహరించాడు. చివరగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. సత్య, దిల్‌సే, కౌన్, జంగల్, కంపెనీ వంటి కొన్ని హిందీ సినిమాలకు తెలుగు డబ్బింగ్ రైటర్‌గానూ పని చేశాడు.
MEGASTAR #Chiranjeevi garu at Kona Venkat daughter’s wedding@KChiruTweets #MegastarChiranjeevi pic.twitter.com/XvYz3tk3t0
— Chiruholic (@chiruholicc) October 6, 2025
చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్