
వెండితెరపైకి బాహుబలి మళ్లీ తిరిగొస్తున్నాడు.. కానీ, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మాత్రం తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి’. అనుష్కా శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న, రెండోభాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్ ’ 2017 ఏప్రిల్ 28న విడుదలయ్యాయి. అయితే, బాహుబలి: ది ఎపిక్ పేరుతో ఈ సినిమాను అక్టోబర్ 31న రీరిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకోవడంతో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
బాహుబలి రెండు భాగాలు నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీష్ వర్షన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషలకు చెందిన వారు ఈ చిత్రాన్ని చేసే ఛాన్స్ దక్కింది. కానీ, సెప్టెంబర్ 30న నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తొలగించేసింది. అయితే, ఈ మూవీని ఎందుకు తొలగించారు..? అనే కన్ఫ్యూజన్ ప్రభాస్ ఫ్యాన్స్‌లో కలిగింది. కానీ, కొన్న కథనాల ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌తో స్ట్రీమింగ్ హక్కుల ఒప్పందం కాలపరిమితి ముగిసిందని తెలుస్తోంది. ఈ కారణం వల్లే బాహుబలిని ఓటీటీ నుంచి తొలగించారని చెబుతున్నారు. సోషల్‌మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా కామెంట్లు కనిపిస్తున్నారు. బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా ఇదొక స్ట్రాటజీలో భాగమని అంటున్నారు.
బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు బాహుబలి ది ఎపిక్ అని టైటిల్‌తో రీరిలీజ్ కానున్నాయి. ఈ సినిమా ఐమ్యాక్స్ , 4DX, EpiQ వంటి భారీ స్క్రీన్ ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ రెండు భాగాల రన్ టైమ్ 5గంటల 27నిమిషాలు ఉంది.కానీ, రీరిలీజ్ కోసం దానిని తగ్గించి మూడున్నర గంటల లోపు ఉండవచ్చని తెలుస్తోంది.