breaking news
Tribanadhari Barbarik Movie
-
అందుకే చెప్పుతో కొట్టుకున్న.. క్షమించండి: దర్శకుడు
టాలీవుడ్ సినిమా 'త్రిబాణధారి బార్బరిక్' విడుదల తర్వాత ఈ టైటిల్ బాగా వైరల్ అయింది. అందుకు ప్రధాన కారణం ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స అని చెప్పవచ్చు. సినిమా విడుదల తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. మంచి సినిమా తీసినా సరే తనకు సపోర్టుగా ఎవరూ నిలబడలేదని ఆయన బాధ పడ్డారు. చాలా కష్టపడినప్పటికీ తగిన ఫలితం దక్కలేదంటూ చెప్పుతో కొట్టుకుని అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అయితే, తాజాగా ఆయన మరో వీడియోతో క్లారిటీ ఇచ్చారు.'త్రిబాణధారి బార్బరిక్' సినిమా కోసం తన కుటుంబాన్ని కూడా బాధ పెట్టానని దర్శకుడు శ్రీవత్స చెప్పారు. ఆపై భావోద్వేగానికి గురై సినీ ప్రేక్షకులను కూడా ఇబ్బంది పెట్టానని ఆయన చింతించారు. ఈ సినిమా నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చునని తెలిపారు. ప్రేక్షకులు ఏదైనా కొత్తగా ఆలోచించాలనే ఈ సినిమాను తెరకెక్కించాను. మలయాళ సినిమాకు దక్కిన ఆదరణ కూడా తన మూవీకి దక్కకపోయేసరికి జీర్ణించుకోలేకపోయానన్నారు. ఈ మూవీ గురించి ఎవరూ మాట్లాడకపోవడంతో అలా చెప్పుతో కొట్టుకున్నట్లు తెలిపారు. ఆ వీడియో ఎవరికైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు.సినిమా రిజల్ట్ చూసి ఉదయభాను కూడా గుక్కపెట్టి ఏడ్చేశారని శ్రీవత్స అన్నారు. దీంతో తాను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నటుడు నరేశ్ కూడా బాధ పడ్డారని గుర్తుచేసుకున్నారు. అయితే, వీడియో వైరల్ అయ్యాక ఇతర దేశాల్లో సినిమా చూసిన వారు తనకు మెసేజ్ చేశారని వాటిని పంచుకున్నారు. సినిమా బాగుందని మెచ్చుకోవడంతో కాస్త సంతోషాన్నిచ్చింది. కానీ, ఇక్కడ కనీసం సినిమా బాగుంది, బాగాలేదు అని కూడా చెప్పడం లేదన్నారు. అందుకే ఎమోషనల్ అయినట్లు ఆయన చెప్పుకొచ్చారు. సినిమా చూసి తప్పులు చెబితే మరోసారి జరగకుండా చూసుకుంటాను కదా అని కోరారు. View this post on Instagram A post shared by Moni Vathsa Mohan (@mohan_srivatsa) -
నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా.. తెలుగు దర్శకుడి ఆవేదన
తెలుగు యువ దర్శకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏకంగా చెప్పుతో కొట్టుకున్నాడు. మంచి సినిమా తీసినా సరే జనాలు ఎందుకు రావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక టాలీవుడ్లో ఉండనని అంటున్నాడు. ఇంతకీ అసలేమైంది? ఈ డైరెక్టర్‌కి వచ్చిన కష్టమేంటి?వినాయక చవితి వీకెండ్లో సుందరకాండ, అర్జున్ చక్రవర్తి, త్రిభాణదారి బార్బరిక్ లాంటి తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. మలయాళ డబ్బింగ్ మూవీ 'కొత్త లోక' కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటిలో 'కొత్త లోక' చిత్రానికి ఉన్నంతలో పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో 'త్రిభాణధారి బార్బరిక్' దర్శకుడు మోహన్ శ్రీవత్స ఆవేదనకు లోనయ్యాడు. తన బాధని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు) 'తాజాగా 'బార్బరిక్' ఆడుతున్న థియేటర్‌కి వెళ్తే లోపల పది మంది మాత్రమే ఉన్నారు. నేనెవరో చెప్పకుండా సినిమా ఎలా ఉందని అడిగితే అందరూ బాగుందని చెప్పారు. అలానే నిన్న(శనివారం) సాయంత్రం నా భార్యతో మూవీ చూసేందుకు వెళ్లాను. మనసు ఏం బాగోలేక అరగంటలోనే ఇంటికి తిరిగొచ్చేశాను. నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని భయపడి నా భార్య కూడా నాతో పాటు వచ్చేసింది. ఇంత మంచి సినిమా తీస్తే జనాలు ఎందుకు రావట్లేదు భయ్యా. నాకు అసలు ఇది అర్థం కావట్లేదు. మలయాళం నుంచి సినిమాలు వస్తే.. అక్కడ మంచి కంటెంట్ వస్తే థియేటర్లకు వెళ్తున్నారు కదా. ఇక మలయాళంలోనే సినిమాలు తీస్తా, అక్కడ హిట్ కొట్టి నిరూపించుకుంటా. సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానని అన్నాను కదా అందుకే నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నాను' అని డైరెక్టర్ మోహన్ శ్రీవత్స వీడియో పోస్ట్ చేశాడు. సత్యరాజ్, ఉదయభాను `త్రిభాణధారి బార్బరిక్`లో ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి బాగుందనే టాక్ వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం వల్లనో ఏమో గానీ జనాలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దర్శకుడికి ఆవేదన ఉండొచ్చు కానీ ప్రస్తుతం జనాలు.. స్టార్ హీరోల చిత్రాలైతేనే థియేటర్లలోకి వచ్చి చూస్తున్నారు. చిన్న చిత్రాలైతే ఓటీటీలో చూసుకోవచ్చులే అనే మైండ్ సెట్‌తో ఉంటున్నారు.(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు) View this post on Instagram A post shared by Moni Vathsa Mohan (@mohan_srivatsa) -
గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితం
సత్యరాజ్, వశిష్ఠ ఎన్. సింహా, ‘సత్యం’ రాజేశ్, ఉదయభాను, సాంచి రాయ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో విజయ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ‘‘మా సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఎక్కువగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఓ ఆఫర్ ఇస్తున్నాం. సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 7). ఈ నేపథ్యంలో ఆగస్ట్ 30, ఆగస్ట్ 31న ప్రదర్శించే సాయంత్రం ఆటకు కుటుంబంతో కలిసి వచ్చే గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
తాత, మనవరాలి కథ.. ఉచితంగానే సినిమా టికెట్లు
సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'త్రిబాణధారి బార్బరిక్'.. నేడు విడుదలైన ఈ చిత్రం బాగుందని టాక్ వస్తుంది. వశిష్ఠ .ఎన్ సింహా, ‘సత్యం’ రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ తదితరులు నటించారు. గత కొన్ని రోజులుగా పెయిడ్ ప్రీమియర్లతో జనాల్లోకి వెళ్లిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చేసింది.(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల ఈ మూవీని నిర్మించారు. మోహన్ శ్రీ వత్స ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎమోషన్స్ ఉన్నా కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతోంది. ఆడపిల్ల ఉండే ప్రతీ ఫ్యామిలీ చూడదగ్గ చిత్రమే ‘త్రిబాణధారి బార్బరిక్’. ఎక్కువగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతుండటంతో మేకర్స్ ఓ ఆఫర్‌ను ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 7) రాబోతోంది. ఈ క్రమంలో ‘త్రిబాణధారి బార్బరిక్’ యూనిట్ గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా ఈ మూవీని ప్రదర్శించే నిర్ణయం తీసుకున్నారు.ఈ రెండు రోజులు ఉచితంఆగస్ట్ 30, ఆగస్ట్ 31న ప్రదర్శించే సాయంత్రం ఆటకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు. ఆగస్ట్ 30, 31నాడు సాయంత్రం మొదటి ఆటకు వెళ్లే ఫ్యామిలీ ఆడియెన్స్‌లోని నలుగురు మెంబర్లలో తాత, అమ్మమ్మ, నానమ్మలకు ఇలా ఇద్దరికి మాత్రం ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఈ సినిమా తాత, మవవరాలికి సంబంధించిన కథ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎక్కువగా కదిలిస్తుండటంతో ఈ ఆఫర్‌ను చిత్రయూనిట్ అందిస్తోంది. ఈ కథ అంతా కూడా తాత, మనవరాలి చుట్టూనే తిరుగుతూ సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుంది. -
‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ
టాలీవుడ్లో ప్రతివారం కొత్త సినిమాలు వస్తున్నా..వాటిల్లో కొన్ని మాత్రమే రిలీజ్‌కి ముందు అటెన్షన్‌ని గ్రాప్ చేస్తాయి. అలా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసుకున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆగస్ట్ 15న ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు(సత్యరాజ్) మనవరాలు నిధి(మేఘన) కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసుని కానిస్టేబుల్ చంద్ర(సత్యం రాజేశ్) డీల్ చేస్తుంటాడు. మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్(వశిష్ట సింహా) విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. దానికోసం రూ.30 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. తన స్నేహితుడు, లేడీ డాన్ వాలికి పద్మ(ఉదయ భాను) మేనల్లుడు దేవ్(క్రాంతి కిరణ్)తో కలిసి ఇష్టం లేకపోయిన కొన్ని అసాంఘీక పనులు చేస్తుంటాడు. దేవ్‌కి జూదం అంటే పిచ్చి. అత్త వాకిలి పద్మకు తెలియకుండా డ్రగ్స్ మాఫియా లీడర్ దాస్(మొట్ట రాజేంద్రన్) దగ్గర లక్షల్లో అప్పు చేసి జూదంలో పొగొట్టుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత దాస్ తన అప్పు తీర్చమని దేవ్‌పై ఒత్తిడి చేస్తాడు. దీంతో డబ్బు కోసం రామ్ ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి? నిధి మిస్సింగ్‌కి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు నిధిని కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే...టైటిల్‌ని చూసి ఇదేదో మైథాలాజికల్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఇది రొటీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దానికి కాస్త మైథాలాజికల్ టచ్ ఇచ్చి డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ విషయంలో ఆయన కాస్త సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథ రొటీనే అయినా కథనం మాత్రం కొత్తగా ఉంటుంది. ఒకేసారి రెండు డిఫరెంట్ కథలను చెబుతూ..చివరిలో ఆ రెంటింటికి మధ్య ఉన్న సంబంధం రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ రెండు ఎపిసోడ్స్‌కి మధ్య లింక్ ఉంటుందని ఊహించినా.. ఆ లింకుని ఎలా చూస్తాడనే అనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు కొనసాగించడంలో దర్శకుడు విజయం సాధించాడు.మహా భారతంలో ఘటోత్కచుని కొడుకు బార్బరీకుడు త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలడు. ఆయన దగ్గర ఉండే మూడు బాణాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిని తెలియజేస్తూ ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత తాత-మనవరాలి స్టోరీని పాటలోనే ఎమోషనల్‌గా చూపించారు. అదే సమయంలో మరో ఎపిసోడ్లో సత్యతో రామ్ లవ్ స్టోరి..వాలికి పద్మ నేపథ్యం, దాస్ డ్రగ్స్ దందా..ఇవన్నీ చూపిస్తూ.. కథనంపై ఆసక్తిని పెంచేశాడు.నిధికి ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేశారు? అమ్మాయి ప్రాణాలతో ఉందా? రామ్‌కి 30 లక్షలు దొరుకుతాయా? రామ్ స్నేహితుడు అప్పు నుంచి బయట పడతాడా? అంటూ ఇలా చాలా లేయర్లతో కథనం ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రివేంజ్ డ్రామా. తన మనవరాలి మరణానికి తాత చేసే న్యాయం ఏంటి? అన్నది ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. పరిస్థితుల వల్ల మనుషులు ఎలా మారిపోతారు? అన్నది ఇందులో గొప్పగా చూపించారు. రాముడి వేషంలో రావణుడిలా మన చుట్టూ ఉన్న వాళ్ళని కనిపెట్టాలి అంటూ అమ్మాయిలకు మంచి సందేశం కూడా ఇచ్చారు.ఎవరెలా చేశారంటే..సైక్రియార్టిస్ట్ శ్యామ్ పాత్రకి సత్య రాజ్ న్యాయం చేశాడు. ఇక ఈ మూవీలో వశిష్ట పాత్ర అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. రకరకాల వేరియేషన్స్‌తో వశిష్ట మరోసారి అందరినీ మెప్పించేస్తారు. కొత్త కుర్రాడు క్రాంతి కిరణ్ కూడా ఆకట్టుకుంటాడు. ఉదయభానుకి చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర పడినట్టు అనిపిస్తుంది. అయితే ఆమె పాత్ర నిడివి మాత్రం కాస్త తక్కువే. సత్యం రాజేష్, సాంచీ రాయ్, మేఘన, కార్తికేయ పాత్రలు ఇలా అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఇక కామెడీ కోసం తీసుకున్న వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్రన్ కారెక్టర్స్ కూడా ఆకట్టుకుంటాయి.సాంకేతికంగా ఈ సినిమా బాగుంది.ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన స్క్రీన్‌ప్లేతో సినిమా స్థాయిని పెంచేశారు. పాటలు పర్వాలేదు. కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు చాలా చోట్ల హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. తొలి సినిమానే అయినా సెల్యూలాయిడ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గొప్పగా ఉన్నాయి. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
నాపాత్ర సరికొత్తగా ఉంటుంది: వశిష్ట ఎన్. సింహా
‘‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్ర కథ మన చుట్టూనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను నెగెటివ్ రోల్స్పోషించాను. కానీ, ఈ సినిమాలో నాపాత్ర సరికొత్తగా ఉంటుంది. సమాజాన్ని ప్రతిబింబించేలా మా చిత్రం, నాపాత్ర ఉంటుంది’’ అని వశిష్ట ఎన్. సింహా తెలిపారు. సత్యరాజ్, ‘సత్యం’ రాజేష్, ఉదయభాను, వశిష్ట ఎన్. సింహా(Vasishta N Simha) కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.మారుతీ టీమ్ ప్రోడక్ట్ సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వశిష్ట ఎన్. సింహా మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో బార్బరికుడు కనిపించడు.. అతని శక్తిని చూస్తారు. ఈ చిత్రం చూశాక మన జీవితంలోనూ సత్య రాజ్‌గారి లాంటి ఓ తాత ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఉత్తరాది, దక్షిణాది అని కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యే భావోద్వేగాలతో తీశాం.మా చిత్రం ప్రేక్షకులను ఎక్కడా నిరాశ పరచదు. విజయ్‌పాల్ రెడ్డికి సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ ఉంది. దర్శకుడు మోహన్‌కి మంచి భవిష్యత్తు ఉంటుంది. మా అబ్బాయికి ప్రస్తుతం ఏడు నెలలు. బాబే మా ప్రపంచం (హరిప్రియ–వశిష్ట). షూటింగ్‌కి వెళ్లినప్పుడు తనని చాలా మిస్ అవుతున్నాను’’ అని చెప్పారు. -
ఆ రెండు సినిమాల్లో ఒక్క చోట కూడా బోర్ కొట్టదు..ఇది నా సవాల్: నిర్మాత
‘‘త్రిబాణధారి బార్బరిక్’ చాలా కొత్త కథ.. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అని నిర్మాత విజయ్‌పాల్ రెడ్డి అడిదల అన్నారు. సత్య రాజ్, ఉదయ భాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. విజయ్‌పాల్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మోహన్ చెప్పిన ‘త్రిబాణధారి బార్బరిక్’ కథ నచ్చడంతో సినిమా ఆరంభించాం. నేను ఇండస్ట్రీ కొత్త.. దీంతో డైరెక్టర్ మారుతిగారు అండగా నిలిచారు. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ వారు మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. రమేష్ రెడ్డి విజువల్స్ మెప్పిస్తాయి. నైజాంలో మైత్రీవారు మా సినిమా రిలీజ్ చేస్తున్నారు. వరంగల్‌లో ప్రదర్శించిన మా చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోలో ఓ జంట ఉచితంగా చూశారు. అయితే, ఇది ఫ్రీగా చూడాల్సిన చిత్రం కాదంటూ వాళ్లు తిరిగి డబ్బులు ఇచ్చారు.. అది చూసిన తర్వాత నాకు ఎంతో సంతృప్తిగా అనిపించింది. ‘త్రిబాణధారి బార్బరిక్’ తో పాటుగా ‘బ్యూటీ’ సినిమా నిర్మించాను. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క చోట కూడా బోర్ కొట్టదు.. ఇది నా సవాల్’’ అని చెప్పారు. -
క్లైమాక్స్‌ని ఎవ్వరూ ఊహించలేరు – సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేశ్ రెడ్డి
‘‘తెలుగులోనూ కంటెంట్ బేస్డ్ సినిమాలొస్తాయని ‘త్రిబాణధారి బార్బరిక్’ నిరూపిస్తుందన్న నమ్మకం మాకు ఉంది. ఈ తరహా చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది. క్లైమాక్స్‌ని ఎవ్వరూ ఊహించలేరు. అద్భుతమైన క్లైమాక్స్ కుదిరింది’’ అని సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేశ్ రెడ్డి అన్నారు. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్. సింహా, సత్యం రాజేశ్ క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమాకు ‘పొలిమేర, రజాకార్’ చిత్రాల ఫేమ్ కుశేందర్ రమేశ్ రెడ్డి కెమెరామేన్‌గా వర్క్ చేశారు. ‘త్రిబాణధారి బార్బరిక్’ గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి ప్రధాన బలం కథ. ‘పొలిమేర, రజాకార్’ సినిమాల కథలు విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ చిత్రకథ విన్నప్పుడూ అలాంటి ఫీలింగే కలిగింది. ఈ సినిమాను ఎక్కువగా రాత్రి పూట, రెయిన్ ఎఫెక్ట్స్‌లోనే షూటింగ్ చేశాం. అయితే వేసవి కాలంలో రెయిన్ సీజన్ ఎఫెక్ట్‌ని చూపించడం అంత సులభం కాదు. ఇదే మాకు పెద్ద సవాల్‌గా అనిపించింది. ఎండాకాలంలో వానా కాలాన్ని సృష్టించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ‘బాహుబలి’ దగ్గర్నుంచి సత్యరాజ్‌గారితో పరిచయం ఉంది. నైట్ షూట్స్, రెయిన్ ఎఫెక్ట్ సీన్లంటూ మేం ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టాం (నవ్వుతూ). ఇక అల్లరి నరేశ్‌గారి ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా చేశాను. ఇటీవలే ‘కామాఖ్య’ చిత్రీకరణ ప్రారంభమైంది. ‘పొలిమేర 3’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. దర్శకుడు అనిల్‌గారితో వరుస సినిమాలు ఉంటాయి’’ అని తెలిపారు. -
‘త్రిబాణధారి బార్బరిక్’లో కొత్తదనం ఇదే : దర్శకుడు
సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ .ఎన్ సింహా, ‘సత్యం’ రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో దర్శక–నిర్మాత మారుతి సమర్పణలో అడిదెల విజయ్‌పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇండస్ట్రీలో మనుగడ సాగించాలని సంగీతం నేర్చుకుని, ఎన్నో ఈవెంట్స్‌లో పాటలు పాడాను. ఇన్ని రోజులు నాకు సంగీతమే తిండి పెట్టింది.దర్శకుడిగా ‘త్రిబాణధారి బార్బరిక్’ నా తొలి చిత్రం. నేను కథను అద్భుతంగా నరేట్ చేయగలను. అలా మారుతిగారికి చెబితే, ఆయన ఆశ్చర్యపోయారు. ఓ పాప చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. ఆగస్టు 15 సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఇంట్రవెల్, ఆగస్టు 15 తర్వాత పది రోజులకు జరిగే మరో కథతో సెకండాఫ్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు మైథలాజికల్ టచ్ ఇచ్చాను. ఈ సినిమాలో విలన్ అంటూ ఎవరూ ఉండరు. అన్ని పాత్రల్లోనూ అంతర్గత యుద్ధం జరుగుతుంటుంది. ఈ సినిమా కొత్తదనం అదే. బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రాన్ని ఆపగలడు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్ధం జరిగేలా చేస్తాడు. నార్త్‌లో బార్బరికుడికి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకు హైదరాబాద్‌లోనూ నాలుగు టెంపుల్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్‌గారు బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. నా తర్వాతి చిత్రం మారుతిగారి బ్యానర్లోనే ఉండొచ్చు’’ అన్నారు. -
‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఇకపై అలాంటి పాత్రలు చేయను: సత్యరాజ్
‘‘నా వయసు డెబ్బై ఏళ్లు దాటింది. నా కెరీర్లో ఎన్నో ఫాదర్ రోల్స్, విలన్ రోల్స్ చేశాను. ఇకపై ఆ తరహా రెగ్యులర్ పాత్రలు కాకుండా ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రంలో నేను చేసిన వైవిధ్యమైన, కొత్త తరహా పాత్రలు చేస్తాను. నా ఫ్రెండ్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా మా చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని నటుడు సత్యరాజ్ అన్నారు.ఆయన ప్రధాన పాత్రధారిగా, వశిష్ట ఎన్ .సింహా, ‘సత్యం’ రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ప్రకటించారు మేకర్స్.ఉదయభాను మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో ఒక సవాల్‌తో కూడిన పాత్ర చేశాను’’ అని చెప్పారు. ‘‘నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు వశిష్ట సింహా. ‘‘క్లారిటీ, కమిట్మెంట్, కంటెంట్‌తో మేం చేసిన సినిమా ఇది’’ అని తెలిపారు మోహన్ శ్రీవత్స. ‘‘మా సినిమాను ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి’’ అన్నారు విజయ్‌పాల్ రెడ్డి అడిదెల. -
రాహుల్ సిప్లిగంజ్ 'దేత్తడి' సాంగ్.. ఉదయభాను మాస్ డ్యాన్స్
సత్యరాజ్, ‘సత్యం’ రాజేశ్, ఉదయభాను (Udaya Bhanu), వశిష్ఠ ఎన్. సింహా, సాంచీ రాయ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik Movie). మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇన్ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఇస్కితడి ఉస్కితడి... చేసేద్దాం దేత్తడి’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. రఘురామ్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ స్పెషల్ సాంగ్‌లో ఉదయ భాను డ్యాన్స్ చేశారు. ‘‘సరికొత్త కథతో మైథలాజికల్ టచ్‌తో రూపొందిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ‘ఇస్కితడి’ పాలో ఉదయ భాను స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’’ అని యూనిట్ పేర్కొంది. రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ పాడటంతో పాటు ఇందులో డ్యాన్స్ కూడా చేశాడు. ఇక ఉదయభాను కూడా ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేసింది. చేతిలో పెద్ద కత్తి పట్టి వీరత్వం ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేసింది. చదవండి: రొమాన్స్ ఇరుక్కు, ట్విస్ట్ ఇరుక్కు.. ఓటీటీలో లవ్ స్టోరీ -
హృదయాలను హత్తుకునేలా ‘‘అనగా అనగా కథలా’ పాట
సత్య రాజ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న భారీ చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. ఈ మూవీకి దర్శకుడు మోహన్ శ్రీవత్స. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్లు అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా మరో ఫీల్ గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.అనగా అనగా కథలా అంటూ సాగే ఈ పాటను టీకేఆర్ కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో బుధవారం నాడు కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ పాటను కార్తిక్ ఆలపించారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ అందించిన హృద్యమైన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక సనరే రాసిన సాహిత్యంతో తాతయ్య అనే ఎమోషన్, మనవరాలితో తాతయ్యకు ఉండే అనుబంధాన్ని చక్కగా వివరించారు.పాటను రిలీజ్ సందర్భంగా సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘టీకేఆర్ కాలేజ్‌లోని విద్యార్థుల ఉత్సాహం, ఎనర్జీ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇలా పద్నాలుగు వేల మంది విద్యార్థుల సమక్షంలో పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా పాటను విడుదల చేసిన తీగల కృష్ణారెడ్డి గారికి.. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన హరనాథ్ రెడ్డి గారికి, అమర్ నాథ్ రెడ్డి గారికి థాంక్స్. త్రిబాణధారి బార్భరిక్ చిత్రంలోని 'అనగా అనగా కథలా' పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ .. ‘నా మొదటి హీరో సత్య రాజ్ గారు అవ్వడం నా అదృష్టం. 170 చిత్రాల్లో హీరోగా చేసిన సత్య రాజ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రంలోని పాటను ఈ కాలేజీలో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. పాటను విడుదల చేసేందుకు సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి థాంక్స్. మా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు. -
‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ హీరోయిన్ సాంచీ రాయ్ (ఫొటోలు)