
అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం బ్యూటీ.. ఈ మూవీకి జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడడంతో బ్యూటీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ మారుతి, నిర్మాత ఎస్కేఎన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్టార్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ .. ‘సుబ్బు మాకు ఎప్పుడూ క్రైమ్ కథలు చెబుతుండేవారు. కానీ ఓ పాయింట్‌ను సుబ్బు చెప్పాడు. ఆ కథ నాకు నచ్చింది. కానీ మా గ్రూపులో మాత్రం ఎవ్వరూ నమ్మలేదు. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఆ ఫాదర్ ఫీలింగ్‌ను పేపర్ మీద పెట్టారని నాకు అనిపించింది. ఈ సినిమా చూసిన తరువాత హీరో హీరోయిన్లు ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతారు. అంకిత్ మంచి యాక్టర్ అని మరోసారి రుజువు అవుతుంది. ప్రతీ తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. అందరూ చూడండి’ అని అన్నారు.
ఎస్‌కేఎన్ మాట్లాడుతూ .. 'బ్యూటీ కథ నా మనసుకి హత్తుకుంది. ప్రొడ్యూసర్స్ అంతా కూడా క్యాస్ట్ గురించి చూస్తారు.. కానీ ఆయన మాత్రం కంటెంట్‌లో టేస్ట్ చూస్తారు. టైటిల్ మాత్రమే కాదు.. కథ కూడా ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంటుంది. పిల్లలు అడిగిందల్లా కొనివ్వలేని పేరెంట్స్ పడే మథనం గురించి అద్భుతంగా చూపించారు. అంకిత్ పర్ఫామెన్స్ నాకు చాలా ఇష్టం. నీలఖి ఒరిస్సా అమ్మాయి అయినా మన తెలుగు లెక్కే. బ్యూటీతో ఆమెకు మంచి బ్రేక్ రావాలి. సెప్టెంబర్ 19న బ్యూటీ చిత్రం రాబోతోంది. 18న పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. అమీర్ పేట్ ఏఏఏలో నేను ఫ్రీ షో వేయిస్తాను. ఓ అమ్మాయి.. తన ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఆ షోని చూడొచ్చు' అని అన్నారు.
హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ .. 'వర్దన్, మారుతి నాకు రెండో అవకాశం ఇచ్చారు. సక్సెస్ లేనప్పుడు కూడా మారుతి లాంటి వారు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుంటారు. నన్ను నమ్మి నాకు ఇంత మంచి సినిమాను ఇచ్చిన మారుతి గారికి థాంక్స్. ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ థియేటర్ విజిట్‌కు వెళ్తే.. ‘తిమ్మరుసు’, ‘ఆయ్’లో చేసింది నువ్వేనా? అని అడిగారు. ‘బ్యూటీ’ చిత్రం ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు. జర్నలిస్ట్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం ఈ కథను రాశారు. ఒక్కసారి వచ్చి సినిమా చూడండి.. నచ్చకపోతే సున్నా రేటింగ్ ఇవ్వండి.. నచ్చితే మాత్రం ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లండి’ అని అన్నారు.