బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. దేశవ్యాప్తంగా నెట్ వసూళ్లపరంగా చూస్తే రూ.364.60 కోట్లు సాధించింది. రెండో ఆదివారం ఇండియాలో ఏకంగా రూ.58.20 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఒక హిందీ చిత్రానికి వచ్చిన రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ మూవీపై ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్‌ను కొనియాడారు.
ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రణ్‌వీర్ సింగ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అదృష్టానికి మంచి అలవాటు ఉంది. సమయానికి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది. కానీ, ఓర్పు చాలా ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. 2025లో అత్యధిక కలెక్షన్స్ వచ్చిన ఇండియన్ చిత్రాల జాబితాలో ధురంధర్ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ మూవీ కంటే ముందు కాంతార: చాప్టర్ 1 ఛావా, సైయారా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని రోజులు ఇదే జోరు కొనసాగితే దురంధర్ స్థానం మరింత మెరుగయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.
దురంధర్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.430.20 కోట్లుగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్‌సీస్‌లో రూ.122.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రెండో వీకెండ్‌లో శుక్రవారం రూ34.70 కోట్లు, శనివారం రూ.53.70 కోట్లు, ఆదివారం రూ.58.20 వసూళ్లతో అరుదైన మైలురాయిని చేరుకుంది. దీంతో బాలీవుడ్ సినీ చరిత్రలో రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దురంధర్ నిలిచింది.
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో సాగే రహస్య గూఢచార కార్యకలాపాల నేపథ్యంలో తెరకెక్కించారు. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించడంతో అరబ్ దేశాల్లో దురంధర్‌పై నిషేధం విధించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు.
The story of The Unknown Men is now known globally.
Book your tickets.
🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Ruling Cinemas Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/zvxEJqbrvv— Jio Studios (@jiostudios) December 15, 2025


