
‘‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్ర కథ మన చుట్టూనే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను నెగెటివ్ రోల్స్‌పోషించాను. కానీ, ఈ సినిమాలో నాపాత్ర సరికొత్తగా ఉంటుంది. సమాజాన్ని ప్రతిబింబించేలా మా చిత్రం, నాపాత్ర ఉంటుంది’’ అని వశిష్ట ఎన్. సింహా తెలిపారు. సత్యరాజ్, ‘సత్యం’ రాజేష్, ఉదయభాను, వశిష్ట ఎన్. సింహా(Vasishta N Simha) కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.
మారుతీ టీమ్ ప్రోడక్ట్ సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వశిష్ట ఎన్. సింహా మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో బార్బరికుడు కనిపించడు.. అతని శక్తిని చూస్తారు. ఈ చిత్రం చూశాక మన జీవితంలోనూ సత్య రాజ్‌గారి లాంటి ఓ తాత ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఉత్తరాది, దక్షిణాది అని కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యే భావోద్వేగాలతో తీశాం.
మా చిత్రం ప్రేక్షకులను ఎక్కడా నిరాశ పరచదు. విజయ్‌పాల్ రెడ్డికి సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ ఉంది. దర్శకుడు మోహన్‌కి మంచి భవిష్యత్తు ఉంటుంది. మా అబ్బాయికి ప్రస్తుతం ఏడు నెలలు. బాబే మా ప్రపంచం (హరిప్రియ–వశిష్ట). షూటింగ్‌కి వెళ్లినప్పుడు తనని చాలా మిస్ అవుతున్నాను’’ అని చెప్పారు.