తాత, మనవరాలి కథ.. ఉచితంగానే సినిమా టికెట్లు | Sathyaraj Movie Tribanadhari Barbarik Free Ticket Details | Sakshi
Sakshi News home page

తాత, మనవరాలి కథ.. ఉచితంగానే సినిమా టికెట్లు

Aug 29 2025 9:15 PM | Updated on Aug 29 2025 9:15 PM

Sathyaraj Movie Tribanadhari Barbarik Free Ticket Details

సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'త్రిబాణధారి బార్బరిక్‌'.. నేడు విడుదలైన ఈ చిత్రం బాగుందని టాక్‌ వస్తుంది. వశిష్ఠ .ఎన్‌ సింహా, ‘సత్యం’ రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్‌ తదితరులు నటించారు. గత కొన్ని రోజులుగా పెయిడ్ ప్రీమియర్లతో జనాల్లోకి వెళ్లిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ మౌత్ టాక్‌ వచ్చేసింది.

(ఇదీ చదవండి: ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ)

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల ఈ మూవీని నిర్మించారు. మోహన్ శ్రీ వత్స ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  ఈ చిత్రంలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎమోషన్స్ ఉన్నా కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతోంది. ఆడపిల్ల ఉండే ప్రతీ ఫ్యామిలీ చూడదగ్గ చిత్రమే ‘త్రిబాణధారి బార్బరిక్’. ఎక్కువగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతుండటంతో మేకర్స్ ఓ ఆఫర్‌ను ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 7) రాబోతోంది. ఈ క్రమంలో ‘త్రిబాణధారి బార్బరిక్’ యూనిట్ గ్రాండ్ పేరెంట్స్‌కి ఉచితంగా ఈ మూవీని ప్రదర్శించే నిర్ణయం తీసుకున్నారు.

ఈ రెండు రోజులు ఉచితం
ఆగస్ట్ 30, ఆగస్ట్ 31న ప్రదర్శించే సాయంత్రం ఆటకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు. ఆగస్ట్ 30, 31నాడు సాయంత్రం మొదటి ఆటకు వెళ్లే ఫ్యామిలీ ఆడియెన్స్‌లోని నలుగురు మెంబర్లలో తాత, అమ్మమ్మ, నానమ్మలకు ఇలా ఇద్దరికి మాత్రం ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఈ సినిమా తాత, మవవరాలికి సంబంధించిన కథ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎక్కువగా కదిలిస్తుండటంతో ఈ ఆఫర్‌ను చిత్రయూనిట్ అందిస్తోంది. ఈ కథ అంతా కూడా తాత, మనవరాలి చుట్టూనే తిరుగుతూ సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement