పూటుగా తాగేసి ఫోన్లు ఎత్తకపోయేవాడిని.. నాకోసం సాయిపల్లవి.. | Music Director Suresh Bobbili about Sai Pallavi | Sakshi
Sakshi News home page

Suresh Bobbili: తాగుడుకు బానిస.. సాయిపల్లవి ఫోన్‌ చేసినా ఎత్తలే.. చివరికి!

Dec 3 2025 12:50 PM | Updated on Dec 3 2025 1:08 PM

Music Director Suresh Bobbili about Sai Pallavi

విరాటపర్వం, రాజు వెడ్స్‌ రాంబాయి వంటి సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోశాడు సురేశ్‌ బొబ్బిలి. లేటెస్ట్‌ హిట్‌ బాయిలోన బల్లిపలికే అనే జానపద పాటకు సైతం ఈయనే మ్యూజిక్‌ అందించాడు. అయితే తన కెరీర్‌ ఇక్కడివరకు రావడానికి హీరోయిన్‌ సాయిపల్లవి కారణం అంటున్నాడు.

బ్యాక్‌గ్రౌండ్‌
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేశ్‌ బొబ్బిలి మాట్లాడుతూ.. మాది గౌరారం గ్రామం, మహబూబాబాద్‌ జిల్లా (ఉమ్మడి ఖమ్మం జిల్లా). అమ్మ పొలం గట్ల దగ్గర పాటలు పాడేది. నాన్న స్టేజీ ఆర్టిస్టు. మా అ‍న్నయ్య నందన్‌ రాజు కూడా మ్యూజిక్‌ డైరెక్టర్‌. అన్న వేరేవాళ్లతో కలిసి పెట్టుకున్న స్టూడియోలో ఆఫీస్‌ బాయ్‌గా చేరాను. అక్కడే కంప్యూటర్‌ ఆపరేట్‌ చేయడం నేర్చుకున్నాను.

కెరీర్‌ మార్చిన మూవీ
ఆరు నెలల్లో అదే స్టూడియోలో ఇంజనీర్‌ అయ్యాను. శ్రీ విష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకే కథ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారాను. అయితే మొదటగా మా అబ్బాయి మూవీ రిలీజైంది. వరుసగా నాలుగు శ్రీ విష్ణు సినిమాలే చేశాను. నా కెరీర్‌ను పూర్తిగా మార్చిన మూవీ విరాటపర్వం. అయితే ఆ మూవీ సమయంలో నాకు తాగుడు అలవాటు ఉండేది. 

ఫోన్లు ఎత్తేవాడిని కాదు
అమ్మానాన్న లేరు. అన్న చెప్పినా చెవికెక్కించుకునేవాడిని కాదు. నా లక్ష్యాన్ని చేరుకోగానే దారి తప్పాను. ప్రేమ- బ్రేకప్‌ వల్ల తాగుడుకు అలవాటుపడ్డా.. దర్శకుడు వేణు ఊడుగుల, సాయిపల్లవి (Sai Pallavi).. ఎవరు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేసేవాడిని కాదు. తాగిన మైకం దిగాక ఎందుకిలా చేస్తున్నానని ఏడ్చేవాడిని. చనిపోదామన్న ఆలోచనలు కూడా వచ్చేవి. రెండేళ్లపాటు నరకం అనుభవించాను.

నన్ను పక్కనపెట్టి..
విరాటపర్వం సినిమా సమయంలో నేను ఫోన్లు ఎత్తకపోయేసరికి వేరేవాళ్లకు మిగతా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేయమని చెప్పారు. అయితే అప్పటికే నేను బీజీఎమ్‌ అంతా రెడీ చేసి పెట్టాను. అది ఓసారి సాయిపల్లవి, రానా విన్నారు. వాళ్లు నేను ఇచ్చే మ్యూజికే కావాలన్నారు. అదే సినిమాను బతికిస్తుంది, వేరేవాళ్లతో చేయొద్దన్నారు.

సాయిపల్లవి ఫోన్‌
అప్పుడు సాయిపల్లవి నాకు ఫోన్‌ చేసి.. మీకేదైనా నేనున్నాను. మీరు ఏకాగ్రత పెట్టి పని చేయండి. ఆరోగ్య సమస్య లేదా వ్యక్తిగత సమస్యలేమైనా ఉంటే నేను చూసుకుంటాను. మీరు వెనక్కి తగ్గొద్దు, చక్కగా మీ పని మీరు చేసుకోండి అని చెప్పారు. అలా నెలరోజులపాటు కూర్చుని సినిమాలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో వాటిని పరిష్కరించేశాను.

మందు జోలికి వెళ్లలే
సినిమా రిలీజయ్యాక ఫస్ట్‌ మీకే మంచి పేరొస్తుంది.. చాలా బాగా సంగీతం అందించారు. మీకు మంచి కెరీర్‌ ఉంది. వేణుగారు కొన్ని విషయాలు చెప్పారు. వాటిని వదిలేయండి.. మీకు మంచి భవిష్యత్తు ఉంది. చిన్నచిన్నవాటిని పట్టించుకోవద్దు అని సాయిపల్లవి సలహా ఇచ్చారు. అలా ఆమె సలహా వల్లే మద్యం మానేశాను. ఇంతవరకు మళ్లీ మందు జోలికి వెళ్లలేదు అని సురేశ్‌ బొబ్బిలి (Suresh Bobbili) చెప్పుకొచ్చాడు.

చదవండి: తనూజపై గెలిచిన సుమన్‌.. టికెట్‌ టు ఫినాలే ఎవరిదో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement