సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. ఒకవేళ వీళ్లకు చెల్లి లేదా తమ్ముడు ఉంటే వాళ్లకు ముందుగా వివాహం చేసేస్తారు. తర్వాత ఎప్పుడో టైమ్ చూసుకుని వీళ్లు కొత్త జీవితం ప్రారంభిస్తారు. గతంలో సాయిపల్లవి ఇలానే తనకంటే ముందు చెల్లి పెళ్లి చేసింది. ఇప్పుడు లిస్టులోకి మరో స్టార్ హీరోయిన్ చేరబోతున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: అత్తారింట్లోకి సామ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్)
మహేశ్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ అయిన కృతి సనన్.. తర్వాత 'దోచేయ్' అనే మరో తెలుగు మూవీ చేసింది. ఈ రెండు ఫ్లాప్ అయ్యేసరికి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. బాగానే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగానే ఉంది. ఈమె చెల్లి నుపుర్ కూడా నటినే. గతంలో ఆల్బమ్ సాంగ్స్‌లో యాక్ట్ చేసింది. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫెయిలైంది. ఈమె యాక్టింగ్ కూడా తేలిపోవడంతో తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ప్రస్తుతానికైతే హిందీలో ఓ చిత్రంలో నటిస్తోంది.
అలాంటిది ఇప్పుడు నుపుర్ పెళ్లి చేసుకోనుందనే న్యూస్ బయటకొచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయపుర్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. సింగర్ స్టెబిన్ బెన్‌తోనే నుపుర్ కొత్త జీవితం ప్రారంభించనుందని టాక్. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయని.. జనవరి 8,9 తేదీల్లో ఈ శుభాకార్యం జరగనుందని సమాచారం. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొద్ది మంది మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. అయితే నుపుర్ లేదా స్టెబిన్ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
(ఇదీ చదవండి: బుకింగ్ ఓపెన్.. ఆ విషయంలో టెన్షన్ పెడుతున్న 'రాజాసాబ్')


