హీరోయిన్ సమంత- దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం (డిసెంబర్ 1న) రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమం వేదికగా నిలిచింది. గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయం గురించి ఎన్నడూ పెదవి విప్పి మాట్లాడలేదు. ఇప్పుడేకంగా పెళ్లి చేసుకుని అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.
ఆనంద భాష్పాలు
ఈ క్రమంలో సమంత.. తన భర్త కుటుంబంతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటోను రాజ్ సోదరి శీతల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది. ప్రదోషకాలంలో శివుడిని పూజిస్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు, ఆనంద భాష్పాలు. నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత-రాజ్ కలిసికట్టుగా ముందుకు సాగడం చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది.
మా ఆశీర్వాదం..
మా కుటుంబం అన్నివేళలా వారికి అండగా, తోడుగా నిలబడుతుంది. మా అందరి ఆశీర్వాదాలు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహమూ లేదు. కొన్ని బంధాలు మన జీవితాల్లోకి ఎంతో ప్రశాంతతను తీసుకొస్తాయి. ఇది కూడా అలాంటిదే! ప్రతి ఒక్కరూ ఇలాంటి స్వచ్ఛమైన, శాంతియుత ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు సమంత (Samantha Ruth Prabhu) స్పందిస్తూ లవ్ యూ అని కామెంట్ చేసింది.
చదవండి: నాతో పనిచేసినోళ్లంతా పెద్ద హీరోలయ్యారు.. నేనే సక్సెస్ లేక..


