
సత్యరాజ్, ‘సత్యం’ రాజేశ్, ఉదయభాను (Udaya Bhanu), వశిష్ఠ ఎన్. సింహా, సాంచీ రాయ్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik Movie). మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఇస్కితడి ఉస్కితడి... చేసేద్దాం దేత్తడి’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. రఘురామ్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు.
ఈ స్పెషల్ సాంగ్‌లో ఉదయ భాను డ్యాన్స్ చేశారు. ‘‘సరికొత్త కథతో మైథలాజికల్ టచ్‌తో రూపొందిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ‘ఇస్కితడి’ పాలో ఉదయ భాను స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’’ అని యూనిట్ పేర్కొంది. రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ పాడటంతో పాటు ఇందులో డ్యాన్స్ కూడా చేశాడు. ఇక ఉదయభాను కూడా ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేసింది. చేతిలో పెద్ద కత్తి పట్టి వీరత్వం ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేసింది.
చదవండి: రొమాన్స్ ఇరుక్కు, ట్విస్ట్ ఇరుక్కు.. ఓటీటీలో లవ్ స్టోరీ
