
తమిళ హీరో విష్ణు విశాల్ నిర్మించిన చిత్రం "ఓహో ఎంతన్ బేబి" (Oho Enthan Baby Movie). రుద్ర, మిథిలా పాల్కర్ జంటగా నటించారు. కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ సినిమా దాదాపు నెల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో ఎప్పుడంటే?
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix).. ఓహో ఎంతన్ బేబీ చిత్రాన్ని ఆగస్టు 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. రొమాన్స్ ఇరుక్కు (ఉంది), ట్విస్ట్ ఇరుక్కు, డ్రామా ఇరుక్కు.. అంతా ఒకే.. హ్యాపీ ఎండింగ్ ఇరుక్కుమా? (ఉంటుందా?) అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది. మరి ఈ లవ్‌స్టోరీ చూడాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే!
Open pannaa… oru love story. Romance irukku, twist irukku, drama irukku. Aana, happy ending irukkuma? 👀 pic.twitter.com/YF8H7YtVaG
— Netflix India South (@Netflix_INSouth) August 3, 2025