రజనీకాంత్‌ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్‌ హీరో | Aamir Khan Touches Rajinikanth Foot in Coolie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ కాళ్లు మొక్కిన బాలీవుడ్‌ హీరో.. వీడియో వైరల్‌

Aug 3 2025 10:55 AM | Updated on Aug 3 2025 1:21 PM

Aamir Khan Touches Rajinikanth Foot in Coolie Trailer Launch Event

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్‌ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌, శాండల్‌వుడ్‌ స్టార్‌ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్‌ షాహిర్‌, సత్యరాజ్‌, హీరోయిన్‌ శృతి హాసన్‌ కీలక పాత్రల్లో నటించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఐటమ్‌ సాంగ్‌లో కనిపించనుంది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

కూలీ సినిమా లుక్‌లో ఆమిర్‌
శనివారం ఈ సినిమా ట్రైలర్‌, ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) కూడా హాజరయ్యాడు. కూలీ సినిమాలో చేతి నిండా పచ్చబొట్టుతో ఎలా కనిపించాడో అదే లుక్‌లో స్టేజీపై దర్శనమిచ్చాడు. భుజంపై జాకెట్‌ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. 

కాళ్లు మొక్కిన హీరో
ఆ తర్వాత రజనీకాంత్‌ కాళ్లకు నమస్కరించాడు. దీంతో తలైవా అతడిని వెంటనే పైకి లేపి మనసారా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆమిర్‌ ఖాన్‌ను మెచ్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనని కామెంట్లు చేస్తున్నారు.

 

చదవండి: 36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement