శివాలయంలో తొక్కిసలాట.. పలువురు మృతి | Two Persons Died After Monkey Pulls Electric Wire UP Barabanki Temple Incident, Watch Shocking Video Inside | Sakshi
Sakshi News home page

శివాలయంలో తొక్కిసలాట.. పలువురు మృతి

Jul 28 2025 8:17 AM | Updated on Jul 28 2025 9:12 AM

monkey pulls electric wire UP Barabanki Temple Incident

బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగిన కారణంగా ఇద్దరు భక్తులు మృతి చెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయంలోని ఓ విద్యుత్ తీగ తెగిపడిన కారణంగానే తొక్కిసలాట జరిగినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.

వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకిలో ఉన్న అవసనేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భక్తులు పూజలు చేసుకుంటున్న సమయంలో కొన్ని కోతులు అక్కడికి వచ్చాయి. ఈ క్రమంలో కోతి.. పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలపై దూకడంతో.. కరెంటు వైర్లు తెగి భక్తులపై పడిపోయాయి. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం, తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 40 మంది భక్తులు గాయపడినట్టు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఒకరిని లోనికాత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్‌పురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్‌గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి.. వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement