థరూర్‌ మౌన వ్రత్‌.. తప్పించారా? తప్పుకున్నారా? | Shashi Tharoor Maun Vrat Renuka Chowdhury Video Viral | Sakshi
Sakshi News home page

థరూర్‌ మౌన వ్రత్‌.. తప్పించారా? తప్పుకున్నారా?

Jul 28 2025 1:38 PM | Updated on Jul 28 2025 2:49 PM

Shashi Tharoor Maun Vrat Renuka Chowdhury Video Viral

పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశంపై ఇవాళ పార్లమెంట్‌ లోక్‌సభలో చర్చ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో పార్లమెంట్‌ ఆవరణలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ సీనియర నేత రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతున్న వేళ.. శశిథరూర్‌ కారు దిగి పార్లమెంట్‌ లోపలికి వడివడిగా అడుగేశారు. ఆ సమయంలో.. 

మీ పార్టీ తరఫున మాట్లాడే అవకాశం మీకు ఇస్తారా? అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి ఆయన ‘మౌన వ్రత్‌.. మౌన వ్రత్‌’ అంటూ ముందుకు వెళ్లారు. అయితే కాస్త ముందుకు వెళ్లగానే ఆయన రేణుకా చౌదరిని గమనించారు. వెనక్కి వచ్చి మీడియాతో మాట్లాడుతున్న ఆమెను ఆప్యాయంగా పలకరించారు. వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ తాలుకా వీడియో వైరల్‌ అవుతోంది. ఆ సమయంలో రేణుకా చౌదరి.. ఆయనకు అన్ని విధాల ఆ అర్హత ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ఇందులో కాంగ్రెస్‌కు 2గంటల సమయమే ఉంది. అయితే కాంగ్రెస్ తరఫున ఈ చర్చలో పాల్గొనబోయే లిస్ట్‌లో థరూర్‌ పేరు లేదు. 

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రపంచానికి వివరించేందుకు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం ఎంపీల బృందాలను వివిధ దేశాలకు విదేశాలకు పంపించింది. అమెరికాకు వెళ్లిన ఎంపీల బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు. అటువంటి శశిథరూర్ పేరు డిబెట్ లో మాట్లాడే వారి జాబితాలో లేకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

2020 నుంచి కాంగ్రెస్‌ అధిష్టానంతో శశిథరూర్‌కు గ్యాప్‌ ఏర్పడింది. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకానొక దశలో ఆయన తిరువనంతపురం నుంచి పోటీ చేయరనే చర్చ సైతం నడిచింది. అయితే ఆయన అక్కడి నుంచే పోటీ చేసి నెగ్గారు కూడా. అయితే.. ఆపరేషన్ సిందూర్ పరిణామాల తర్వాత.. శశిథరూర్‌తో కాంగ్రెస్ ‍గ్యాప్‌ మరింత పెరిగింది. మోదీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ.. పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్న శశిథరూర్ అధిష్టానం అసలు పట్టించుకోవడమే మానేసింది. ఈ తరుణంలో ఇవాళ్టి వరుస పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement