breaking news
Parliament mansoon session
-
చర్చకు నో.. నినాదాలకు ఓ.. లోక్‌సభలో గందరగోళం!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లడంతో లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సభ సజావుగా సాగనివ్వాలని, దేశ ప్రజలు చర్చ జరగాలని కోరుకుంటున్నారని స్పీకర్ ఓం బిర్లా సభ్యులను సముదాయించే ప్రయత్నం చేసినా.. విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు.నీట్ అంశం, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుతో పాటు పలు అంశాలపై విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ మధ్యలోకి రావడంతో పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.VIDEO | Delhi: Lok Sabha session begins amid Opposition protests.(Source: Sansad TV)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/zFYtvhkZs7— Press Trust of India (@PTI_News) August 11, 2026అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు జరిగాయి. విపక్షాల ఆందోళనలకు కౌంటర్‌గా ఎన్డీయే ఎంపీలు మకర్ ద్వార్ వరకు ర్యాలీ నిర్వహించారు. సభను అడ్డుకుంటున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఎన్డీయే నేతలు పేర్కొన్నారు. రాహుల్ గాంధీనే సభ జరగనీయకుండా అడ్డుపడుతున్నారని.. ఆయన చర్చలో పాల్గొనాలంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్డీయే ఎంపీలకు కౌంటర్‌గా మరోవైపు ఇండియా కూటమి ఎంపీలు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్య, నీట్ అంశం, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు కలిసి నీట్ అంశంపై నినాదాలు చేశారు. జార్ఖండ్ పేపర్ లీక్ వ్యవహారానికి రాహుల్ గాంధీ బాధ్యుడు కాదని.. జంతర్ మంతర్ లాఠీ ఛార్జికి మాత్రం అమిత్ షా బాధ్యుడంటూ వాదించారు.సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో సభ సజావుగా సాగాలని ప్రభుత్వం కోరుతుండగా.. తమ డిమాండ్లపై చర్చ జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్లో రాజకీయ వేడి మరింత పెరిగింది. -
పోటాపోటీ నినాదాలు.. పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ.. అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలు, ఇతర అంశాలపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తుండగా.. ప్రతి వ్యూహంలో భాగంగా ఎన్డీయే ఎంపీలు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందనకు దిగారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్లమెంట్ ఆవరణలో అధికార ఎన్డీయే ఎంపీలు భారీ నిరసన చేపట్టారు. మకర్ ద్వార్ వరకు ర్యాలీ నిర్వహించిన ఎంపీలు.. విపక్షాలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. సభను అడ్డుకుంటున్నారంటూ నినాదాలు చేశారు. ఇదే ఆవరణలో.. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ఇన్ని రోజులు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం గమనార్హం.పోటాపోటీ నిరసనలు.. పార్లమెంట్ ఆవరణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. ఎన్డీయే ఎంపీలు విపక్షాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన సమయంలోనే విపక్షాల ఎంపీలు సైతం నిరసనకు దిగారు. ఎన్డీయే ఎంపీలేమో.. సభను అడ్డుకుంటున్నారంటూ నినాదాలు చేశారు. చర్చకు రావాల్సింది పోయి పారిపోతున్నారని ఆరోపిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి వ్యతిరేకంగా కూడా ఎన్డీయే ఎంపీలు నిరసన తెలిపారు. దీనికి కౌంటర్‌గా ఇండియా కూటమి ఎంపీలు నీట్, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ అంశంపై కాంగ్రెస్‌తో కలిసి డీఎంకే ఎంపీలు కూడా నిరసనలో పాల్గొన్నారు. దీంతో పార్లమెంట్ ఆవరణ రాజకీయ నినాదాలతో హోరెత్తింది.చర్చకు సిద్ధం.. ఎందుకు పారిపోతున్నారు?విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్డీయే ఎంపీలు స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే విపక్షాలు చర్చకు రావాల్సింది పోయి.. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభను స్తంభింపజేయడం సరికాదని ఆరోపించారు.#WATCH | Delhi | NDA MPs protest against the Opposition, alleging they are running from discussion. BJP MP Sanjay Jaiswal says, "We are ready for disocussion but Rahul Gandhi is not. He has stalled the Lok Sabha. The Home Minister is ready to answer." pic.twitter.com/hUbmpRetdl— ANI (@ANI) August 11, 2026మోదీ నేతృత్వంలో మంతనాలు.. ఆ తర్వాత ర్యాలీఎన్డీయే ఎంపీల నిరసనకు ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళ్ మిలాన్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ పరిణామాలు, ప్రతిపక్షాల వ్యూహంపై చర్చించిన అనంతరం ఎంపీలు ర్యాలీ చేపట్టారు. విపక్షాల ఆందోళనలకు ప్రతిస్పందనగా అధికార పక్షం ఈసారి “రివర్స్ స్ట్రాటజీ” అమలు చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.Prime Minister @narendramodi waves the Tiranga along with all Ministers and MPs during NDA Parliamentary Party Meeting, Mangal Milan.#MangalMilan pic.twitter.com/PbgWdLaUBf— All India Radio News (@airnewsalerts) August 11, 2026గురువారంతో ముగియనున్న సమావేశాలుప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో చివరి రోజులు సజావుగా సాగాలని కేంద్రం కోరుతోంది. నిన్న ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే నాలుగు బిల్లులకు ఆమోదం లభించింది. మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉండటంతో సభకు ఆటంకాలు కలిగించవద్దని ప్రభుత్వం కోరుతోంది.విపక్షాల డిమాండ్లు ఇవేమరోవైపు విపక్షాలు మాత్రం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే అయోధ్య రామమందిరం విరాళాల హుండీ చోరీ ఆరోపణలపైనా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.పార్లమెంట్లో పోరు.. బయటా నిరసనలుఒకవైపు విపక్షాల ఆందోళనలు.. మరోవైపు ఎన్డీయే ఎంపీల ప్రతిఆందోళనలు.. దీంతో పార్లమెంట్ ఆవరణ రాజకీయ వేడికి వేదికగా మారింది. సమావేశాల చివరి రోజుల్లోనైనా సభ సజావుగా సాగుతుందా? లేదంటే రాజకీయ పోరు కొనసాగుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. -
విపక్షాల ఒత్తిళ్లతో దిగొచ్చిన కేంద్రం!
నీట్ అభ్యర్థుల నిరసనలు, ఢిల్లీలో చోటుచేసుకున్న పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించేందుకు సిద్ధమైంది. ఈ అంశంపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటన చేయనున్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆయనకు స్పీకర్ సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమయ్యాయి. అదే రోజు నీట్ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ క్రమంలో పెలెట్ గన్స్ సైతం ప్రయోగించారనే విమర్శలు వెల్లువెత్తాయి.మొదట రాజీనామా డిమాండ్నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో తొలుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే మంత్రి రాజీనామా తర్వాత కూడా నిరసనలు ఆగలేదు. విద్యార్థులపై పోలీసుల చర్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనజంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ యాక్షన్‌పై హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. “అమిత్ షా ఎక్కడ?” అంటూ పార్లమెంట్ లోపల, బయట నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టాయి. కేంద్రం పరిధిలో ఉన్న ఢిల్లీలో ఆయన ఆదేశాల మేరకే విద్యార్థులపై లాఠీలు ఝులిపించారని రాహుల్ గాంధీ సైతం ఆరోపణలు గుప్పించారు. ఆయన(షా) సభకు రావడానికి భయపడుతున్నారని.. ఈ అంశంపై కేంద్రం మౌనం వీడాలని ప్రతిపక్షాలు పదేపదే డిమాండ్ చేశాయి.ఆగస్టు 13తో ముగియనున్న సమావేశాలువర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై స్పందించేందుకు ముందుకొచ్చింది. విద్యార్థుల నిరసనలు, ఢిల్లీలో పోలీసుల వ్యవహారశైలి, ప్రభుత్వ చర్యలపై అమిత్ షా ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. కారు దిగగానే!
సాక్షి, న్యూఢిల్లీ: యువత నిరసలతో దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు కదా. ఇవాళ ఎంపీ హోదాలో ఆయన పార్లమెంట్ సమావేశాలకు కోసం వచ్చారు. అయితే ఆయన రాక సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నినాదాల పోరు కనిపించింది.సోమవారం ఉదయం పార్లమెంట్‌కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కారు దిగి దిగగానే ఎన్డీయే ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా “ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. ఆయనను హీరోలా స్వాగతిస్తూ.. నెత్తిన టోపీ పెట్టి ఎన్డీయే ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. ఫొటోలు కూడా దిగారు. అదే సమయంలో.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసిన ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం కొద్దిసేపు హోరెత్తింది. అయితే ఎన్డీయే ఎంపీలు అవేం పట్టనట్లు తమ పని తాము చేసుకుంటూ పోయారు. అలా.. ఒకేసారి డబుల్ వెల్కమ్ దక్కింది ఆయనకు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నీట్ వ్యవహారంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 36 రోజుల తర్వాత నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను నైతిక బాధ్యత తీసుకున్న నిర్ణయంగా ఎన్డీయే నేతలు అభివర్ణిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు మాత్రం నీట్ అవకతవకలకు ఆయన రాజీనామా చేయడం సరైందేనని అంటున్నాయి. #WATCH | Delhi: Former Union Education Minister and BJP MP Dharmendra Pradhan arrives at the Parliament. BJP-NDA MPs sloganeer "Dharmendra Pradhan zindabad" as they receive him here. pic.twitter.com/7DHXIzMkvI— ANI (@ANI) July 27, 2026 -
పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం.. రేపటికి వాయిదా
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పరీక్షల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. నిరసనల సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.పార్లమెంట్ సమావేశాలు.. 6వ రోజు అప్డేట్స్రాజ్యసభ రేపటికి వాయిదారాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో మళ్లీ గంగదగోళంరేపటికి వాయిదా వేసిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్లోక్సభ రేపటికి వాయిదాలోక్సభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో గందరగోళం.. రేపటికి వాయిదాకాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని సభా కార్యక్రమాలుయాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరగని చర్చవాయిదాల పర్వంలోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా3 గంటల వరకు వాయిదా పడి మళ్లీ ప్రారంభమైన రాజ్యసభఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళనరాజ్యసభ మళ్లీ సాయంత్రం 5.15 గంటల వరకు వాయిదాఓం బిర్లా కీలక ప్రకటనలోక్సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లువిపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టిన కేంద్రంచర్చ ముందుకు సాగకపోవడంతో వాయిదామధ్యాహ్నం 2గం. తిరిగి ప్రారంభం కానున్న లోక్సభలోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటనబిల్లుపై ఎంపీల సూచనలు కోరిన స్పీకర్.మధ్యాహ్నం 1 గంట వరకు సవరణలకు అవకాశం.చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ.పేపర్ లీక్‌కు భారీ శిక్షలుయాంటీ పేపర్ లీక్ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్‌లో వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదన.జరిమానా రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం.విద్యార్థుల లాఠీఛార్జిపై రగడపోలీసుల చర్యలపై హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని పవన్ ఖేరా డిమాండ్.నిరసనలను అణచివేయడం సరికాదని వ్యాఖ్య.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన కాంగ్రెస్.సమగ్ర కథనం: లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపేపర్ లీక్ బిల్లుకు కేంద్రం ప్రాధాన్యంలోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుస్పందించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుబిల్లు ఆమోదమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటనవిద్యార్థుల భవిష్యత్ రక్షణే ప్రధాన ఉద్దేశమని వెల్లడి.పేపర్ లీక్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం.విపక్షాలు ఇతర అంశాలతో దృష్టి మళ్లించొద్దని సూచన.పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెంచడమే లక్ష్యమని వ్యాఖ్య.లోక్‌సభ సైతం వాయిదామధ్యాహ్నానికి లోక్‌సభ వాయిదావిపక్షాల నిరసనల నడుమే.. యాంటీ పేపర్ లీక్ బిల్లు పెట్టిన కేంద్రంవిపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని చర్చలోక్‌సభ మధ్యాహ్నం 2గం. కు వాయిదారాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదావాయిదా తర్వాత కూడా మారని సీన్పెద్దల సభలో విపక్షాల నిరసన గళంప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాల డిమాండ్మధ్యాహ్నం 2గం. దాకా సభ వాయిదా వేసిన చైర్మన్వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలులోక్సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళనవిపక్షాల నిరసనల నడుమే లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్నీట్ నిరసనలు.. కేంద్రంపై పప్పు యాదవ్ ఫైర్ నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. ప్రభుత్వ చర్యలు తీవ్రంగా తప్పుబట్టిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్న విద్యార్థులను నేరస్తుల్లా చూస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.“మన పిల్లలు ఉగ్రవాదులా? మన కూతురు నేరస్తురాలా? హక్కుల కోసం గొంతెత్తడం తప్పా?” అని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు.బిహార్‌లో దాదాపు 800 మంది విద్యార్థులను జైలుకు పంపించారని ఆరోపించారు.విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరితో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని ఆయన విమర్శించారు.ఖర్గే తీవ్ర వ్యాఖ్యలునీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘటన (rarest of rare) గా అభివర్ణించారు.ఈ అంశంపై రాజ్యసభలో తక్షణ చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఖర్గే కోరారు.రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ప్రకారం ఆ రోజు జాబితాలో ఉన్న ఇతర కార్యక్రమాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చ చేపట్టవచ్చు.భారత చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఖర్గే పేర్కొంటూ.. ఈ అంశంపై వెంటనే చర్చ అవసరమని అన్నారు.ఖర్గే డిమాండ్‌పై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. రూల్ 267 అమలుకు ఆ అంశం నిజంగా “rarest of rare” స్థాయిలో ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనల అంశం మాన్సూన్ సమావేశాల్లో రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసనప్రధాని మోదీపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్విద్యార్థుల్ని అణచివేయడంలో మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేఢిల్లీలో పెల్లెట్లు.. పట్నాలో ఏకే 47 ప్రయోగించారుప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే स्टूडेंट्स पर लाठीचार्ज और पैलेट गन के इस्तेमाल के विरोध में विपक्ष संसद परिसर में विरोध प्रदर्शन कर रहा है#Parliament pic.twitter.com/ihXExAzby2— Poonam Pandey (@pandeypoonam20) July 27, 2026 बिहार के सीवान में छात्र प्रदर्शन के दौरान AK-47 से फायरिंग करने वाले SIT जवान अभिषेक पटेल को सस्पेंड कर दिया गया है!सिवान में छात्र आंदोलन के दौरान पुलिस अधिकारी अभिषेक पटेल ने छात्रों की दिशा में AK-47 असॉल्ट राइफल से फायरिंग की थी! pic.twitter.com/ZjyQa8fGOK— Sadaf Afreen صدف (@s_afreen7) July 27, 2026జంతర్ మంతర్‌లో లాఠీఛార్జిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలుఛలో సంసద్ ర్యాలీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుశాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు: సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం.విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించుకోలేం ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరంశాంతియుత నిరసనలు, పోలీసు చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరం.నిరసనల్లో చొరబడే సామాజిక విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలినిరసనల్లో హింసకు తావులేకుండా నిరసనకారులు 'ఆత్మశిక్షణ' పాటించడం అత్యంత కీలకమన్న సుప్రీంకోర్టు.విద్యార్థుల నిరసనలు, పోలీసుల దాష్టీకంపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా.ఉభయ సభలు వాయిదా!ఆరో రోజు అదే తీరునీట్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలుప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ఉభయ సభలు మధ్యాహ్నం 12గం. దాకా వాయిదాప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలులోక్సభలో విపక్ష ఎంపీల ఆందోళనపబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 నేడే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచనలాఠీ ఛార్జిపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. పోటాపోటీ నినాదాలుపార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నినాదాలుపార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ధర్మేంద్ర ప్రధాన్‌కు హీరో వెల్ కమ్ చెప్పిన ఎన్డీయే ఎంపీలుకేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియా కూటమి ఎంపీలునీట్ లీకేజీ వ్యవహారంలో.. యువత నిరసనతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ఊహించినట్లే.. కాంగ్రెస్ వాయిదా తీర్మానంపార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానంవిద్యార్థులపై లాఠీఛార్జి, పెల్లెట్ గన్స్‌తో దాడిపై చర్చకు నోటీసుజంతర్ మంతర్ ధర్నా సమయంలో విద్యార్థులపై భద్రతా బలగాల బలప్రయోగంచలో సంసద్‌ను అడ్డకునే కమ్రంలో జులై 20న చోటు చేసుకున్న పరిణామాలుతీవ్రంగా ఖండించిన కాంగ్రెస్అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీవిద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటున్న విపక్ష నేతపరీక్షా బిల్లు.. చర్చలో పాల్గొనేది వీళ్లే!నేడు లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై చర్చబిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్బిల్లుపై 8–12 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశంబీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ చర్చ ప్రారంభంబీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగంటీడీపీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలుజేడీయూ నుంచి లల్లన్ సింగ్ సభలో మాట్లాడనున్నారుశివసేన తరఫున డా. శ్రీకాంత్ షిండే ప్రసంగంఅప్నా దల్ (ఎస్) నుంచి అనుప్రియా పటేల్ చర్చలో పాల్గొననున్నారుఎల్జేపీ (రామ్ విలాస్) నుంచి అరుణ్ భారతికి అవకాశంఎన్సీపీ తరఫున సునీల్ తట్కరేతృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్ లేదా మితాలి బాగ్ పాల్గొనే అవకాశంపరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు బిల్లు ప్రధాన లక్ష్యంబిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించే అవకాశంపై ఆసక్తిసభ.. సజావుగా సాగేనా?సీజేపీ ఆందోళన విరమణతో పార్లమెంట్ సమావేశాలపై అందరి దృష్టిగతవారమంతా విపక్షాల నిరసనలతోనే గడిచిన పార్లమెంట్కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సభను అడ్డుకున్న విపక్షాలునీట్ లీకేజీపై చర్చ.. ప్రత్యేక చట్టంకు సిద్ధమని ప్రకటించిన కేంద్రంఅయినా వెనక్కి తగ్గని విపక్షాలు, చివరకు..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శాంతించిన యువతఆందోళన విరమించిన కాక్రోచ్ జనతా పార్టీనేడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకాసేపట్లో ఖర్గే కార్యాలయంలో విపక్షాల సమావేశంయువతపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలుదాడికి బాధ్యత వహించాలని ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు.లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష.నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా.వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా.ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు.కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా నిబంధనలు.ఎన్డీయే వ్యూహం ఏంటి?పేపర్ లీక్‌లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చాటే ప్రయత్నం.యువ ఎంపీలను రంగంలోకి దించి బిల్లుపై బలమైన వాదనలు వినిపించాలనే వ్యూహం.బీజేపీ నుంచి బన్సూరీ స్వరాజ్, తేజస్వీ సూర్య చర్చకు నాయకత్వం వహించే అవకాశం.టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.విపక్షాల వ్యూహం ఏమిటి?బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా.. నీట్ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి.పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావాన్ని లేవనెత్తే అవకాశం.జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ సమయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు.ఘటనలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలి పార్లమెంట్ సమరంనీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.కొత్త మంత్రి తొలిసారి విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.నీట్ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.10 గంటల పాటు చర్చబిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చకు అవకాశం.దాదాపు 8 నుంచి 10 గంటల పాటు చర్చ జరగనున్నట్లు సమాచారం.అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించనున్నారు.36 రోజుల ఉద్యమం తర్వాత..నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగాయి.విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉద్యమం ముగిసింది. -
రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఐదో రోజు అదే సీన్ రిపీట్ అయ్యింది. నీట్‌పై చర్చకు సిద్ధమని కేంద్రం చెబుతున్నా.. ముందు మంత్రి రాజీనామా చేశాకే చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో.. ఓసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభను స్పీకర్ ఓంబిర్లా సోమవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు.. కార్గిల్ అమర వీరులకు నివాళులర్పించిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను సభను ప్రారంభించారు. అయితే ఆ కాసేపటికే విపక్షాల నినాదాలతో సభ మారుమోగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా తర్వాతే నీట్ లీక్ వ్యవహారంపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అయితే ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలకు సిద్ధమైందని.. ఈ తరుణంలో సభ కార్యాకలాపాలకు ఆటంకం సరికాదని కేంద్రం తరఫున ప్రకటన వెలువడింది. ఈ తరుణంలో విపక్షాల శాంతిచకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12గం. దాకా వాయిదా వేశారు. అయితే తిరిగి ప్రారంభమయ్యాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. లోక్‌సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. నీట్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు. విపక్ష నేత కే.సీ. వేణుగోపాల్‌తో మరోసారి చర్చించానని చెప్పారు. ప్రధాని మోదీ కూడా దేశానికి హామీ ఇచ్చారని, సోనమ్ వాంగ్‌చుక్ సైతం నిరాహార దీక్ష విరమించి చర్చ జరపాలని కోరారని రిజిజు పేర్కొన్నారు. నీట్‌పై చర్చకు అవకాశం ఇవ్వకపోతే అది దేశానికి సరైన సంకేతం ఇవ్వదని అన్నారు. అయినా విపక్షాలు శాంతించకపోవడంతో.. స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. Union Minister for Parliamentary Affairs Kiren Rijiju speaks in Lok Sabha. He says, "I have requested KC Venugopal ji once again today, when we are all of the opinion that there should be a discussion on NEET. The PM has assured the nation. Sonam Wangchuk has broken his hunger… pic.twitter.com/1HcLc0a5ep— ANI (@ANI) July 24, 2026ఇక.. రాజ్యసభలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. సభ కాసేపు సాగినట్లే కనిపించినా.. ఆ వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాకు డిమాండ్ చేయడం, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. రాజ్యసభ ముందుకు వందేమాతరం బిల్లుస్వాతంత్ర్య సమర కాలం నుంచి జాతీయ భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ‘వందేమాతరం’ గీతానికి మరింత గుర్తింపు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. వందేమాతర గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.అంతకు ముందు.. పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ఎందుకని?.. ప్రకటన చేయాలనుకుంటే సభలో చేయాలని.. పార్లమెంట్లో మాట్లాడితే తాము సంతోషిస్తామని.. ఆ చర్చలో తాము పాల్గొంటామని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. నీట్ లీకును తీవ్ర నేరంగా చూస్తున్నామని.. నిందితులను వదిలే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. పేపర్‌లీక్‌లపై ఉక్కుపాదం మోపుతామని.. ఇందుకోసం కఠిన చట్టాలు తెస్తామని.. సోమవారం ఆ బిల్లును ప్రవేశపెడతామని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు మాత్రం మంత్రి రాజీనామా తర్వాత ఏదైనా అని పట్టుబడుతున్నాయి. -
పార్లమెంట్‌ను తాకిన ఏపీ మెగా డీఎస్సీ స్కామ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్సీపీ పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేసింది. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెబుతూ.. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చింది.రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం వాయిదా తీర్మాన నోటీసు ఇవ్వగా.. లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఇదే అంశంపై నోటీసు అందించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై ఉభయ సభల్లోనూ తక్షణ చర్చ చేపట్టాలని వారు కోరారు.16 వేల టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు!ఏపీలో సుమారు 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైఎస్సార్సీపీ అంటోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియను ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహించారని, దీనిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. టీచర్ల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.స్పోర్ట్స్ కోటాలో మరీ దారుణంస్పోర్ట్స్ కోటా పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంలో పేర్కొంది. డబ్బులు తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారనే ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు. నిజమైన అర్హులకు అవకాశాలు దక్కలేదని అన్నారు.మెరిట్ జాబితాలపై ప్రశ్నలుగతంలో మాదిరిగా జిల్లా వారీగా మెరిట్ జాబితాలను విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ అంటోంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో కొందరిని కూడా ఎంపిక చేయలేదని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమని, పారదర్శకత కోసం సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.ఏపీలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై రాజకీయంగా దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియామక ప్రక్రియ ఏ దశలోనూ సజావుగా సాగలేదని.. పైగా అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మీడియా సమావేశంలో ఇదివరకే ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. -
నెల రోజులుగా ఎన్నో జరిగాయి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలకు కీలక విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సోమవారం సంసద్ భవన్(పార్లమెంట్) ఆవరణలో మీడియా ద్వారా మాట్లాడిన ఆయన.. ‘‘గత నెల రోజులుగా దేశంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. వాటిపై సభలో చర్చలు జరగాలి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ వేదిక కావాలి’’ అని అన్నారు. ఈ సందర్భంలో తాజా స్కైరూట్ విక్రమ్ ప్రయోగంపై ప్రశంసలు గుప్పించారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థ స్కైరూట్ సాధించిన విజయాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతరిక్షంలో నవశకం మొదలైందని.. స్కైరూట్ సంస్థ విక్రమ్ రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం దేశానికే గర్వకారణమని అన్నారు. ‘‘కేవలం 28 ఏళ్ల యువకులు ఈ ఘనత సాధించారు. ఇది భారత యువశక్తికి, కొత్త ఆలోచనలకు నిదర్శనం’’ అని మోదీ పేర్కొన్నారు.56 ఏళ్ల యువకుడ్ని కాదు!అయితే ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. స్కైరూట్ బృందం సక్సెస్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారాయన. రాహుల్ గాంధీ వయసు 56 ఏళ్లు కావడంతో.. మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతపై పరోక్ష సెటైర్‌గా భావిస్తున్నారు.సభ సజావుగా సాగాలి..పార్లమెంట్ సమావేశాలు రాజకీయ విభేదాలకు మాత్రమే పరిమితం కాకుండా.. దేశ ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎంపీలందరూ సహకరించి నిర్మాణాత్మక చర్చలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, వాదనలు సహజమని.. అయితే సభా సమయం వృథా కాకుండా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం ఏర్పడింది. అన్ని దేశాలు నష్టపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారాయన. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అయినా ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అని అన్నారాయన. ఈ క్రమంలోనే హైడ్రోజన్‌తో నడిచే రైలును పరుగులు పెట్టించినట్లు మోదీ చెప్పారు. ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తివర్షాకాల సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చకు అవకాశం ఉండటంతో.. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రధాని కోరారు.Speaking at the start of the Monsoon Session of Parliament. May this session witness productive discussions that strengthen India's development journey. https://t.co/v25Vg62apy— Narendra Modi (@narendramodi) July 20, 2026 -
ఏపీ లాకప్‌డెత్‌లపై లోక్‌సభలో చర్చకు నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. తొలిరోజే ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసుల వేధింపులు, లాకప్ డెత్‌ల అంశాలను లేవనెత్తేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసును తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇచ్చారు.ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పలు కస్టడీ మరణాలు, పోలీసుల తీరుపై చర్చకు అనుమతించాలని ఆయన నోటీసుల్లో కోరారు. గాదె సాయి కృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతి కుమార్, దరియా హుస్సేన్ వంటి కేసులను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సభ దృష్టికి తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల అంశాలపైనా చర్చకు అవకాశం కల్పించాలని వైఎస్సార్సీపీ తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న కొన్ని లాకప్ డెత్ ఘటనలు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. పోలీసుల వ్యవహారశైలి, కస్టడీలో ఉన్న వ్యక్తుల రక్షణ, న్యాయ ప్రక్రియపై పలు ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించాలని వైఎస్ జగన్ ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిపై పార్లమెంట్లో చర్చ అవసరమని ఎంపీలు భావిస్తున్నారు. ఏపీ శాంతిభద్రతల అంశంపై వైఎస్సార్సీపీ ఇచ్చిన నోటీసును స్పీకర్ అనుమతిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. అదే గనుక జరిగితే.. కూటమి ప్రభుత్వ అరాచకాలపై చర్చతో లోక్‌సభ హీటెక్కే అవకాశాలు ఉన్నాయి. -
థరూర్ మౌన వ్రత్.. తప్పించారా? తప్పుకున్నారా?
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశంపై ఇవాళ పార్లమెంట్ లోక్‌సభలో చర్చ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర నేత రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతున్న వేళ.. శశిథరూర్ కారు దిగి పార్లమెంట్ లోపలికి వడివడిగా అడుగేశారు. ఆ సమయంలో.. మీ పార్టీ తరఫున మాట్లాడే అవకాశం మీకు ఇస్తారా? అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి ఆయన ‘మౌన వ్రత్.. మౌన వ్రత్’ అంటూ ముందుకు వెళ్లారు. అయితే కాస్త ముందుకు వెళ్లగానే ఆయన రేణుకా చౌదరిని గమనించారు. వెనక్కి వచ్చి మీడియాతో మాట్లాడుతున్న ఆమెను ఆప్యాయంగా పలకరించారు. వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ తాలుకా వీడియో వైరల్ అవుతోంది. ఆ సమయంలో రేణుకా చౌదరి.. ఆయనకు అన్ని విధాల ఆ అర్హత ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.#WATCH | Delhi | Lok Sabha to discuss Operation Sindoor today, Congress MP Shashi Tharoor says, "Maunvrat, maunvrat..." pic.twitter.com/YVOwS7jpk5— ANI (@ANI) July 28, 2025Interesting moment in #Parliament:On @NDTV’s question about whether he’ll speak today, @ShashiTharoor walked in silently.@RenukaCCongress, standing nearby, remarked: “He has every right to speak.”Then, interestingly asked him: “Why didn’t you invite me to the mango party?” pic.twitter.com/dkBb590z1W— AISHVARYA JAIN (@aishvaryjain) July 28, 2025ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ఇందులో కాంగ్రెస్‌కు 2గంటల సమయమే ఉంది. అయితే కాంగ్రెస్ తరఫున ఈ చర్చలో పాల్గొనబోయే లిస్ట్‌లో థరూర్ పేరు లేదు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రపంచానికి వివరించేందుకు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం ఎంపీల బృందాలను వివిధ దేశాలకు విదేశాలకు పంపించింది. అమెరికాకు వెళ్లిన ఎంపీల బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు. అటువంటి శశిథరూర్ పేరు డిబెట్ లో మాట్లాడే వారి జాబితాలో లేకపోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.2020 నుంచి కాంగ్రెస్ అధిష్టానంతో శశిథరూర్‌కు గ్యాప్ ఏర్పడింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకానొక దశలో ఆయన తిరువనంతపురం నుంచి పోటీ చేయరనే చర్చ సైతం నడిచింది. అయితే ఆయన అక్కడి నుంచే పోటీ చేసి నెగ్గారు కూడా. అయితే.. ఆపరేషన్ సిందూర్ పరిణామాల తర్వాత.. శశిథరూర్‌తో కాంగ్రెస్ గ్యాప్ మరింత పెరిగింది. మోదీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ.. పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్న శశిథరూర్ అధిష్టానం అసలు పట్టించుకోవడమే మానేసింది. ఈ తరుణంలో ఇవాళ్టి వరుస పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. -
Live: ఆపరేషన్ సిందూర్‌పై చర్చ.. విపక్షాలపై రాజ్‌నాథ్ సెటైర్లు
Parliament Monsoon Session Liveభారత సైనికులు సింహాలు : రాజ్‌నాథ్ సింగ్పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్యఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాంఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారుమతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చపంపారుమన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఉరుకునేది లేదుపాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాంభారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసిందిపాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రశిబిరాలపై దాడులు చేశాం100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాంహిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాంటెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాంపాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసిందిపాక్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాంఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్ పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదుభారత నౌకా దళం కూడా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పిందిపాక్ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదుతమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరిందిమనదాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది.ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. గ్యాప్ ఇచ్చాంఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదుబాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాంప్రతి పక్షాలపై రాజ్‌నాథ్ సెటైర్లుపరీక్ష రాసేటప్పుడు ఎలా రాస్తున్నాం అన్నది మాత్రమే చూడాలి. పెన్సిల్ విరిగిందా,అరిగిందా అన్నది చూడకూడదుపాక్ ఆర్మీ,ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని హతమార్చాంపాక్ న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ లెక్క చేయలేదుఎటుచూసుకున్నా.. పాక్ మనతో సమమానం కాదుప్రతిపకక్షాలు భారత సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదుభారత సైనికులు సింహాలుభారత్ దాడులకు పాక్ తట్టుకోలేకపోయిందిదేశ రక్షణ విషయంలో ఆచితూచి ప్రశ్నలు వేయాలి లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చప్రారంభమైన పార్లమెంట్లోక్సభలో ఆపరేషన్ సిందూర్‌పై మొదలైన చర్చచర్చ ప్రారంభించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ప్రతిపక్షాలు పారిపోతున్నాయ్: పీయూష్ గోయల్ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరగాల్సిన చర్చబీహార్ ఓటర్ల జాబితా అంశంతో ఉభయ సభల్ని అడ్డుకుంటున్న విపక్షాలుమూడుసార్లు వాయిదా పడ్డ సభలువిపక్షాల తీరుపై కేంద్రం ఫైర్ఆపరేషన్ సింధూర్ చర్చ నుంచి పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్భారత సైన్యం సాధించిన విజయాన్ని అగౌరవపరుస్తున్నారంటూ పీయూష్ వ్యాఖ్యమూడోసారి లోక్‌సభ వాయిదాఆపరేషన్ సిందూర్‌కు ముందు లోక్‌సభలో గందరగోళంవిపక్షాల ఆందోళనతో లోక్‌సభ మరోసారి వాయిదామధ్యాహ్నాం 2గం. దాకా వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లాఇవాళ మూడోసారి పడ్డ వాయిదాఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడేది వీళ్లేబీజేపీ తరపున.. రాజ్‌నాథ్ సింగ్బజ్యంత్ పాండాఎస్ జైశంకర్తేజస్వి సూర్యసంజయ్ జైశ్వాల్అనురాగ్ ఠాకూర్కమల్జీత్ షెరావత్కాంగ్రెస్ నుంచిగౌరవ్ గోగోయ్ప్రియాంక గాంధీ వాద్రాదీపేంద్ర హుడాపరిణితీ షిండేసప్తగిరి ఉలాకాబిజేంద్ర ఒలాఇతరులులావు కృష్ణదేవరాయ(టీడీపీ)హరీష్ బాలయోగి(టీడీపీ)రామశంకర్ రాజ్‌భర్(ఎస్పీ)చోటేలాల్(ఎస్పీ)కల్యాణ్ బెనర్జీ(ఏఐటీసీ)సయోని ఘోష్(ఏఐటీసీ)కే ఫ్రాన్సిస్ జార్జ్(కేరళ కాంగ్రెస్)ఏ రాజా(డీఎంకే)కనిమొళి(డీఎంకే)అమూర్‌కాలే(ఎన్సీపీ ఎస్పీ)సుప్రియా సూలే (ఎన్సీపీ ఎస్పీ) ఆపరేషన్ సిందూర్‌పై.. లోక్‌సభలో చర్చ ప్రారంభించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ఆపరేషన్ సిందూర్‌పై.. కాంగ్రెస్‌కు 2గంటల సమయంసాయంత్రం 4.30. గం. ప్రాంతంలో ప్రియాంక వాద్రా గాంధీ ప్రసంగించే ఛాన్స్సాయంత్రం ఏడున్నర గంటలకు మాట్లాడనున్న విదేశాంగ మంత్రి జైరాం రమేష్రాత్రి 10గం. దాకా సాగనున్న ఆపరేషన్ సిందూర్ చర్చలోక్‌సభ మళ్లీ వాయిదాఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ముందు లోక్‌సభలో విపక్షాల ఆందోళనబీహార్ ఓటర్ జాబితా సవరణపై చర్చకు పట్టులోక్ సభ వెల్‌లో విపక్షాల ఆందోళనబీఏసీ మీటింగ్‌లో ప్రతిపక్ష నేతలంతా ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ఒప్పుకున్నారు: స్పీకర్ ఓం బిర్లాఇప్పుడు ఆందోళన ఎందుకు చేస్తున్నారు?: స్పీకర్ ఓం బిర్లాఆందోళన చేస్తే ఆపరేషన్ సిందూర్‌పై చర్చ ఎలా జరుగుతుంది?: స్పీకర్ ఓం బిర్లావాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లాలోకసభ 1గం. వరకు వాయిదాఅటు రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనరాజ్యసభ 2.గం వరకు వాయిదాఆపరేషన్ సిందూర్‌పై చర్చఅధికార, ప్రతిపక్షాలకు స్పీకర్ ఓంబిర్లా విజ్ఞప్తివిపక్షాల తీవ్ర ఆందోళనచర్చ ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్మొత్తం 16 గం. పాటు జరగనున్న చర్చప్రభుత్వం తరఫున మాట్లాడనున్న కేంద్ర మంత్రులుచర్చలో చివరగా ప్రధాని మోదీ మాట్లాడే అవకాశంకాంగ్రెస్ నుంచి చర్చను ప్రారంభించనున్న గౌరవ్ గగోయ్కాంగ్రెస్కు 2 గంటల సమయంప్రారంభమైన లోక్సభమరికాసేపట్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చపార్లమెంట్లో 16 గంటలపాటు కొనసాగనున్న చర్చఇవాళ, రేపు లోక్‌సభలో చర్చ నడిచే అవకాశంరేపు రాజ్యసభలో చర్చ జరిగే చాన్స్లోక్సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్దేశ జాతయ భద్రతకు హాని కలిగించేలా, పహల్గాం బాధితులు నొచ్చుకునేలా మాట్లాడొద్దని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి కిరెన రిజిజు విజ్ఞప్తిపార్లమెంట్ ప్రారంభం.. ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభంవాయిదా తీర్మానాలపై విపక్షాల పట్టుస్పీకర్ చైర్లో ఎంపీ కృష్ణప్రసాద్ తెన్నేటీఉభయ సభల్లో ఆందోళనల నడుమ.. వాయిదా వేసిన స్పీకర్, చైర్మన్12గం. ప్రారంభం కానున్న ఉభయ సభలు మరికాసేపట్లో లోక్‌సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చచర్చను ప్రారంభించనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్దాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకోకపోవడంపై ప్రశ్నించనున్న విపక్షాలుఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిన భారత సైన్యంఆపరేషన్ సిందూర్‌ను మద్యలోనే నిలిపివేయడంపై ప్రతిపక్షాల అభ్యంతరందౌత్యం తన ప్రమేయం ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంపైనా ప్రశ్నించే అవకాశంశశిథరూర్ .. గప్చుప్పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్.. చర్చ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చర్చకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ వర్గాలు ఈ ప్రకటన చేశాయి. ఒకవేళ ఆయన గనుక చర్చలో పాల్గొంటే మాత్రం అది పార్టీ లక్ష్మణరేఖ దాటినట్లే కానుంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. ఐదో రోజు సెషన్ ప్రారంభమైంది. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఉభయ సభలు గత నాలుగు రోజులుగా సజావుగా సాగని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్చతో ఇవాళ సభ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.దేశాన్ని అవమానించొద్దు: రిజిజుఆపరేషన్ సిందూర్‌పై చర్చవేళ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప్రతిపక్షాలకు ఓ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో దేశ హుందాతనం, గౌరవాన్ని కాపాడాలి. విపక్షాలు పాక్ భాష వాడొద్దు. దేశ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దు. సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు అని కోరారు. రావణుడు లక్ష్మణ రేఖ దాటాడు కాబట్టే లంకా దహనం అయ్యింది. పాక్ ఉగ్రవాదులు సరిహద్దు దాటారు కాబట్టే వాళ్ల ఉగ్రవాద శిబిరాలు నాశనం అయ్యాయంటూ రిజిజు ట్వీట్ఉగ్రవాదులు మన దేశం వారేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంఇన్నిరోజులు జాతీయ దర్యాప్తు సంస్థ ఏం చేసిందని ప్రశ్నపాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చారనడానికి ఆధారాల్లేవ్ఇప్పటిదాకా ఉగ్రవాదుల జాడ ఎందుకు తెలుసుకోలేకపోయారని ప్రశ్నచిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరాలుచిదంబరాన్ని వెనకేసుకొస్తున్న కాంగ్రెస్ ఆయన అడిగినదాంట్లో తప్పేంటి? అని బీజేపీకి కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నలోక్సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్‌పై చర్చను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది. విపక్షాల తరఫున ప్రసంగించే నేతల వివరాలపై స్పష్టత లేదు. అయితే కాంగ్రెస్ తరఫున ఎంపీ ప్రియాంక గాంధీ, మరికొందరు ఎంపీలు ప్రసంగిస్తారని సమాచారం. చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. ఏప్రిల్ 25వ తేదీన.. జమ్ము కశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) సంస్థ ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా ఆ ఉగ్రవాదుల భరతం పట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో ఓవైపు.. పాక్‌కు బుద్ధి చెప్పేందుకేనని కేంద్రం చెప్పిన ఆపరేషన్ సిందూర్‌ను అర్దంతరంగా ఆపేయడం పైనా మండిపడ్డాయి. మరోవైపు.. తన వల్లే కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన భారతదేశ విదేశాంగ విధానం వైఫల్యమని మండిపడుతున్నాయి. అయితే ట్రంప్ జోక్యాన్ని ఖండించిన భారత ప్రభుత్వం.. పహల్గాం దాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, ఆ ఆపరేషన్ విజయవంతంపైనా పార్లమెంట్లో చర్చిస్తామని చెబుతోంది. అటు రేపు రాజ్యసభలో ఆపరేషన్ సిందూరపై చర్చ జరగనుంది. -
జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 21వ తేదీ నుంచి ఆగష్టు 12వ తేదీ దాకా సెషన్ ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు బుధవారం ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్న వేళ.. వర్షాకాల సమావేశాల తేదీలను కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది పార్లమెంట్ తొలి సమావేశం.. జనవరి 31వ తేదీన బడ్జెట్ సెషన్‌తో ప్రారంభమైంది. కాస్త విరామంతో రెండు దఫాలుగా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఏప్రిల్ 4వ తేదీన లోక్‌సభ, రాజ్యసభల నిరవధిక వాయిదాతో ఈ ఏడాది పార్లమెంట్‌కు తొలి సమావేశాలు(బడ్జెట్) జరిగాయి. -
పార్లమెంట్లో వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై పార్లమెంట్లో యథావిధిగా రగడ కొనసాగింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో శుక్రవారం ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డు తగిలారు. రాజస్తాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో అధికార బీజేపీ సభ్యులు నినదించారు. గందరగోళం కారణంగా లోక్‌సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. చివరకు రెండు సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో పట్టువీడని విపక్షాలు లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ జోక్యం చేసుకున్నారు. ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టాల్సి ఉందని, సభ్యులంతా సహకరించాలని కోరారు. సభా కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. నినాదాలు కొనసాగించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య దాదాపు 20 నిమిషాలపాటు సభ జరిగింది. అనంతరం సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమయ్యాక కూడా విపక్షాలు శాంతించలేదు. దాంతో చేసేదిలేక సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. సైనిక దళాలను మరింత బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ‘ఇంటర్–సరీ్వసెస్ ఆర్గనైజేషన్స్(కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్) బిల్లు’ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. స్వల్ప చర్చ అనంతరం సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అలాగే ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(అమెండ్మెంట్) బిల్లు–2023’ కూడా ఆమోదించారు. జ్యసభలో అధికార బీజేపీ ఆందోళన రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య వ్యవహారాన్ని రాజ్యసభలో అధికార బీజేపీ సభ్యులు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాజస్తాన్‌లో శాంతి భద్రతలు నానాటికీ దిగజారుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. బీజేపీ సభ్యులు ఆయనకు మద్దతు పలికారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ‘మణిపూర్, మణిపూర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రతిష్టంభనకు తెరపడలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. -
నినాదాల్లేవ్.. ‘మణిపూర్’పై వ్యూహాత్మక నిరసన
ఢిల్లీ: మణిపూర్ అంశంతో పార్లమెంట్‌ను కుదిపేస్తున్న విపక్ష కూటమి ఇండియా.. ఇక నినాదాలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగని తమ నిరసనలను మాత్రం ఆపదట. ఇందుకోసం వ్యూహాత్మక ధోరణిని ప్రదర్శించాలని నిర్ణయించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహా ఎన్డీయేకి సంబంధించిన కొందరు ఎంపీలు మాత్రమే ప్రసంగించే సమయంలో నినాదాలు చేయకూడదని ఎన్డీయే కూటమి సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం జరిగిన ఫ్లోర్ స్ట్రాటజీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మిగతా వాళ్ల విషయంలో మాత్రం తమ నిరసనలు కొనసాగిస్తారట. మణిపూర్‌లో శాంతి భద్రతలు చెల్లాచెదురై అక్కడ అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి.. ఆ అంశంపై మాట్లాడాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కేంద్రం అందుకు సుముఖంగా లేకపోవడంతో అవిశ్వాసం ద్వారా చర్చ వైపుగా అడుగులు వేస్తున్నాయి. నల్ల నిరసన ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. స్పీకర్ అనుమతి సైతం పొందింది విపక్ష కూటమి. చర్చకు ఇంకా తేదీ ఖరారు కావాల్సి ఉంది. ఈలోపు కూడా మణిపూర్ రగడ కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మణిపూర్ అంశంపై కేంద్రం మెడలు వంచే ప్రయత్నం చేస్తున్న విపక్ష కూటమి ఇండియా.. ఇవాళ సమావేశాలకు నల్ల దుస్తులతో నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. ఫ్లోర్ ఆఫ్ ది హౌజ్ మీటింగ్‌కు పలువురు సభ్యులు నల్లటి దుస్తుల్లో హజరు అయ్యారు కూడా. #WATCH | Leaders of the INDIA alliance meet at the LoP Chamber in Parliament to chalk out the strategy for the Floor of the House.#MonsoonSession pic.twitter.com/quLfU4TMT8 — ANI (@ANI) July 27, 2023 #WATCH | Congress MP Gaurav Gogoi says, "PM is rubbing salt to the wounds of the people of Manipur. At a time when we are saying that he should go to Manipur and work in the interest of national security, he is giving speeches here. For the first time in India's history, we have… pic.twitter.com/0B9k5PNecz — ANI (@ANI) July 27, 2023 -
విపక్షాలు ఆందోళనలతో దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్‌సభ వాయిదా
లోక్‌సభలో ఎన్డీయేపై అవిశ్వాసం.. Live Updates లోక్‌సభ వాయిదా మణిపుర్ అంశంపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. మణిపుర్‌పై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన నడుమ లోక్‌సభను బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ► “ప్రధానమంత్రి పార్లమెంటును గౌరవించాలి. ఇది రాష్ట్రపతి పాలన కాదు, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’’..లోక్‌సభ స్పీకర్ ఆమోదించిన అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ► ఢిల్లీ పాలనాధికారాల బిల్లుపై కాంగ్రెస్, బీఆర్ఎస్లు విప్ జారీ చేశాయి. లోక్‌సభ ఎంపీలంతా సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ. ఢిల్లీ పాలనాధికారాల బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలంటూ విప్లో పేర్కొంది. ► మణిపూర్ అంశంపై పార్లమెంట్లో నెలకొంటున్న గందరగోళంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘‘ప్రధాని మోదీని వచ్చి మాట్లాడమని మేం కోరుతున్నాం.ఆయన మౌనం ఆయన ప్రతిష్టకే భంగం కలిగిస్తుంది. దేశ ప్రజలకు మేం కట్టుబడి ఉన్నాం, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాం. అంటూ లేఖలో పేర్కొన్నారయన. LoP in Rajya Sabha Mallikarjun Kharge writes to Union Home Minister Amit Shah over the logjam in the Parliament over Manipur issue. "We have been urging the Prime Minister to come and speak in the Parliament but it seems that will hurt his prestige. We are committed to the… pic.twitter.com/OtAr41TqK8 — ANI (@ANI) July 26, 2023 ► ప్రధాని మోదీ గైర్జాహజరు విపక్ష సభ్యులు నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొనగా.. లోక్‌సభ మధ్యాహ్నాం 2గం. వరకు వాయిదా పడింది. Lok Sabha adjourned till 2 pm amid sloganeering by the Opposition MPs who are demanding the PM's presence in the House for discussion on Manipur. pic.twitter.com/vSJTsQRR9a — ANI (@ANI) July 26, 2023 ► ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ గోగోయ్ ప్రవేశపెట్టిన తీర్మానంపై.. సోనియా గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలు తమ తమ స్థానాల్లో నిలబడి మద్దతు ప్రకటించారు. అయితే అఖిలపక్షంతో భేటీ తర్వాత అవిశ్వాసంపై తేదీ ప్రకటిస్తానని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ► తిరిగి ప్రారంభమైన లోక్‌సభ ► బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానంపై ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంతో మాకు సంబంధం లేదు. మేము విడిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మా అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన ప్రతిపక్షం. ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తి లేదు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలి. ఆయన అసలు ఎందుకు మాట్లాడడం లేదు? అని ఎంపీ రంజిత్ రెడ్డి నిలదీశారు. ► BRS ఎంపీల అవిశ్వాస తీర్మానంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. Rajya Sabha adjourned till 12 noon amid sloganeering by MPs in the House, who are demanding discussion on Manipur. pic.twitter.com/7KYA1vVmpx — ANI (@ANI) July 26, 2023 రాజ్యసభలో మైక్ లొల్లి ► రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మైక్‌ను ఆపేశారంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. మైక్ ఆపేయడం వల్ల తన ఆత్మగౌరవం దెబ్బతిందని వాదించారాయన. అయితే తాను మైక్ ఆపేయలేదని చైర్మన్ ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. అయినా ఆ వివరణతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందకుండా.. నిరసన కొనసాగిస్తున్నారు. ► విపక్ష సభ్యుల నినాదాలతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. ► రాజ్యసభలోనూ విపక్షాల మొండిపట్టు. మణిపూర్‌పై చర్చ జరగాలని డిమాండ్. ► మణిపూర్ పరిస్థితులపై ప్రధాని మోదీ స్పందించాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ► పార్లమెంట్వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. బుధవారం ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్ ఘటనపై చర్చించాలని విపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. ► లోక్‌సభలో ఎన్డీయే కూటమి బలం 330, ఇండియా కూటమి బలం 141, ఏ కూటమిలో లేని మరో 64 మంది ఎంపీలు. ఆరు ఎంపీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. అవిశ్వాస తీర్మానంపై 50 మంది ఎంపీలు సంతకం చేశారు. వీగిపోతుందని తెలిసి కూడా.. అవిశ్వాసంతో మణిపూర్ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా విపక్ష కూటమి ప్రయత్నిస్తోంది. ► అందుకే అవిశ్వాసం మా పార్టీ తరపున అవిశ్వాస తీర్మానం పెట్టాం. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష నేతలంతా మణిపూర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రధాని మాట్లాడితే శాంతి నెలకొంటుంది.అందుకే మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. :::బీఆర్ఎస్ ఎంపీ నామా #WATCH | BRS MP Nama Nageswara Rao says, "We have moved the No Confidence Motion on behalf of our party. Since the commencement of the session all Opposition leaders had been demanding discussion on Manipur issue. If the PM speaks on this, there will be peace among people of the… https://t.co/wHC997gWVm pic.twitter.com/Jb9NWfEKPR — ANI (@ANI) July 26, 2023 ► ప్రజలే బుద్ధి చెప్పారు దేశ ప్రజలకు ప్రధాని మోదీ, బీజేపీపై విశ్వాసం ఉంది. గత టర్మ్‌లోనూ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారు. ఈ దేశ ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు. :::పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి #WATCH | Parliamentary Affairs Minister Pralhad Joshi says, "People have confidence in PM Modi and BJP. They brought a No Confidence Motion in the last term as well. People of this country taught them a lesson." pic.twitter.com/GCemoT5gLT — ANI (@ANI) July 26, 2023 ► లోక్ సభలో వేరుగా.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. అలాగే.. తన పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది బీఆర్ఎస్. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎంపీలకు విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. BRS MP Nama Nageswara Rao has also filed the No Confidence Motion against the Government. pic.twitter.com/TAdLp1fD2Q — ANI (@ANI) July 26, 2023 ► మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ► డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ శుక్లా, రంజీత్ రంజన్, ఆప్ ఎంపీ రాఘ చద్దా రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ నోటీసును సస్పెండ్ చేస్తూ మణిపూర్ పరిస్థితిపై చర్చకు డిమాండ్ చేశారు. ► కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అంతా రంగం సిద్ధమైంది. యాభై మంది ఎంపీలు సంతకాలు చేశారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. Congress MP Gaurav Gogoi files the No Confidence Motion against the Government in Lok Sabha. pic.twitter.com/osx0ljhrPZ — ANI (@ANI) July 26, 2023 ► మణిపూర్ అంశంపై విపక్ష కూటమి ప్రభుత్వంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని చర్చకు రావాలన్న డిమాండ్‌కు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. పైగా దీర్ఘకాలిక చర్చకూ సిద్దంగా లేదు. ఈ తరుణంలో అవిశ్వాస తీర్మానానికి విపక్ష కూటమి సిద్ధమైంది. ► బుధవారం ఉదయం విపక్ష కూటమి INDIA నేతలు సమావేశం కాగా.. 50 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం కోసం సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్‌చౌదరి సైతం ధృవీకరించారు. ► అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినా.. ఒకవేళ స్పీకర్ గనుక ఓటింగ్-చర్చకు అనుమతించడం ద్వారా మణిపూర్ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం దొరుకుతుందని, తద్వారా బీజేపీని నిలదీయొచ్చని విపక్ష కూటమి ఇండియా భావిస్తోంది. -
Manipur: ప్రధాని కాదు.. ఆయనే మాట్లాడతారట!
న్యూఢిల్లీ: మణిపూర్ అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని ప్రకటించినా.. విపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయని కేంద్రం అంటోంది. గురివింద గింజ సామెతలాగా.. తమ రాష్ట్రాల్లో నేరాలను ఆయా ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతున్నాయని విపక్షాలపై మండిపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం సమావేశాలైనా సజావుగా జరుగుతాయా? అనే సందిగ్ధం నెలకొనగా.. అనూహ్యంగా క్విడ్ ప్రోకో(రెండు వైపులా లాభం) తెర మీదకు వచ్చింది. ‘‘మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీనే పార్లమెంట్లో మాట్లాడాలి. ఇది తేలనిదే పార్లమెంట్ సమావేశాలను ముందుకు సాగనివ్వం’’ విపక్ష ఇండియా కూటమి చేస్తున్న ప్రధాన డిమాండ్ ఇది. ఈ డిమాండ్‌తోనే గత రాత్రి సైతం పార్లమెంట్ బయట తమ నిరసన గళం వినిపించాయవి. అయితే కేంద్రం మాత్రం అందుకు సన్నద్ధంగా లేదు. పైగా ఈ సమావేశాల్లో 31 బిల్లులకు ఈ సమావేశాల్లో ఆమోదం తెలపాల్సిన అవసరం ఉండగా.. అందునా వివాదాస్పదమైన ఢిల్లీ ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా ఉంది. దీంతో మణిపూర్ గండం దాటుకోవడం ఎలాగ? అనే విషయంలో కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. శాంతి భద్రతల అంశం కాబట్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షానే మణిపూర్ అల్లర్లు.. హింసపై ప్రసంగం చేస్తారని.. అనుమానాలను నివృత్తి చేస్తారని చెబుతోంది. ఈ క్రమంలోనే క్విడ్ ప్రోకో ఆలోచనతో ముందుకు వచ్చింది. మణిపూర్ అంశంపై స్వల్ప కాలిక చర్చతో సరిపెడతామని.. ప్రతివిమర్శలు చేయబోమని విపక్షాలకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర వర్గాల సమాచారం ప్రకారం.. సమావేశాలకు సజావుగా సాగనిచ్చేందుకు, సామరస్యంగా మణిపూర్ చర్చ అంశాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్ష నేతలతో ఫోన్లలో మాట్లాడారు. సభను సజావుగా సాగనిచ్చేందుకు సహకరించాలని కోరారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే హోం మంత్రి నివృత్తి చేస్తారని.. చర్చించేందుకు అనుమతించాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీతో కొందరు కేంద్ర మంత్రులు.. హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీలు జరిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఇంతకు ముందెప్పుడూ ఇంత సుదీర్ఘకాలం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదని మణిపూర్ సంక్షోభంపై ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం మరోలా ప్రకటన చేసింది. ‘‘1993-97 మధ్యకాలంలో మణిపూర్ ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులను చవిచూసింది. ఆ సమయంలో ఏ ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. అలాగే పార్లమెంట్లో ఒక్కసారిగా కూడా చర్చించలేదు’’ అని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మణిపూర్‌పై పరిమిత చర్చ మాత్రమే జరిపి.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేరాలపై ఎలాంటి ప్రస్తావన చేయొద్దని కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. తద్వారా బిల్లుల ఆమోద ప్రయత్నాలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రతిపక్షాలు కేంద్రం ప్రతిపాదనకు ఎలా స్పందించాయనేది తెలియాల్సి ఉంది. ప్రత్యేకించి ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు విషయంలో సహకరిస్తాయా? అనేది అనుమానమే!. ఇదీ చదవండి: రూల్ నెంబర్ 267 వర్సెస్ 176 -
నేడు ఆల్‌పార్టీ మీటింగ్
సాక్షి, ఢిల్లీ: రేపటి నుంచి(జులై 20 నుంచి..) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాన్ను నేపథ్యంలో.. అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ అన్ని పార్టీల ప్రతినిధులతో కేంద్రం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు ముందు కేబినెట్ సీనియర్ మంత్రులు.. సభావ్యవహారాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరడం ఆనవాయితీ. చాలాసార్లు ఈ భేటీకి ప్రధాని సైతం హాజరవుతుంటారు. ఈ క్రమంలో ఇవాళ జరిగే సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే.. ఇదే తరహాలో మంగళవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్(ఉపరాష్ట్రపతి) మంగళవారం భేటీ నిర్వహిచంగా.. చాలా పార్టీలు గైర్హాజరు అయ్యాయి. హస్తినలో అధికార ఎన్డీయే కూటమి బలప్రదర్శన, మరోవైపు బెంగళూరులో విపక్ష కూటమి భేటీ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈసారి వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగొచ్చు. ‘జాతీయ ప్రజాతంత్ర కూటమి’ (ఎన్డీయే) కూటమి వర్సెస్ విపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్(ఐఎన్డీఐఏ) మధ్య పరిణామాలు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై కేబినెట్ సహచరులు ప్రహ్లాద్ జోషి(పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి), పీయూష్ గోయల్(రాజ్యసభ నేత)లతో చర్చించారు. ఆపై ఎన్డీయే మిత్రపక్షాలతోనూ బీజేపీ నేతలు ఇవాళ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
యూసీసీ బిల్లు.. కేంద్రం వడివడి అడుగులు
ఢిల్లీ: ఒకే దేశం.. ఒకే చట్టం నినాదంతో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) బిల్లును వీలైనంత త్వరగా చట్ట రూపంలోకి తేవాలని తేవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు యూసీసీ(Uniform Civil Code) బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు స్పష్టమవుతోంది. జులై 17వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే అభిప్రాయసేకరణలో భాగంగా లా కమిషన్ ఒక నోటీసు జారీ చేసింది. మరోవైపు ఈ బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేసి.. అభిప్రాయసేకరణ ద్వారా వీలైనంత త్వరగా బిల్లు ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ► బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అధ్యక్షతన 31 సభ్యులతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యేందుకు సిద్ధమైంది. అఖిలపక్ష అభిప్రాయం కోసం జులై 3వ తేదీన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల UCC గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ► ఉమ్మడి పౌర స్మృతి అంశంపై భోపాల్‌లో తాజాగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూనే.. ఇంతా నెలరోజుల గడువులోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. యూసీసీ బిల్లు కోసం కేంద్రం వేగం పెంచింది. మరోవైపు జూన్ 14వ తేదీనే లా కమిషన్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మత సంస్థల అభిప్రాయ సేకరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తద్వారా సమగ్ర పద్ధతిలో తాము ముందుకెళ్తున్నట్లు కమిషన్ దేశానికి చాటి చెబుతోంది. అదే సమయంలో.. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటుకు సమర్పించి, అనంతరం దానిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించే అవకాశం ఉందని, వివిధ వర్గాల వాదనలను ఆ కమిటీ స్వీకరిస్తుందని తెలుస్తోంది. ► బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో యూసీసీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రాజ్యాంగంలోని అధికరణ 44 కూడా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని చెప్తోంది. అయితే.. ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలుపగా, కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింసాకాండ వంటి సమస్యలు ఉన్నాయని, అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ యూసీసీ అంశాన్ని లేవనెత్తుతున్నారని దుయ్యబడుతున్నాయి. ఒకే రకమైన చట్టం ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి.. దేశం మొత్తం పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. మత చట్టాలు పక్కనపడిపోతాయి. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు అమలవుతున్నాయి. అయితే యూసీసీపై పలు అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం.. ఆ కేసుతోనే మలుపు! -
కాస్ట్లీ హ్యాండ్‌బ్యాగ్ ట్రోలింగ్‌పై స్పందించిన ఎంపీ
న్యూఢిల్లీ: ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల అంశంపై ఉభయ సభలు అట్టుడుకిపోతున్నాయి. విపక్షాలు ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సోమవారం లోక్‌సభలో విపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కకోలి ఘోష్ దస్తిదార్ ధరల పెరుగుదల అంశంపై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో.. ఆమె పక్కనే ఉన్న మరో ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ను టేబుల్ కింద దాచేశారు. అంతే.. అధిక ధరల గురించి మాట్లాడుతున్నందునే ఆమె తన కాస్ట్లీ బ్యాగ్‌ను కనిపించకుండా పక్కన పెట్టారంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ బ్యాగు లూయిస్ వియుట్టన్ కంపెనీ బ్రాండ్. ధర రెండు లక్షల రూపాయల దాకా ఉంటుంది. దీంతో రాజకీయంగానూ ఈ సీన్‌పై విమర్శలు మొదలయ్యాయి. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ సభ్యులు.. ఇలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు, మద్దతుదారులు వ్యంగ్యం ప్రదర్శించారు. ఆఖరికి మీమ్స్గానూ ఆమె వీడియో ట్రెండ్ అయ్యింది. ఈ తరుణంలో సోషల్ మీడియా సెటైర్లు, రాజకీయ విమర్శలపై ఆమె సింపుల్‌గా స్పందించారు. Jholewala fakir in Parliament since 2019. Jhola leke aye the… jhola leke chal padenge… pic.twitter.com/2YOWst8j98 — Mahua Moitra (@MahuaMoitra) August 2, 2022 జోలేవాలా ఫకీర్‌ను 2019 నుంచి పార్లమెంట్లో ఉన్నా. బ్యాగుతో వచ్చాం.. బ్యాగుతోనే వెళ్తాం అంటూ ట్వీట్ చేశారామె. అయితే ఆమె ట్వీట్లో లోతైన అర్థం దాగుండడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2016 యూపీ మోరాదాబాద్ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను ఓ ఫకీర్‌గా అభివర్ణించుకున్నారు. రాజకీయాల నుంచి ప్రత్యర్థులు తనను దూరం చేయాలని ప్రయత్నిస్తే.. సాదాసీదా వ్యక్తినైన తాను ఫకీర్లాగా జోలె పట్టుకుని ముందుకు వెళ్తానని.. అంతేగానీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తాను ఆపబోనని భావోద్వేగంగా ప్రసంగించారు ఆయన. Marie Antoinette Mahau Moitra hiding her expensive bag during a discussion on price rise- hypocrisy has a face & its this! A party that believes in TMC- Too Much Corruption discusses price rise after not cutting VAT & alliance with UPA that gave run away inflation of 10% plus pic.twitter.com/VByJsk4tBV — Shehzad Jai Hind (@Shehzad_Ind) August 1, 2022 -
Parliament Monsoon Session: ఉభయ సభలు మంగళవారానికి వాయిదా
Parliament Monsoon Session 2022 LIVE అప్డేట్స్ ► పార్లమెంటు ఉభయసభలు మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు ఆందోళనలు కొనసాగించడం వల్ల సభను రేపటికి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ 2 గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ► విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభను రేపటికి(మంగళవారం) వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయద్ అల్ నహన్ మృతి నేపథ్యంలో భారత పార్లమెంట్ నివాళి అర్పించింది. Rajya Sabha observes silence as a mark of respect to the memory of the departed. Chairman Naidu made obituary reference to former Japanese PM Shinzo Abe, ex-UAE President Sheikh Khalifa Bin Zayed Al Nahyan, legendary Hindustani classical musician Pandit Shivkumar Sharma & others pic.twitter.com/GlWBNIVPhc — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతున్నందునా.. మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. Monsoon session of Parliament | Lok Sabha adjourned till 2pm for voting in Presidential election in Parliament premises pic.twitter.com/knnvVEhl22 — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 32 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే తెలంగాణ గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు ప్రస్తావనకు రానుంది. ► కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ కార్యక్రమం జరిగింది. Delhi | Newly elected MPs take oath as Rajya Sabha members as the Monsoon session of Parliament begins pic.twitter.com/tFLspbBm7b — ANI (@ANI) July 18, 2022 BJP MP from Azamgarh (Uttar Pradesh) Dinesh Lal "Nirahua" Yadav, TMC MP from Asansol (West Bengal) Shatrughan Sinha, and BJP MP from Rampur (Uttar Pradesh) Ghanshyam Singh Lodhi take oath as Members of the Lok Sabha.#MonsoonSession pic.twitter.com/AKVAXg2qRQ — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2022 ప్రారంభం అయ్యాయి. ఆగష్టు 12వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. #MonsoonSession of the Parliament commences; visuals from Lok Sabha. pic.twitter.com/UYj92rMHzW — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ సమావేశాలు: ఓపెన్ మైండ్‌తో చర్చించాలి ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం. ఆగస్ట్ 15 & రాబోయే 25 సంవత్సరాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది - దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించుకోబోయే సమయానికి, మన ప్రయాణాన్ని, కొత్త ఎత్తులను నిర్ణయించడానికి ఒక తీర్మానం చేయాల్సిన సమయం ఇది. పార్లమెంట్లో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరగాలి, అవసరమైతే చర్చ జరగాలి. ఎంపీలందరూ లోతుగా ఆలోచించి చర్చించాలని నేను కోరుతున్నాను. ప్రస్తుతం రాష్ట్రపతి & ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నందున ఈ సెషన్ కూడా ముఖ్యమైనది. ఈరోజు (రాష్ట్రపతి ఎన్నికలకు) ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో, కొత్త రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభిస్తారు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు ►రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అగ్నిపథ్ పథకంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రూల్ 297 కింద వాయిదా తీర్మానాలు ఇచ్చిన కాంగ్రెస్, సీపీఎం ఎంపీలు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం(ఇవాళ్టి) నుంచి ప్రారంభం కానున్నాయి. ► సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విపక్ష నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్లో తప్పనిసరిగా చర్చించాలంటున్నారు. 14 రోజుల్లో 32 బిల్లులా? అన్ని పార్టీల సమావేశంలో 13 అంశాలను లేవనెత్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే చెప్పారు. వీటిపై ఉభయ సభల్లో చర్చించాలని అఖిలపక్ష భేటీలో కోరామన్నారు. వర్షకాల సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోందని, కేవలం 14 రోజుల్లో వాటిపై చర్చించి, ఆమోదించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. అఖిలపక్ష భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కాకపోవడం పట్ల కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్విట్టర్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో 32 బిల్లులూ పెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వీటిపై ఇప్పటికే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు చర్చించాయన్నారు. సభల్లో ప్రజాస్వామ్య యుతంగా వీటిపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి అన్‌పార్లమెంటరీ పదాల జాబితాపై వివాదం అవసరం లేదని బిజూ జనతాదళ్ సీనియర్ నేత పినాకీ మిశ్రా చెప్పారు. శీతాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలన్నారు. ఒడిశాకు శాసన మండలిని ప్రకటించాలని విన్నవించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ఇదే సరైన సమయమని ఏఐఏడీఎంకే నాయకుడు ఎం.తంబిదురై పేర్కొన్నారు. శ్రీలంకలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ చొరవ తీసుకోవాలని తంబిదురైతోపాటు డీఎంకే నేత టీఆర్ బాలు కోరారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధం అఖిలపక్ష సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నిబంధనలు, ప్రక్రియ ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయానికి అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నాయని తప్పుపట్టారు. శ్రీలంక సంక్షోభంపై చర్చించడానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. -
పెగసస్‌పై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: పెగసెస్ స్పైవేర్ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పెగసస్ స్పైవేర్ నిఘా నివేదికలపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని విపక్షాలు పట్టు బట్టాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి విపక్షాలు పెగసస్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం విపక్షాల డిమాండ్లపై కేంద్రం స్పందించింది. పెగసస్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. పెగాసస్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ విక్రేత అయిన ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓతో ఎలాంటి లావాదేవీలు చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్టర్ వి శివదాసన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సోమవారం రాజ్యసభలో రక్షణ మంత్రిత్వ శాఖ సమాధానంలో భాగంగా ఈ ప్రకటన చేసింది. ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో ప్రభుత్వం ఏవైనా లావాదేవీలు జరిపిందా లేదా అన్న ప్రశ్నకు రక్షణ మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. "ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో ఎలాంటి లావాదేవీలు జరపలేదు" అని జూనియర్ రక్షణ మంత్రి అజయ్ భట్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పెగసస్‌తో తాము ఎవరిపైనా అక్రమ నిఘా నిర్వహించలేదని ప్రభుత్వం ఇప్పటివవరకు చెప్తూ వచ్చింది. కానీ ఈ సమాధానం విపక్షాలను సంతృప్తిపరిచేదిగా లేదు. ఈ క్రమంలో విపక్షాలు కేంద్రం ముందు ఒకే ప్రశ్నను ఉంచాయి. అదేంటంటే.. కేంద్రానికి ఎన్ఎస్ఓతో ఏదైనా సంబంధం ఉందా.. అలానే దేశ పౌరులపై కేంద్రం నిఘా ఉంచిందా లేదా అనే దానికి సూటిగా జవాబు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖలు లక్ష్యంగా చేసుకుని వారిపై నిఘా పెట్టారని గ్లోబల్ మీడియా కన్సార్టియం నివేదించినప్పటి నుంచి ప్రతిపక్షాలు ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరుతున్నాయి. ఇక ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. -
నినాదాలు.. నిరసనలు
న్యూఢిల్లీ: వివాదాస్పద పెగసస్ స్పైవేర్, మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నాయి. శుక్రవారం సైతం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన పర్వం యథావిధిగా కొనసాగాయి. లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష సభ్యులు వెంటనే వెల్‌లోకి చేరుకొని నినాదాలు చేశారు. పెగసస్‌తోపాటు కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు. వెనక్కి వెళ్లి సీట్లల్లో కూర్చోవాలని, సభా వ్యవహారాలకు సహకరించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. 15 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ‘ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021’పై చర్చకు అనుమతించారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపు మాట్లాడారు. ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు ఉద్దేశించిన ‘సెంట్రల్ యూనివర్సిటీస్(అమెండ్మెంట్) బిల్లు–2021’పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఈ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు రాజేంద్ర అగర్వాల్ ప్రకటించారు. సీరియస్ విషయమని సుప్రీం చెప్పిందిగా.. పెగసస్ స్పైవేర్‌పై వస్తున్న వార్తలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శుక్రవారం లోక్‌సభలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వం ‘ట్యాక్సేషన్ చట్టాలు(సవరణ) బిల్లు–2021’ను తీసుకొచ్చిందని, అదే న్యాయస్థానం పెగసస్ అనేది సీరియస్ విషయమని చెప్పిందని అన్నారు. ఇంతలో ఆయన మైక్రోఫోన్‌ను స్పీకర్ స్విచ్చాఫ్ చేశారు. తర్వాత ‘సెంట్రల్ యూనివర్సిటీస్(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ప్రవేశపెట్టినప్పుడు అధిర్ రంజన్ మాట్లాడారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని పునరుద్ఘాటించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ స్పందిస్తూ.. వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలే అడ్డు తగులుతున్నాయని ఆరోపించారు. రాజ్యసభలో ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు ఎగువ సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. పెగసస్ అంశంతోపాటు కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. వెల్‌లోకి దూసుకొచ్చి కాగితాలు వెదజల్లి, బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాల కోసం సభ మళ్లీ ప్రారంభమయ్యింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న సురేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19న మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రతిరోజూ ప్రతిపక్షాలు తమ డిమాండ్లపై ఉభయ సభల్లో ఆందోళన సాగిస్తున్నాయి. -
దేశంలో 40 కోట్ల మంది బాహుబలులున్నారు: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘విపక్ష ఎంపీలు పదునైన ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నాను. అలానే ప్రభుత్వానికి సమాధానం చెప్పేందుకు తగిన సమయం ఇవ్వాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విపక్షాలు ఇంధన ధరల పెంపు, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసన వంటి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. "నేను అన్ని పార్టీలు, ఎంపీలు హౌస్‌లో చాలా కష్టమైన, పదునైన ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నాను. కాని క్రమశిక్షణా వాతావరణంలో ప్రభుత్వం స్పందించడానికి అనుమతించాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంచుతుంది, ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది, అభివృద్ధి మార్గాన్ని మెరుగుపరుస్తుంది” అని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ మిమ్మల్ని బాహుబలిగా మారుస్తుంది.. కనుక ప్రతి ఒక్కరు టీకా వేసుకోవాలని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. అలానే ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ‘‘భుజాలకు టీకా తీసున్నవారంతా బాహుబలిగా మారతారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క డోస్ టీకా అయినా తీసుకుని బాహుబలులుగా మారారు. వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. దీని గురించి పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగాలని ఆశిస్తున్నాను’’ అన్నారు మోదీ. -
‘అప్పుడేమో ఎగతాళి.. ఇప్పుడేమో అవిశ్వాసం’
సాక్షి, న్యూఢిల్లీ : అవిశ్వాసంపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తామే చాంపియన్ అనిపించుకోవాలనే టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని దుయ్యబట్టారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీలు కలిసి లాలుచీ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘టీడీపీ సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే తపన తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఎగతాళి చేసిన చంద్రబాబే అవిశ్వాసం పెట్టారు. విభజన హామీలు నెరవేర్చాలని మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. రాష్ట్ర సమస్యలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపుతారు. వైఎస్ జగన్ వస్తేనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది’ అని వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణలు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నేతలు నినాదాలు చేశారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. -
..మొట్టమొదటి ఉపరాష్ట్రపతి వెంకయ్యే: మోదీ
- స్వాతంత్ర్యానంతరం జన్మించినవారిలోవారిలో ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తి - రాజ్యసభలో గుర్తుచేసిన ప్రధాని.. చైర్మన్ పీఠంపై నాయుడు న్యూఢిల్లీ: భారత 13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టినవాళ్లలో.. ఉపరాష్ట్రపతి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో గుర్తుచేయగానే సభ్యులంతా చప్పట్లతో హర్షాతిరేకాలను వ్యక్తంచేశారు. వెంకయ్య..1949, జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో వెంకయ్య నాయుడిచేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. అనంతరం నేరుగా రాజ్యసభకు వెళ్లిన వెంకయ్య.. చైర్మన్ పీఠంపై కూర్చొని సభను నడిపించారు. కొత్త ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ప్రధాని మోదీ, విపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర్యం తరువాత జన్మించినవాళ్లలో ఉపరాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఇదొక అరుదైన సందర్భం. కేంద్ర మంత్రిగా దేశానికి ఆయన ఎంతో సేవ చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన విజయవంతం అయినందుకు ఎవరినైనా అభినందించాలంటే, అది ఒక్క వెంకయ్యను మాత్రమే! ఆయన తెలుగులో మాట్లాడితే సూపర్‌ఫాస్ట్‌గా ఉంటుందని, ఇన్నాళ్లు మాలో న్యాయవాదిలా కలిసుండి, ఇప్పుడు న్యాయమూర్తిలా చైర్మన్ స్థానంలో కూర్చున్నారు’ అని వ్యాఖ్యానించారు. (చదవండి: వెంకయ్యనాయుడు అను నేను..)


