Live: ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ.. విపక్షాలపై రాజ్‌నాథ్‌ సెటైర్లు | Parliament Monsoon Session Day 5: OP Sindoor Debate in LS Updates | Sakshi
Sakshi News home page

Live Updates: ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ

Jul 28 2025 9:55 AM | Updated on Jul 28 2025 4:24 PM

Parliament Monsoon Session Day 5: OP Sindoor Debate in LS Updates

Parliament Monsoon Session Live

భారత సైనికులు సింహాలు : రాజ్‌నాథ్‌ సింగ్‌

  • పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య
  • ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో సైనిక చర్య ప్రారంభించాం
  • ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం. 
  • పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు
  • మతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చపంపారు
  • మన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఉరుకునేది లేదు
  • పాక్‌,పీవోకేలోని పాక్‌ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాం
  • భారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసింది
  • పాకిస్తాన్‌లో తొమ్మిది ఉగ్రశిబిరాలపై దాడులు చేశాం
  • 100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం

  • హిబ్జుల్‌,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాం
  • టెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని  ధ్వంసం చేశాం
  • పాక్‌ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం 
  • పాక్‌ డ్రోన్లను భారత్‌ వాయిసేన కూల్చేసింది
  • పాక్‌లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాం
  • ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్‌ 
  • పాక్‌ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదు
  • భారత నౌకా దళం కూడా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది
  • పాక్‌ను ఆక్రమించుకోవడం ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యం కాదు
  • తమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్‌ కోరింది
  • మనదాడులతో పాక్‌ మన కాళ్ల బేరానికి వచ్చింది.
  • ​‍ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదు.. గ్యాప్‌ ఇచ్చాం
  • ఆపరేషన్ సిందూర్‌ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదు
  • బాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాం

ప్రతి పక్షాలపై రాజ్‌నాథ్‌ సెటైర్లు

  • పరీక్ష రాసేటప్పుడు ఎలా రాస్తున్నాం అన్నది మాత్రమే చూడాలి. 
  • పెన్సిల్‌ విరిగిందా,అరిగిందా అన్నది చూడకూడదు
  • పాక్‌ ఆర్మీ,ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని హతమార్చాం
  • పాక్‌ న్యూక్లియర్‌ బెదిరింపులకు భారత్‌ లెక్క చేయలేదు
  • ఎటుచూసుకున్నా.. పాక్‌ మనతో సమమానం కాదు
  • ప్రతిపకక్షాలు భారత సైనికుల సత్తాను ప్రశ్నించడం సరికాదు
  • భారత సైనికులు సింహాలు
  • భారత్‌ దాడులకు పాక్‌ తట్టుకోలేకపోయింది
  • దేశ రక్షణ విషయంలో ఆచితూచి ప్రశ్నలు వేయాలి
     

లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ

  • ప్రారంభమైన పార్లమెంట్‌

  • లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై మొదలైన చర్చ

  • చర్చ ప్రారంభించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ప్రతిపక్షాలు పారిపోతున్నాయ్‌: పీయూష్‌ గోయల్‌

  • ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో జరగాల్సిన చర్చ

  • బీహార్‌ ఓటర్ల జాబితా అంశంతో ఉభయ సభల్ని అడ్డుకుంటున్న విపక్షాలు

  • మూడుసార్లు వాయిదా పడ్డ సభలు

  • విపక్షాల తీరుపై కేంద్రం ఫైర్‌

  • ఆపరేషన్‌ సింధూర్‌ చర్చ నుంచి పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

  • భారత సైన్యం సాధించిన విజయాన్ని అగౌరవపరుస్తున్నారంటూ పీయూష్‌ వ్యాఖ్య

మూడోసారి లోక్‌సభ వాయిదా

  • ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు లోక్‌సభలో గందరగోళం
  • విపక్షాల ఆందోళనతో లోక్‌సభ మరోసారి వాయిదా
  • మధ్యాహ్నాం 2గం. దాకా వాయిదా వేసిన స్పీకర్‌ ఓం బిర్లా
  • ఇవాళ మూడోసారి పడ్డ వాయిదా

ఆపరేషన్‌ సిందూర్‌పై మాట్లాడేది వీళ్లే

బీజేపీ తరపున.. 

  1. రాజ్‌నాథ్‌ సింగ్‌
  2. బజ్‌యంత్‌ పాండా
  3. ఎస్‌ జైశంకర్‌
  4. తేజస్వి సూర్య
  5. సంజయ్‌ జైశ్వాల్‌
  6. అనురాగ్‌ ఠాకూర్‌
  7. కమల్‌జీత్‌ షెరావత్‌

కాంగ్రెస్‌ నుంచి

  1. గౌరవ్‌ గోగోయ్‌
  2. ప్రియాంక గాంధీ వాద్రా
  3. దీపేంద్ర హుడా
  4. పరిణితీ షిండే
  5. సప్తగిరి ఉలాకా
  6. బిజేంద్ర ఒలా

ఇతరులు

  • లావు కృష్ణదేవరాయ(టీడీపీ)
  • హరీష్‌ బాలయోగి(టీడీపీ)
  • రామశంకర్‌ రాజ్‌భర్‌(ఎస్పీ)
  • చోటేలాల్‌(ఎస్‌పీ)
  • కల్యాణ్‌ బెనర్జీ(ఏఐటీసీ)
  • సయోని ఘోష్‌(ఏఐటీసీ)
  • కే ఫ్రాన్సిస్‌ జార్జ్‌(కేరళ కాంగ్రెస్‌)
  • ఏ రాజా(డీఎంకే)
  • కనిమొళి(డీఎంకే)
  • అమూర్‌కాలే(ఎన్‌సీపీ ఎస్పీ)
  • సుప్రియా సూలే (ఎన్‌సీపీ ఎస్పీ)


 

ఆపరేషన్‌ సిందూర్‌పై.. లోక్‌సభలో చర్చ ప్రారంభించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

  • ఆపరేషన్‌ సిందూర్‌పై.. కాంగ్రెస్‌కు 2గంటల సమయం
  • సాయంత్రం 4.30. గం. ప్రాంతంలో ప్రియాంక వాద్రా గాంధీ ప్రసంగించే ఛాన్స్‌
  • సాయంత్రం ఏడున్నర గంటలకు మాట్లాడనున్న విదేశాంగ మంత్రి జైరాం రమేష్‌
  • రాత్రి 10గం. దాకా సాగనున్న ఆపరేషన్‌ సిందూర్‌ చర్చ

లోక్‌సభ మళ్లీ వాయిదా

ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు ముందు లోక్‌సభలో విపక్షాల ఆందోళన

బీహార్ ఓటర్ జాబితా సవరణపై చర్చకు పట్టు

లోక్ సభ వెల్‌లో విపక్షాల ఆందోళన

బీఏసీ మీటింగ్‌లో ప్రతిపక్ష నేతలంతా ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు ఒప్పుకున్నారు: స్పీకర్‌ ఓం బిర్లా

ఇప్పుడు ఆందోళన ఎందుకు చేస్తున్నారు?: స్పీకర్‌ ఓం బిర్లా

ఆందోళన చేస్తే ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ ఎలా జరుగుతుంది?: స్పీకర్‌ ఓం బిర్లా

వాయిదా వేసిన స్పీకర్‌ ఓం బిర్లా

లోకసభ 1గం. వరకు వాయిదా

అటు రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళన

రాజ్యసభ 2.గం వరకు వాయిదా

ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ

  • అధికార, ప్రతిపక్షాలకు స్పీకర్‌ ఓంబిర్లా విజ్ఞప్తి

  • విపక్షాల తీవ్ర ఆందోళన

  • చర్చ ప్రారంభించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

  • మొత్తం 16 గం. పాటు జరగనున్న చర్చ

  • ప్రభుత్వం తరఫున మాట్లాడనున్న కేంద్ర మంత్రులు

  • చర్చలో చివరగా ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం

  • కాంగ్రెస్‌ నుంచి చర్చను ప్రారంభించనున్న గౌరవ్‌ గగోయ్‌

  • కాంగ్రెస్‌కు 2 గంటల సమయం

ప్రారంభమైన లోక్‌సభ

  • మరికాసేపట్లో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ

  • పార్లమెంట్‌లో 16 గంటలపాటు కొనసాగనున్న చర్చ

  • ఇవాళ, రేపు లోక్‌సభలో చర్చ నడిచే అవకాశం

  • రేపు రాజ్యసభలో చర్చ జరిగే చాన్స్‌

  • లోక్‌సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

  • దేశ జాతయ భద్రతకు హాని కలిగించేలా, పహల్గాం బాధితులు నొచ్చుకునేలా మాట్లాడొద్దని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి కిరెన రిజిజు విజ్ఞప్తి

పార్లమెంట్‌ ప్రారంభం.. ఉభయ సభలు వాయిదా

  • పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభం

  • వాయిదా తీర్మానాలపై విపక్షాల పట్టు

  • స్పీకర్‌ చైర్‌లో ఎంపీ కృష్ణప్రసాద్‌ తెన్నేటీ

  • ఉభయ సభల్లో ఆందోళనల నడుమ.. వాయిదా వేసిన స్పీకర్‌, చైర్మన్‌

  • 12గం. ప్రారంభం కానున్న ఉభయ సభలు

 

  • మరికాసేపట్లో లోక్‌సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చ

  • చర్చను ప్రారంభించనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

  • దాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకోకపోవడంపై ప్రశ్నించనున్న విపక్షాలు

  • ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిన భారత సైన్యం

  • ఆపరేషన్‌ సిందూర్‌ను మద్యలోనే నిలిపివేయడంపై ప్రతిపక్షాల అభ్యంతరం

  • దౌత్యం తన ప్రమేయం ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వంపైనా ప్రశ్నించే అవకాశం

శశిథరూర్‌ .. గప్‌చుప్‌
పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌.. చర్చ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ చర్చకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ వర్గాలు ఈ ప్రకటన చేశాయి. ఒకవేళ ఆయన గనుక చర్చలో పాల్గొంటే మాత్రం అది పార్టీ లక్ష్మణరేఖ దాటినట్లే కానుంది.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. ఐదో రోజు సెషన్‌ ప్రారంభమైంది. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఉభయ సభలు గత నాలుగు రోజులుగా సజావుగా సాగని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చించేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్చతో ఇవాళ సభ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

దేశాన్ని అవమానించొద్దు: రిజిజు
ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చవేళ.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ప్రతిపక్షాలకు ఓ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో దేశ హుందాతనం, గౌరవాన్ని కాపాడాలి. విపక్షాలు పాక్‌ భాష వాడొద్దు. దేశ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దు. సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు అని కోరారు. రావణుడు లక్ష్మణ రేఖ దాటాడు కాబట్టే లంకా దహనం అయ్యింది. పాక్‌ ఉగ్రవాదులు సరిహద్దు దాటారు కాబట్టే వాళ్ల ఉగ్రవాద శిబిరాలు నాశనం అయ్యాయంటూ రిజిజు ట్వీట్‌

  • ఉగ్రవాదులు మన దేశం వారేనన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం

  • ఇన్నిరోజులు జాతీయ దర్యాప్తు సంస్థ ఏం చేసిందని ప్రశ్న

  • పాక్‌ నుంచి ఉగ్రవాదులు వచ్చారనడానికి ఆధారాల్లేవ్‌

  • ఇప్పటిదాకా ఉగ్రవాదుల జాడ ఎందుకు తెలుసుకోలేకపోయారని ప్రశ్న

  • చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరాలు

  • చిదంబరాన్ని వెనకేసుకొస్తున్న కాంగ్రెస్‌ 

  • ఆయన అడిగినదాంట్లో తప్పేంటి? అని బీజేపీకి కాంగ్రెస్‌ ఎంపీల ప్రశ్న

లోక్‌సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్‌ పాల్గొంటారని తెలుస్తోంది. విపక్షాల తరఫున ప్రసంగించే నేతల వివరాలపై స్పష్టత లేదు. అయితే కాంగ్రెస్‌ తరఫున ఎంపీ ప్రియాంక గాంధీ, మరికొందరు ఎంపీలు ప్రసంగిస్తారని సమాచారం. చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. 

ఏప్రిల్‌ 25వ తేదీన.. జమ్ము కశ్మీర్‌ అనంతనాగ్‌ జిల్లా పహల్గాం బైసరన్‌ లోయలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.  ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) సంస్థ ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించింది. అయితే ఇప్పటిదాకా ఆ ఉగ్రవాదుల భరతం పట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని కాంగ్రెస్‌ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే సమయంలో ఓవైపు.. పాక్‌కు బుద్ధి చెప్పేందుకేనని కేంద్రం చెప్పిన ఆపరేషన్‌ సిందూర్‌ను అర్దంతరంగా ఆపేయడం పైనా మండిపడ్డాయి. మరోవైపు.. తన   వల్లే కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన భారతదేశ విదేశాంగ విధానం వైఫల్యమని మండిపడుతున్నాయి. 

అయితే ట్రంప్‌ జోక్యాన్ని ఖండించిన భారత ప్రభుత్వం.. పహల్గాం దాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, ఆ ఆపరేషన్‌ విజయవంతంపైనా పార్లమెంట్‌లో చర్చిస్తామని చెబుతోంది. అటు రేపు రాజ్యసభలో ఆపరేషన్ సిందూరపై చర్చ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement