Davos: భారత్ ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ ప్రాజెక్టులపై చర్చ | Davos: Debate On Housing Projects In India Future City | Sakshi
Sakshi News home page

Davos: భారత్ ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ ప్రాజెక్టులపై చర్చ

Jan 22 2026 9:28 PM | Updated on Jan 22 2026 9:31 PM

Davos: Debate On Housing Projects In India Future City

దావోస్: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)- 2026 సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫామ్ వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, హైదరాబాద్‌లో ఉన్న గోద్రేజ్ క్రీమ్ లైన్ డెయిరీ ప్లాంట్ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకాశాలపై చర్చించారు.

భారత్ ఫ్యూచర్ సిటీ నివాస ప్రాంతంలో భారీ గృహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశంపై మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో మౌళిక వసతులు (స్కూళ్లు, ఆసుపత్రులు, కమ్యూనిటీ సౌకర్యాలు) ఏర్పాటు చేయడం ప్రభుత్వానికీ, సంస్థకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. నాదిర్ గోద్రేజ్ను హైదరాబాద్‌కు రావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement