బేగంపేట : చూపు తిప్పుకోనివ్వని వైమానిక విన్యాసాలు..గగనంలో త్రివర్ణాలతో పొగలు చిమ్మిన రకరకాల ఆకృతులు.. సందర్శకులను కట్టిపడేశాయి. బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన వింగ్స్ ఇండియా షో శుక్రవారం సందడిగా కనిపించింది.
సందర్భకులతో ఎగ్జిబిషన్‌లోని స్టాళ్లు కిక్కిరిశాయి. ఏవియేషన్ రంగానికి సంబంధించిన అధునాత పరిజ్ఞానం,నూతన ఎయిర్‌క్రాఫ్ట్సŠ, డ్రోన్లలో వచ్చిన నూతన టెక్నాలజీ, ఏవియేషన్ రంగంలో అవకాశాలు తదితర అంశాలను స్టాళ్లలో వివరించారు.
శుక్రవారం సామాన్య సందర్శకులను అనుమతించడంతో భారీ సంఖ్యలో తరలివచ్చి షోను తిలకించారు. శనివారం (నేడు) వింగ్స్ ఇండియా ప్రదర్శన ముగియనుంది.


