జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు | Monsoon Session of Indian Parliament 2025 Dates Announced check Details | Sakshi
Sakshi News home page

జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

Jun 4 2025 1:50 PM | Updated on Jun 4 2025 1:50 PM

Monsoon Session of Indian Parliament 2025 Dates Announced check Details

న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 21వ తేదీ నుంచి ఆగష్టు 12వ తేదీ దాకా సెషన్‌ ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు బుధవారం ప్రకటించారు. ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఇండియా కూటమి డిమాండ్‌ చేస్తున్న వేళ.. వర్షాకాల సమావేశాల తేదీలను కేంద్రం ప్రకటించడం గమనార్హం. 

ఈ ఏడాది పార్లమెంట్‌ తొలి సమావేశం.. జనవరి 31వ తేదీన బడ్జెట్‌ సెషన్‌తో ప్రారంభమైంది. కాస్త విరామంతో రెండు దఫాలుగా బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. ఏప్రిల్‌ 4వ తేదీన లోక్‌సభ, రాజ్యసభల నిరవధిక వాయిదాతో ఈ ఏడాది పార్లమెంట్‌కు తొలి సమావేశాలు(బడ్జెట్‌) జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement