12 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్ల  రుణాల రైటాఫ్‌..! | Banks write off loans close to Rs 10 lakh cr given to large corporates in last 12 years | Sakshi
Sakshi News home page

12 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్ల  రుణాల రైటాఫ్‌..!

Aug 11 2026 4:46 AM | Updated on Aug 11 2026 4:46 AM

Banks write off loans close to Rs 10 lakh cr given to large corporates in last 12 years

పార్లమెంటులో వెల్లడించిన మంత్రి పంకజ్‌ చౌదరి 

న్యూఢిల్లీ: బడా కార్పొరేట్లు, సరీ్వసులకు సంబంధించి గడిచిన 12 ఏళ్లలో బ్యాంకులు రూ.9,95,000 కోట్ల రుణాలను  రైటాఫ్‌ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి పార్లమెంటులో ఈ విషయాన్ని వెల్లడించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1,48,753 కోట్లను రైటాఫ్‌ చేయగా, 2025–26లో ఈ మొత్తం రూ.20,485 కోట్లకు దిగొచి్చందని ఆయన తెలిపారు. 

రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) డేటా ప్రకారం భారీ పరిశ్రమలు, సర్వీసుల రుణ బకాయిలు 2024–25లో రూ.63,19,057 కోట్ల నుంచి 2025–26లో రూ.69,21,734 కోట్లకు పెరిగాయని రిజర్వ్‌ చెప్పారు. ‘రుణాల రైటాఫ్‌ అనేది అకౌంటింగ్‌ ప్రక్రియ (బ్యాలెన్స్‌ షీట్‌లో సర్దుబాట్ల కోసం), దీనివల్ల రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూర్చినట్లు కాదు. దీనివల్ల బకాయిలను మాఫీ చేసినట్లుగా పరిగణించకూడదు. రైటాఫ్‌ తర్వాత కూడా ఆయా ఖాతాల నుంచి బకాయిల వసూలుకు బ్యాంకులు తగిన రికవరీ చర్యలన్నీ కొనసాగిస్తాయి’ అని ఆయన స్పష్టం చేశారు.  
.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement