breaking news
Write-Off
-
మాఫీ చేసిన రుణ వసూళ్లు పెంచుకోవాలి: బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు మాఫీ చేసిన (ఖాతాల్లో రద్దు) మొండి రుణాల (ఎన్పీఏలు)ల వసూళ్ల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచన చేసింది. వీటి వసూళ్ల రేటు తక్కువగా ఉండడంతో కనీసం 40 శాతానికి అయినా పెంచుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి ఐదేళ్ల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.7.34 లక్షల కోట్లను ఖాతాల్లో మాఫీ చేశాయి. ఇందులో 14 శాతాన్నే అవి వసూలు చేసుకోగలిగాయి. మాఫీ చేసినప్పటికీ వాటిని వసూలు చేసుకునే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. 2022 మార్చి నాటికి మాఫీ చేసిన రూ.7.34 లక్షల కోట్లలో రూ.1.03 లక్షల కోట్లనే వసూలు చేశాయి. ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు దీంతో 2022 మార్చి నాటికి నికరంగా మాఫీ చేసిన ఎన్పీఏల మొత్తం రూ.6.31 లక్షల కోట్లుగా ఉంది. ఈ విధమైన వసూళ్లు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలా వసూలయ్యే మొత్తం బ్యాంకుల నికర లాభాలను పెంచుతుందని పేర్కొన్నాయి. ఈ పరిస్థితిపై సమీక్ష చేయడానికి వీలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ త్వరలోనే పీఎస్బీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పాయి. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ.11.17 లక్షల కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు -
షాకింగ్: లక్షల కోట్ల రూపాయల రుణాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు చెక్కేస్తున్న బడాబాబుల బండారం సామాన్య ప్రజానీకం గుండెల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంటే.. ప్రభుత్వ బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిల వివరాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ఒకటి.. రెండూ లేదంటే వంద కోట్లు కాదు.. ఏకంగా లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయి. స్వయంగా ఆర్థికశాఖ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన చేదు వాస్తవాలివి. గత మూడేళ్ల కాలంలో 2.41లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసినట్టు ఆర్థిక శాఖ సహాయమంత్రి శివప్రతాప్ శుక్లా మంగళవారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 2014, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, 2017 మధ్య ఈ రుణాలను రద్దు చేశాయని మంత్రి తెలిపారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (నిరర్ధక ఆస్తులు) లేదా వసూలు కాని రుణాలను ప్రతి ఏటా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌ను తొలగించడం సాధారణ ప్రక్రియే అని శుక్లా రాజ్యసభలో చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ మూడేళ్లలో 2,41,911కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని వెల్లడించారు. అయితే లోన్లను బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించినంత మాత్రాన రుణాలు తీసుకున్నవారిని వదిలేది లేదని.. ఈ నిర్ణయం రుణ గ్రహీతలకు లాభించదంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాదు నిబంధనల ప్రకారం రుణాలు తీసుకున్నవారి వివరాలను ప్రకటించలేమని చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే రుణాలు వసూలు చేయడానికి బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయని శుక్లా తెలిపారు. మండిపడిన మమతా బెనర్జీ మూడేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో రుణాలు రద్దు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ లెక్కలు తనను షాక్‌కు గురిచేశాయంటూ దుయ్యబట్టారు. ఓవైపు రుణాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు రుణాలను రద్దు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోగా బడాబాబులు తీసుకున్న రుణాలను రద్దు చేస్తారా అంటూ విమర్శించారు. పైగా ఈ రుణాలు ఎవరు తీసుకున్నారన్న విషయాన్ని కూడా మంత్రి చెప్పకపోవడంపై మండిపడిన మమతా అసలు ఇదే అతి పెద్ద కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి వివరాలు ఇవ్వడం కుదరదని పార్లమెంట్‌లోనే ప్రభుత్వం చెప్పడం దారుణమని...కచ్చితంగా ఆ వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా గత ఐదేళ్లలో బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రెట్టింపు కావడం గమనార్హం. దీనిపై ఆర్బీఐ స్వయంగా పలుమార్లు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. I have just seen the reply to the Parliament Question of today as given below. My FB post: https://t.co/u5rKQhMWGG pic.twitter.com/L72tfImeeG — Mamata Banerjee (@MamataOfficial) April 3, 2018 -
విజయ్ మాల్యా బకాయి రద్దయిందా..?
-
మాల్యా బకాయి రద్దయిందా..?
ఖాతా పుస్తకాల్లో రూ.1,200 కోట్లు రైటాఫ్ చేసిన ఎస్బీఐ • మరో 62 మందికి చెందిన రూ. 5,800 కోట్లు కూడా... • ఈ ఏడాది జూన్ నాటికి ఇలా చేసింది రూ. 48 వేల కోట్లు • సామాన్యుల పరిభాషలో రైటాఫ్ అంటే రద్దు చేయటమే • ఈ మేరకు వార్తలు రావటంతో పార్లమెంటులో విపక్షాల ఫైర్ • ఎందుకిలా చేశారంటూ నిలదీసిన సీపీఎం, కాంగ్రెస్ • అది కేవలం సాంకేతిక పదమే; రైటాఫ్ అంటే రద్దుకాదు: జైట్లీ • రుణ గ్రహీతల నుంచి వసూలు చేసి తీరతామని ప్రకటన • ఖాతాల్లో వేరే పద్దుకింద మార్చామన్న ఎస్బీఐ చీఫ్ అరుంధతి • రికవరీకి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని స్పష్టీకరణ • ఎగవేసిన వారిలో టాప్-10 మంది రుణాలే రూ.4,600 కోట్లు!! సాక్షి, బిజినెస్ విభాగం కింగ్ ఫిషర్ ఎరుుర్‌లైన్‌స పేరిట విజయ్‌మాల్యా తీసుకున్న రూ.1,200 కోట్ల రుణంతో సహా దాదాపు 63 మంది డిఫాల్టర్లకు చెందిన రూ.7,000 కోట్ల రుణాల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ‘రైటాఫ్’ చేసిందంటూ వచ్చిన వార్తలు బుధవారం పార్లమెంటులో దుమారం రేపారుు. బ్లాక్ మనీ ఏరివేతకంటూ ప్రధాని మోదీ చేసిన నోట్ల రద్దు ప్రకటనతో ఇప్పటికే జనం చేతిలో వెరుు్య, రెండువేలు పట్టుకుని బ్యాంకుల ముందు పడిగాపులు గాస్తున్నారు. ఏటీఎంలు పనిచేయక, పనిచేసే కొద్ది ఏటీఎంల ముందు లైన్లో నిల్చోలేక నానా యాతనా పడుతున్నారు. ఇలాంటి తరుణంలో... బడా బాబులకిచ్చిన రుణాల్లో ఏకంగా రూ.7వేల కోట్లను ఎస్బీఐ రైటాఫ్ చేయటాన్ని పార్లమెంటులో విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టారుు. చివరికి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పందిస్తూ... అది వాస్తవంగా రైటాఫ్ కాదని, వాళ్లు రుణాన్ని చెల్లించాల్సిందేనని జవాబిచ్చారు. మరోవంక ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య సైతం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి... తాము ఖాతా పుస్తకాల్లో సర్దుబాటుకోసం అలా పేర్కొన్నామే తప్ప నిజంగా రైటాఫ్ చేసినట్లు కాదని, వసూలు చర్యల్ని మరింత వేగవంతం చేస్తున్నామని చెప్పారు. దీంతో విపక్షాలు శాంతించారుు. వివరాలివీ... దేశంలో అగ్రగామి ప్రభుత్వ రంగ బ్యాంకు కావటంతో ఎస్బీఐకు నిరర్థక ఆస్తులు కూడా అదే స్థారుులో ఉన్నారుు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దాదాపు రూ.1.05 లక్షల కోట్లకు చేరాయి. ఇవి మొత్తం రుణాల్లో దాదాపు 7.14%. వీటిలో టాప్-100 మంది డిఫాల్టర్లకు చెందిన దాదాపు రూ.7,016 కోట్లను రైటాఫ్ చేసినట్లు ఎస్బీఐ తన ఖాతా పుస్తకాల్లో చూపించింది. ఈ 100 మందిలో విజయ్ మాల్యాతో సహా టాప్-63 మంది ఎగవేతదారుల రుణాల్ని పూర్తిగా రైటాఫ్ చేయగా, మరో 31 మంది రుణాల్ని పాక్షికంగా రైటాఫ్ చేసింది. మిగిలిన ఆరుగురి రుణాల్నీ ఎన్పీఏలుగా చూపించింది. ఖాతా పుస్తకాల వివరాలతో పాటు ‘డీఎన్ఏ’ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. 2016 జూన్ 30 నాటికి బ్యాంకు ఏకంగా రూ.48,000 కోట్ల రుణాల్ని రైటాఫ్ చేసినట్లు తెలియజేసింది. ఇది గందరగోళానికి దారితీసింది. ఒకవైపు నోట్లరద్దుతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుండటం, మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటం వంటి పరిణామాలతో ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లరుుంది. దీంతో వివరణ ఇవ్వటానికి హడావుడిగా ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ పదం సాంకేతికమేనంటూ తీవ్రతను తగ్గించే యత్నం చేశారు. రుణ గ్రహీత తన బాధ్యతను తప్పించుకోలేడని, ఈ రుణాల్ని వేరే పద్దుకింద చూపిస్తున్నామని జైట్లీ కూడా రాజ్యసభలో చెప్పారు. ఇదీ... ఎన్పీఏల కథ దేశంలో బ్యాంకులు పలు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల కొద్దీ రుణాలిచ్చారుు. వీటిలో చాలా కార్పొరేట్లు తిరిగి చెల్లించేస్తున్నా... కొన్ని కంపెనీలు మాత్రం రకరకాల కారణాలు చూపిస్తూ రుణాలు తిరిగి చెల్లించటం మానేశారుు. కొన్ని కంపెనీలైతే ప్రభుత్వ అనుమతితో రుణాల్ని పునర్వ్యవస్థీకరించుకున్నారుు. అంటే కొత్త రుణాలుగా మారి.. తిరిగి చెల్లించడానికి కొంత సమయం లభిస్తుందన్న మాట. తిరిగి చెల్లించటాన్ని మానేసిన కంపెనీల మొత్తం రుణాలు.. కొన్ని లక్షల కోట్లపైనే ఉన్నారుు. వీటిని బ్యాంకులు బ్యాలెన్స షీట్లలో ‘మొండి బాకీలు’గా చూపిస్తూ వస్తున్నారుు. పాత మొండి బకారుులకు కొత్తవి తోడై... ఏటికేడాది ఇవి పెరుగుతున్నారుు తప్ప తగ్గటం లేదు. బ్యాంకులు మూలధన లభ్యత... మొండి బాకీల్లో వసూలయ్యేవెన్నో, కానివెన్నో తేల్చుకోవటం కోసం బ్యాలెన్స షీట్స్ శుద్ధిచేసే ప్రక్రియను బ్యాంకులకు ఆర్బీఐ నిర్దేశించింది. దీన్లో భాగంగా 2017 మార్చి నాటికి బ్యాంకులన్నీ ఒత్తిడిలో వున్న రుణాలన్నింటినీ తమ బ్యాలెన్స షీట్లలో నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏలుగా చూపించాలి. ఒక అప్పు గనక ఎన్పీఏగా మారితే.. అప్పటి నుంచి ఐదేళ్లలో దానికి తగ్గ మొత్తాన్ని కేటారుుంచాలి. అంటే బ్యాంకులు తమ లాభాలు తగ్గించుకుని, అలా వచ్చిన మొత్తాన్ని ఎన్పీఏలకు కేటారుుంపులుగా చూపించాలన్న మాట. మరి రైటాఫ్ సంగతేంటి? నిజానికి రైటాఫ్ అంటే... ఖాతాల్లోంచి పూర్తిగా తొలగించటం. ‘‘ఒక రుణం రైటాఫ్ అరుుందంటే సదరు రుణ గ్రహీతకు తిరిగి రుణాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. రుణాన్ని రద్దు చేయటానికి, రైటాఫ్‌కు పెద్దగా తేడా లేదు. సాధారణంగా ఎగవేతదారు హామీగా పెట్టిన ఆస్తుల్ని వేలం వేశాక... అన్ని మార్గాల్లో రావాల్సిన బకారుు వసూలు చేసుకున్నాక కూడా కొంత మొత్తం మిగిలిపోతే దాన్ని వసూలు చేసే మార్గాలేవీ లేకపోతే... ఆప్పుడు రైటాఫ్గా ప్రకటిస్తారు’’ అనేది చార్టర్డ్ అకౌంటెంట్ల అభిప్రాయం. ఇదే అభిప్రాయంతో బుధవారం పార్లమెంటులో సీపీఎం నేత సీతారాం ఏచూరి, కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైటాఫ్ నిజమేనా? అంటూ... ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రైటాఫ్ అంటే రుణ రద్దు కాదు: జైట్లీ ‘‘ఇదంతా ఆ పదాన్ని పలకటంలో వచ్చిన పొరపాటు. రైటాఫ్ అనే పదాన్ని యథాతథంగా తీసుకోవద్దు. రైటాఫ్ అంటే రద్దు కాదు. ఆ రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత రుణ గ్రహీతకుంటుంది. రుణం అలాగే ఉంటుంది. వసూలు ప్రయత్నాలనూ కొనసాగిస్తాం’’ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిచ్చారు. ఖాతా పుస్తకాల్లో మాత్రమే అది నిరర్థక ఆస్తి పద్దు నుంచి వేరే పద్దుకు మారుతుందని చెప్పారు. కింగ్‌ఫిషర్‌ను నేరుగా ప్రస్తావించకుండా... ఆ రుణాన్ని వేరొక ప్రభుత్వం అధికారంలో ఉండగా పునర్వ్యవస్థీకరించిందని, అది తమకో గుదిబండలా బదిలీ అరుుందని చెప్పుకొచ్చారు. వసూలు ప్రయత్నాల్లోనే ఉన్నాం: అరుంధతీ భట్టాచార్య ఈ రుణాలన్నిటినీ కలిపి వేరొక పేరుతో ఖాతా పుస్తకాల్లో చూపిస్తున్నామని, వసూలు చేయటానికి ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయని ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య స్పష్టంచేశారు. కింగ్‌ఫిషర్ రుణానికి సంబంధించి ఆ సంస్థకు చెందిన పలు ఆస్తుల్ని 17 బ్యాంకుల కన్సార్షియం భౌతికంగా స్వాధీనం చేసుకుంది కూడా. అందులో గోవాలోని విలాసవంతమైన కింగ్‌ఫిషర్ విల్లా కూడా ఉంది. అయితే, దీన్ని వేలం వేయబోరుునా ఎవ్వరూ కొనటానికి ముందుకు రాలేదు. ఈ కన్సార్షియానికి ఎస్బీఐ నేతృత్వం వహిస్తోంది. ‘‘ఇవి రైటాఫ్‌లు కావు. కొన్నేళ్లుగా వస్తున్న పాత పద్దులు. వీటికి తగ్గ ప్రొవిజనింగ్‌లు చేశాం. అందుకని వాటిని అకౌంట్స్ అండర్ కలెక్షన్ అనే పేరుతో విడిగా చూపిస్తున్నాం. వీటి వసూలుకు ముమ్మరమైన ప్రక్రియ సాగుతోంది’’ అని అరుంధతి వివరించారు. ‘‘ఎవ్వరినీ వదిలిపెట్టం. రికవరీకి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇక రైటాఫ్ అనే పదం కేవలం సాంకేతికం. సామాన్యుల భాషలో అర్థం చేసుకుంటే తప్పుగా ధ్వనిస్తారుు’’ అన్నారామె.