ఎంఎస్‌ఎంఈలకు రూ.150 కోట్ల రుణాలు  | Central Bank's MSME outreach generates Rs 150 crores | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈలకు రూ.150 కోట్ల రుణాలు 

Aug 8 2026 4:55 AM | Updated on Aug 8 2026 4:55 AM

Central Bank's MSME outreach generates Rs 150 crores

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక ఔట్‌ రీచ్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ రీజియన్‌ చిన్న, మధ్య తరహా సంస్థల కోసం (ఎంఎస్‌ఎంఈ) నగరంలో ప్రత్యేక అవుట్‌రీచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. కొత్త కస్టమర్లను సమకూర్చుకోవడం, రుణాల విస్తరణపై మరింతగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సెంట్రల్‌ ఆఫీస్‌ జీఎం (ఎంఎస్‌ఎంఈ) హిమాన్షు గుప్తా సూచించారు. 

కార్యక్రమంలో భాగంగా రూ. 40 కోట్ల రుణాలు మంజూరు చేయగా, రూ. 60 కోట్ల రుణాలకు సూత్రప్రాయ శాంక్షన్లు అందజేశారు. అదనంగా రూ. 50 కోట్ల విలువైన కొత్త వ్యాపార అవకాశాలు లభించడంతో మొత్తం రూ.150 కోట్ల వ్యాపారం నమోదైంది. రూ. 25 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. హైదరాబాద్‌ జోన్‌ జోనల్‌ హెడ్‌ ఎం. పిచ్చయ్య, ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ (బాలానగర్‌) జేడీ సీఎస్‌ఎస్‌ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement