ఎల్‌ఐసీ లాభం జూమ్‌  | LIC Net profit rises 23percent to Rs 13492 crore in Q1 results | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ లాభం జూమ్‌ 

Aug 7 2026 2:38 AM | Updated on Aug 7 2026 2:38 AM

LIC Net profit rises 23percent to Rs 13492 crore in Q1 results

క్యూ1లో రూ. 13,492 కోట్లు 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 13,492 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం వృద్ధితో రూ. 2,37,848 కోట్లకు చేరింది. తొలి ఏడాది ప్రీమియం ఆదాయం రూ. 7,525 కోట్ల నుంచి రూ. 9,217 కోట్లకు ఎగసింది. రెన్యువల్‌ ప్రీమియం ఆదాయం రూ. 61,833 కోట్లకు బలపడింది. సింగిల్‌ ప్రీమియం ఆదాయం రూ. 56,369 కోట్లకు పుంజుకుంది. వెరసి నికర ప్రీమియం ఆదాయం రూ. 1,19,200 కోట్ల నుంచి రూ. 1,27,250 కోట్లకు జంప్‌చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement