దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన మూడు వరుసల సఫారీ ధర పెరిగింది. ఫలితంగా.. ఈ సంవత్సరంలో ఈ SUV ధర పెరగడం ఇది మూడవసారి.
మార్కెట్లో అమ్ముడవుతున్న టాటా సఫారీ.. పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. కాగా ఇది త్వరలోనే ఈవీ రూపంలో కూడా లాంచ్ కావడానికి సిద్దమవుతోంది. అయితే ఈ మోడల్ మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.
రూ.25 వేలు పెరుగుదల తరువాత టాటా సఫారీ ధర రూ. 13.40-26.91 లక్షల మధ్య ఉంది. ధరలు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతాయి. కాబట్టి కొత్త ధరలు గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లేదా డీలర్షిప్ సందర్శించవచ్చు.
టాటా సఫారీలో రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి. అవి 1.5-లీటర్ టర్బో పెట్రోల్ (168bhp/280Nm), రెండు 2.0-లీటర్ డీజిల్ (168bhp/350Nm). ఇవి రెండూ ఉత్తమ పనితీరును అందిస్తాయి.
ఫీచర్లవిషయానికి వస్తే.. సఫారీలో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, రియర్ సన్‌బ్లైండ్‌లు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, జేబీఎల్ స్పీకర్‌లతో కూడిన హర్మాన్ కార్డాన్ ఆడియో, ఎలక్ట్రిక్ బాస్ మోడ్, వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్నాయి. భద్రతా ఫీచర్లలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, లెవెల్ 2 ఏడీఏఎస్, 360° కెమెరా, ఏబీఎస్, నాలుగు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.


