అందుకే.. గ్రాండ్ విటారా ధరలు పెరిగాయ్! | Maruti Suzuki Grand Vitara Prices Hiked Across The Range | Sakshi
Sakshi News home page

అందుకే.. గ్రాండ్ విటారా ధరలు పెరిగాయ్!

Sep 17 2026 6:59 PM | Updated on Sep 17 2026 7:02 PM

Maruti Suzuki Grand Vitara Prices Hiked Across The Range

మారుతి సుజుకి ఈ నెల ప్రారంభం నుంచి గ్రాండ్ విటారా ధరలను కనిష్టంగా రూ.5000 పెంచింది. పెంపు తరువాత.. అన్ని వేరియంట్ల ధరల్లో మార్పులు జరిగాయి. ఈ ప్రభావం 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ మోడళ్లతో పాటు సీఎన్జీ వేరియంట్లపై కూడా పడుతుంది. ముడిసరుకుల ధరలు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను సవరించినట్లు వెల్లడించింది.

గ్రాండ్ విటారా అనేది మారుతి మిడ్ సైజ్ ఎస్యూవీ. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టయోటా అర్బన్ క్రూయిజర్, టాటా కర్వ్, టాటా సియెర్రా వంటి వాహనాలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది పెట్రోల్, హైబ్రిడ్, CNG పవర్‌ట్రెయిన్‌లతో లభిస్తుంది. ఈ కారు 2027లో కొంత అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఏడీఏఎస్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త సిక్స్-స్పీడ్ MT వంటివి రానున్నాయి.

ఇదీ చదవండి: పెరిగిన డిజైర్ ధరలు: కొత్త రేట్లు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement