మారుతి సుజుకి తన మొత్తం మోడల్ శ్రేణి ధరలను పెంచింది. ఇందులో భాగంగా డిజైర్ ధరను కూడా సవరించింది. వేరియంట్‌ను బట్టి, ఈ కాంపాక్ట్ సెడాన్ ధర ఇప్పుడు రూ. 7,500 వరకు పెరిగింది.
రేట్లు పెరిగిన తరువాత.. ఎంట్రీ లెవల్ డిజైర్ ఎల్ఎక్స్ఐ ధర రూ. 6.30 లక్షల వద్ద, టాప్ స్పెక్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 9.41 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్దకు చేరాయి. సీఎన్‌జీ వేరియంట్‌ల ధరలు కూడా సవరించారు. దీంతో వీటి ధరలు రూ. 8.18 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
వేరియంట్‌ను బట్టి మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో పాటు, డిజైర్ పెట్రోల్.. సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌లతో లభిస్తోంది. ఇది భారత మార్కెట్లో హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి కార్లకు అమ్మకాల్లో గట్టి పోటీ ఇస్తోంది.


