పండుగ షి‘కారు’! | India passenger vehicle sales jump 35 Percentage to 4. 5 lakh in August | Sakshi
Sakshi News home page

పండుగ షి‘కారు’!

Sep 2 2026 4:28 AM | Updated on Sep 2 2026 4:28 AM

India passenger vehicle sales jump 35 Percentage to 4. 5 lakh in August

ఆగస్టులో 4.5 లక్షల సేల్స్‌.. 35% అప్‌! 

ఈ ఏడాదిలో 10% వృద్ధి అంచనా

న్యూఢిల్లీ: వాహన కంపెనీలకు ఈ ఏడాది పండుగ కళ ముందే వచ్చేసింది. దేశీయ ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు ఆగస్టులో 35% పెరిగి 4.5 లక్షల యూనిట్లకు చేరాయి. గతేడాది (2025) ఆగస్టులో ఇవి సుమారు 3.3 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. గత సెపె్టంబరులో జీఎస్‌టీ రేట్ల తగ్గింపు, రెపో రేట్ల కోతలతో రుణాల ఈఎంఐలు తగ్గడం, రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు వంటి పరిణామాలు వాహనాలకు డిమాండ్‌ను పెంచాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

 దీంతో రానున్న పండగ సీజన్‌పై ఆటో పరిశ్రమలో ఆశావాదం నెలకొంది. ఈ ఏడాది (2026–27) దేశీ ప్యాసింజర్‌ వాహనాల పరిశ్రమ 10% వృద్ధి సాధించవచ్చని అంచనా వేశారు. ఇదిలా ఉండగా, మారుతీ సుజుకీకి ఆగస్టు చివరి నాటికి 1.8 లక్షల వాహనాల పెండింగ్‌ బుకింగ్‌లు ఉన్నాయని బెనర్జీ తెలిపారు.కాంపాక్ట్‌ ఎస్‌యూవీ బ్రెజ్జా బుకింగ్‌లు సుమారు 30 వేలుగా చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement