ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి.. 2026 బాలెనో ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేసింది కొన్ని రోజులకే, తమ ఇతర మోడల్స్ ధరలను మరోసారి పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ ధరల పెరుగుదల మూడు నెలల్లో మూడోసారి కావడం గమనార్హం.
కంపెనీ ప్రకారం.. ముడిసరుకుల ఖర్చులు నిరంతరం పెరుగుతున్న కారణంగా, ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ. 20,000 వరకు పెంచాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ధరల పెంపు ఈ నెల నుంచే అమల్లోకి వస్తుంది.
మారుతి సుజుకి మాత్రమే కాకుండా.. కార్ల ధరలను పెంచిన కంపెనీల జాబితాలో టాటా మోటార్స్ కూడా ఉంది. 1 సెప్టెంబర్ 2026 నుంచి అమలులోకి వచ్చేలా, తమ పెట్రోల్/డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణికి గరిష్టంగా రూ.25,000 వరకు పెంపును ప్రకటించింది.
హ్యుందాయ్ మోటార్ కూడా జనవరి, జూన్‌లలో చేసిన సవరణల తర్వాత ఈ ఏడాది మూడవసారిగా, సెప్టెంబర్ నుంచి తమ పోర్ట్‌ఫోలియో అంతటా ధరలు 1% వరకు పెరుగుతాయని తెలిపింది. మహీంద్రా & మహీంద్రా ఇప్పటికే జూలై 2026 నుంచి SUV ధరలను సగటున 2.7% పెంచింది.


