టాటా కార్ల ధరల పెంపు! | Tata Motors To Increase Car Prices By Up To ₹25,000 From September 1 Amid Rising Costs And Inflation, Check More Details Inside | Sakshi
Sakshi News home page

టాటా కార్ల ధరల పెంపు!

Aug 22 2026 5:47 PM | Updated on Aug 22 2026 7:16 PM

Tata Motors to increase prices by up to Rs 25000 from September 1

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) తన కార్ల ధరలను రూ. 25,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. సవరించిన రేట్లు 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

కంపెనీ ప్రకారం.. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు మరియు కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య ద్రవ్యోల్బణం కారణంగా ధరల పెంపు జరిగింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE), ఎలక్ట్రిక్ వాహనాలు (EV) రెండింటికీ కొత్త ధరలు వర్తిస్తాయి. ధరల పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది.

వేరియంట్ల వారీగా ఖచ్చితమైన ధరల వివరాలు వెల్లడి కాలేదు. డీలర్‌షిప్ విధానాలు, బుకింగ్ తేదీలను బట్టి, సెప్టెంబర్ 1వ తేదీకి ముందు టాటా కారు లేదా SUVని బుక్ చేసుకోవాలనుకుంటున్న కస్టమర్లు ప్రస్తుత ధరలనే పొందగలిగే అవకాశం ఉంది.

కాగా.. హ్యుందాయ్ కూడా వచ్చే నెల నుంచి తన మోడల్ శ్రేణి అంతటిపైనా ధరల పెంపును ప్రకటించగా, మారుతి సుజుకి 2026 ఆగస్టు ప్రారంభంలోనే తన మోడళ్ల ధరలను పెంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement