పసిడి ప్రియులకు షాక్.. భారమైపోతున్న బంగారం! | Today Gold And Silver Prices August 22nd, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Gold And Silver Prices: పసిడి ప్రియులకు షాక్.. భారమైపోతున్న బంగారం!

Aug 22 2026 5:01 PM | Updated on Aug 22 2026 7:11 PM

Gold Price Hike Check Latest Gold Rates in Hyderabad Chennai and Delhi

బంగారం ధరలకు రెక్కలొచ్చాయా అన్నట్లుగా.. గోల్డ్ రేటు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా గరిష్టంగా రూ.1520 పెరిగిన పసిడి ధర.. వారం రోజుల్లో ఏకంగా రూ.7,960 పెరిగి, జీవితకాల గరిష్టాలను తాకింది. ఈ కథనంలో ఏడు (ఆగస్టు 16 నుంచి 22 వరకు) రోజుల్లో బంగారం ధర ఏ నగరంలో ఎంత పెరిగిందనే వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఆగస్టు 16న రూ.1,55,130 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఆగస్టు 22 నాటికి 1,63,090 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో పెరిగిన గోల్డ్ రేటు రూ. 7960 అన్నమాట. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఏడురోజుల్లో 1,42,200 రూపాయల నుంచి రూ.1,49,500 వద్దకు (రూ.7300 పెరిగింది) చేరింది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 నుంచి రూ. 1,63,090 వద్దకు చేరింది. అంటే ఏడురోజుల్లో రూ. 7960 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,200 నుంచి రూ.1,49,500 (రూ.7300 పెరిగింది) వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ఇక్కడ రూ.1,55,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,63,240 వద్దకు (రూ.7960 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350 నుంచి రూ.1,49,650 వద్దకు (రూ.7300 పెరిగింది) చేరింది.

ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement