సేవల రంగం జోరు | India services PMI Jumps to 55. 2 in September | Sakshi
Sakshi News home page

సేవల రంగం జోరు

Oct 7 2026 4:05 AM | Updated on Oct 7 2026 4:05 AM

India services PMI Jumps to 55. 2 in September

సెప్టెంబర్‌లో 55.2కు పీఎంఐ సూచీ 

మూడు నెలల గరిష్టం

న్యూఢిల్లీ: దేశీ డిమాండ్, కొత్త ఆర్డర్ల దన్నుతో సేవల రంగం జోరందుకుంది. సెప్టెంబర్‌లో హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సరీ్వసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 55.2కు వృద్ధి చెందింది. ఆగస్టులో ఇది 54.1గా నమోదైంది. అయితే, గతంలో నమోదైన త్రైమాసిక సగటు కంటే సేవల కార్యకలాపాల్లో తాజా క్వార్టర్లో వృద్ధి తక్కువగానే నమోదు కావడం గమనార్హం. 2022 మార్చి తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెపె్టంబర్‌ త్రైమాసికంలో వృద్ధి అత్యంత బలహీనంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. సాధారణంగా పీఎంఐ సూచీ 50కి పైన ఉంటే వృద్ధి కింద.. 50కి దిగువున ఉంటే క్షీణత కింద పరిగణిస్తారు. 

సర్వే ప్రకారం.. డిజిటల్‌ సొల్యూషన్లు, ఆహారం, బీమా, రుణాలు, సాఫ్ట్‌వేర్, రవాణా, టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌కు డిమాండ్‌ భారీగా పుంజుకుంది. అదేవిధంగా భారతీయ సరీ్వసులకు అంతర్జాతీయంగా డిమాండ్‌ కూడా.. ముఖ్యంగా జర్మనీ, యూఏఈ, యూకే, అమెరికా నుంచి మెరుగుపడింది. ఇక ఉద్యోగాల విషయానికొస్తే, ఆర్డర్‌ బుక్స్, ప్రాజెక్టులు పుంజుకోవడంతో సెపె్టంబర్‌ క్వార్టర్లో కంపెనీలు అదనపు ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే, ఆగస్టుతో పోలిస్తే కాస్త తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. కాగా, తయారీ, సేవల రంగాలతో కూడి కాంపొజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ సెప్టెంబర్‌లో చాలా బలంగా 55.9 శాతానికి పెరిగింది. ఆగస్టులో 54.3 శాతంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement